Today Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. స్థిరంగా గోల్డ్ రేట్స్

బంగారం కొనుగోలు చేయాలి అనుకునే వారికి కాస్త ఊరట కలిగింది. ఎందుకంటే కొద్దీ రోజుల ముందు వరకు ఆకాశాన్ని అంటుతున్న బంగారం ధరలు.. ఒక్కసారిగా దిగొచ్చాయి. మరి మార్కెట్ లో నేటి బంగారం ధరలు ఎంతో తెలుసుకుందాం.

బంగారం కొనుగోలు చేయాలి అనుకునే వారికి కాస్త ఊరట కలిగింది. ఎందుకంటే కొద్దీ రోజుల ముందు వరకు ఆకాశాన్ని అంటుతున్న బంగారం ధరలు.. ఒక్కసారిగా దిగొచ్చాయి. మరి మార్కెట్ లో నేటి బంగారం ధరలు ఎంతో తెలుసుకుందాం.

మార్కెట్ లో నేటి బంగారం ధర.. పసిడి ప్రియులకు నిజంగానే ఓ మంచి శుభవార్త. బంగారం కొనుగోలు చేయాలి అనుకునే వారందరికీ ఇదే మంచి అవకాశం. మొన్నటివరకు ఆకాశాన్ని అంటిన బంగారం ధరలు.. దిగొచ్చాయి. ఒక్కసారిగా రూ.2000 పైన దిగొచ్చిన బంగారం ధరలు.. వరుసగా రెండవ రోజు.. మార్కెట్ లో అదే రేటు వద్ద కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఇలా వరుసగా మూడు రోజుల పాటు బంగారం ధరలు దిగిరావడం.. పసిడి ప్రియులకు ఇదే మంచి అవకాశం అని చెప్పి తీరాలి. మార్ వైపు వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరుగుతున్నాయి. మరి ఈ క్రమంలో మార్కెట్ లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేట్స్ భారీగానే పెరిగాయి. నిన్నటితో కంపేర్ చేస్తే.. స్పాట్ గోల్డ్ రేట్ .. ఔన్స్ కు 20 డాలర్ల వరకు పెరిగింది. ఇక ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్ కు 2308 డాలర్స్ వద్ద కొనసాగుతుంది. మరో వైపు సిల్వర్ రేట్ విషయానికొస్తే.. ఔన్సు కు 29.54 డాలర్స్ వద్ద కొనసాగుతుంది. ఇక హైదరాబాద్ లో నేడు అంటే జూన్ 11 వ తేదీన బంగారం, వెండి ధరల విషయానికొస్తే.. ప్రస్తుతం వరుసగా రెండవ రోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. క్రితం రోజు 24 క్యారెట్ల గోల్డ్ రేట్.. 10 గ్రాములకు రూ.2000 వేలు తగ్గింది. ఇక ఈరోజు కూడా అదే ధరకు రూ. 71 వేల 670 గా కొనసాగుతుంది. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ విషయానికొస్తే.. ఈరోజు తులానికి రూ. 65 వేల 700 వద్ద కొనసాగుతుంది. ఇక ఢిల్లీ లో చూసినట్లయితే.. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర.. తులానికి రూ. 71 వేల 820 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ ధర.. 0 గ్రాములకు రూ. 65 వేల 850 వద్ద ట్రేడింగ్ అవుతుంది.

బంగారం ధరలు ఇలా స్థిరంగా కొనసాగుతున్నాయని.. పసిడి ప్రియులు ఊరట చెందేలోపే.. వెండి ధరలు మాత్రం క్రమంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ లో నేటి వెండి ధరల విషయానికొస్తే.. మార్కెట్ లో నేడు వెండి ధర రూ.200 పెరిగి రూ. 96 వేల 200 వద్ద కొనసాగుతుంది. ఢిల్లీ మార్కెట్ లో చూసినట్లయితే.. కిలో వెండి రేటు.. రూ. 200 పెరిగి రూ. 91 వేల 700 వద్ద కొనసాగుతుంది. ఈ ధరలన్నీ కూడా ఎటువంటి జీఎస్‌టీ, టీసీఎస్ లాంటి టాక్స్ లు కలపకుండా ఉన్న రేట్స్. ఒకవేళ ఈ ధరలకు టాక్స్ లు కూడా యాడ్ అయితే.. ఇప్పుడు చెప్పుకున్న ధరలలో అటు ఇటుగా మార్పులు జరుగుతాయి. మరి నేటి బంగారం ధరల విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments