Gold Price: ఒక్కసారిగా షాకిచ్చిన బంగారం ధర.. నేడు ఎంత పెరిగిందంటే

Gold, Silver Price On Aug 3rd: గత వారంలో దిగి వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు మాత్రం మళ్లీ వరుసగా పెరుగుతూ షాకిస్తున్నాయి. ఆ వివరాలు..

Gold, Silver Price On Aug 3rd: గత వారంలో దిగి వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు మాత్రం మళ్లీ వరుసగా పెరుగుతూ షాకిస్తున్నాయి. ఆ వివరాలు..

కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత బంగారం ధర భారీగా దిగి రాసాగింది. బడ్జెట్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం.. ఖరీదైన లోహాల మీద సుంకాన్ని తగ్గించింది. 6 శాతంగా ప్రకటించడంతో.. దేశీయ బులియన్‌ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు భారీగా దిగి వచ్చాయి. అసలే శుభకార్యాల సీజన్‌ రాబోతుంది.. బంగారం ధర ఇలానే తగ్గితే.. ఎంతో కొంత కొనాలని చాలా మంది భావించారు. ధర దిగి వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న వారికి గత రెండు, మూడు రోజులుగా నిరాశే ఎదురవుతుంది. భారీగా దిగి వచ్చిన బంగారం ధర.. ఇప్పుడు మళ్లీ పాత పంథాలో పయనిస్తుంది. తగ్గిందని సంబరపడేలోపు.. పైపైకి ఎగబాకి షాకిస్తుంది. మరి నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు ఎంత పెరిగాయి.. పది గ్రామలు ధర ఎంత ఉందనే వివరాలు మీ కోసం..

నేడు భాగ్యనగరంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. గత కొన్ని రోజులుగా దిగి వస్తోన్న ధర.. ఇప్పుడు మళ్లీ పెరిగింది. ఇక ఇవాళ హైదరాబాద్‌లో బంగారం ధర ఒక్కసారిగా పెరిగి షాకిచ్చింది. నేడు భాగ్యనరంలో బంగారు ఆభరణాల తయారీకి వినియోగించే పసిడి ధర పది గ్రాముల మీద 150 రూపాయలు పెరిగింది. దాంతో శనివారం హైదరాబాద్‌లో 22 క్యారెట్‌ గోల్డ్‌ పది గ్రాముల రేటు 64,810 రూపాయలకు చేరింది. అలానే 24 క్యారెట్‌ మేలిమి బంగారం ధర కూడా ఎగబాకింది. పది గ్రాముల మీద 180 రూపాయలు పెరిగింది. దాంతో 24 క్యారెట్‌ స్వచ్ఛమైన మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ. 70,700కి చేరుకుంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా నేడు గోల్డ్‌ రేటు పైకి ఎగబాగింది. ఇవాళ హస్తినలో 22 క్యారెట్‌ బంగారం పది గ్రాముల మీద 150 పెరిగి.. రూ.64,960లకు చేరుకుంది. అలానే 24 క్యారెట్‌ మేలిమి బంగారం రేటు పది గ్రాముల మీద 180 రూపాయలు పెరిగి 70,850 రూపాయలకు చేరుకుంది.

బంగారం బాటలోనే వెండి..

నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధర పెరగ్గా.. వెండి రేటు కూడా అదే బాటలో పయనించింది. ఇవాళ అనగా శనివారం నాడు.. దేశీయ బులియన్‌ మార్కెట్‌లో సిల్వర్‌ రేటు కేజీ మీద 100 రూపాయలు పెరిగింది. ఇక నేడు హైదరాబాద్‌లో శనివారం నాడు వెండి ధర కిలో మీద 100 రూపాయలు పెరిగి 90,900లకు చేరింది. అలానే ఢిల్లీలో సిల్వర్‌ రేట కిలో మీద రూ.100 పెరిగి రూ.86,400లు. హైదరాబాద్‌, ఢిల్లీలో బంగారం, వెండి ధరల్లో మార్పులు ఉంటాయి. ఇవి స్థానికంగా విధించే పన్నుల వల్ల ఈ తేడాలు కనిపిస్తుంటాయి.

Show comments