Gold Price: పసిడిప్రియులకు ఊరట.. వరుసగా తగ్గుతున్న గోల్డ్‌ రేటు.. నేడు భారీగా తగ్గిన వెండి ధర

బంగారం కొనాలనుకునే వారికి భారీ ఊరట కలిగించే వార్త అని చెప్పవచ్చు. క్రితం సెషన్‌లో స్వల్పంగా తగ్గిన రేటు.. నేడు స్థిరంగా ఉంది. వెండి ధర మాత్రం భారీగా తగ్గింది. ఆ వివరాలు..

బంగారం కొనాలనుకునే వారికి భారీ ఊరట కలిగించే వార్త అని చెప్పవచ్చు. క్రితం సెషన్‌లో స్వల్పంగా తగ్గిన రేటు.. నేడు స్థిరంగా ఉంది. వెండి ధర మాత్రం భారీగా తగ్గింది. ఆ వివరాలు..

ప్రస్తుతం మన దగ్గర శుభకార్యాల సీజన్‌ కాదు. దాంతో బంగారం కొనుగోళ్లు భారీగా పడిపోయాయి. ఎందుకంటే మన భారతీయులకు బంగారంతో అవినాభావ సంబంధం ఉంది. మన వాళ్లకు గోల్డ్‌ అంటే ఎంత మోజు అంటే.. చిన్న చిన్న శుభకార్యల మొదలు.. పండగలు ఇలా ప్రతి సందర్భంలో ఎంతో కొంత బంగారం కొనుగోలు చేస్తుంటారు. దాన్ని సెంటిమెంట్‌గా భావిస్తారు. ఇక గోల్డ్‌ లేకుండా మన దగ్గర పెళ్లిల్లు జరగవు. ఎంత పేదవాళ్లైనా సరే.. వివాహాల వేళ అప్పు చేసైనా సరే.. ఎంతో కొంత పసిడి కొనుగోలు చేస్తారు. అయితే ఈ పదేళ్ల కాలంలో బంగారం ధర దూసుకుపోతుంది. ఇక ఈ ఏడాది అయితే పసిడి రేటు గరిష్టాలకు చేరుకుంది. ఇప్పటికే 70 వేల మార్కును దాటిన బంగారం ధర.. ఈ ఏడాదికి చివరి నాటి 10 గ్రాముల గోల్డ్‌ రేటు లక్ష రూపాయలకు చేరనుంది అని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక గత కొన్ని రోజులుగా పెరుగుతోన్న బంగారం ధర ఇప్పుడు క్రమంగా దిగి వస్తోంది. ఇక నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి అంటే..

నేడు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉండటంతో.. మన దేశంలో కూడా అదే పంథా కొనసాగింది. నేడు హైదరాబాద్‌ మార్కెట్‌లో 22 క్యారెట్‌ బంగారం పది గ్రాముల రేటు స్థిరంగా ఉంది. ఇక భాగ్యనగరంలో గురువారం నాడు 22 క్యారెట్‌ పసిడి రేటు పది గ్రాముల రేటు 66,190 వద్ద స్థిరంగా ఉంది. అలానే 24 క్యారెట్‌ స్వచ్ఛమైన బంగారం రేటు కూడా స్థిరంగా ఉంది. దాంతో నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్‌ ప్యూర్‌ గోల్డ్‌ పది గ్రాముల రేటు 72,210 రూపాయల వద్ద స్థిరంగా కొనసాగుతుంది.

అలానే దేశ రాజధాని ఢిల్లీలో కూడా నేడు పసిడి రేటు నేడు స్థిరంగా ఉంది. నేడు హస్తినలో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్‌ పది గ్రాముల బంగారం ధర క్రితం సెషన్‌లో ఎంత ఉందో.. అదే నేడు కూడా కొనసాగింది. అంటే నేడు ఢిల్లీలో 22 క్యారెట్‌ 10 గ్రాముల రేటు రూ. 66,190వద్ద స్థిరంగా ఉంది. అలానే 24 క్యారెట్‌ స్వచ్ఛమైన గోల్డ్‌ రేటు పది గ్రాముల ధర.. రూ. 72,210 వద్ద కొనసాగుతోంది.

దిగి వచ్చిన వెండి రేటు..

ఇక నేడు బంగారం ధరలు స్థిరంగా ఉండగా.. వెండి రేటు మాత్రం భారీగా దిగి వచ్చింది. నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో సిల్వర్‌ రేటు కిలో మీద 500 రూపాయలు తగ్గింది. ఇక నేడు ఢిల్లీలో సిల్వర్‌ రేటు కేజీ మీద 500 రూపాయలు తగ్గి.. రూ. 91 వేల మార్కు వద్ద ఉంది. అంతకుముందు రోజు రూ. 500 పెరిగింది. ఇక హైదరాబాద్ నగరంలో కూడా సిల్వర్ రేటు రూ. 500 పతనంతో మళ్లీ కిలోకు రూ. 95,600 మార్కుకు చేరింది.

Show comments