Gold Price: పసిడి ప్రియలుకు ఊరట.. దిగి వచ్చిన బంగారం ధర

గత వారంలో పెరుగుతూ పోయిన బంగారరం, వెండి ధరలు.. నేడు కాస్త శాంతించాయి. ఇవాళ గోల్డ్‌, సిల్వర్‌ రేట్లు కాస్త దిగి వచ్చాయి. మరి నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో ధర ఎంతుంది అంటే..

గత వారంలో పెరుగుతూ పోయిన బంగారరం, వెండి ధరలు.. నేడు కాస్త శాంతించాయి. ఇవాళ గోల్డ్‌, సిల్వర్‌ రేట్లు కాస్త దిగి వచ్చాయి. మరి నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో ధర ఎంతుంది అంటే..

బంగారం ధరలు స్థిరంగా ఉండటం లేదు. కొన్ని రోజుల పాటు వరసగా దిగి వస్తే.. మరి కొన్ని రోజుల పాటు దూసుకుపోతున్నాయి. గోల్డ్‌ రేటులో మార్పులు చూసి జనాలు కొనాలో వద్దో అర్థం కాక.. అయోమయానికి గురవుతున్నారు. ఓ రెండు నెలలుగా పండగలు, శుభకార్యాలు లేకపోవడంతో.. పసిడి కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయి. దానికి తోడు ధర కూడా కొన్ని రోజుల పాటు విపరీతంగా పెరిగింది. కానీ ఇప్పుడు రేటుతో సంబంధం లేకుండా బంగారం కొనుగోళ్లు జోరందుకోనున్నాయి ఎందుకంటే.. శుభకార్యల సీజన్‌ రాబోతుంది.

ఇప్పటికే ఆషాఢ మాసం మొదలైంది. పండగల సీజన్‌ మొదలు కాబోతున్న తరుణంలో బంగారానికి గిరాకీ మరింత పెరుగుతుంది. దాంతో రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంది.  ఇక వచ్చే నెల నుంచి పెళ్లిళ్ల సీజన్ సైతం మొదలవుతుంది. శుభకార్యాలు, పండగలు మొదలు కానుండటంతో.. పసిడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు. ఈనేపథ్యంలో నేడు అనగా సోమవారం నాడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధర కాస్త దిగి వచ్చింది. మరి నేడు ఢిల్లీ, హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎంత ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

నేడు హైదరాబాద్ మార్కెట్లో చూసుకుంటే బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆభరణాల తయారీకి వినియోగించే 22 ‍క్యారెట్‌ గోల్డ్ రేటు 10 గ్రాముల ధర స్థిరంగా ఉండి.. క్రితం సెషన్‌ రేటు వద్దనే అనగా రూ. 67,650 వద్ద కొనసాగుతోంది. అలానే 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర కూడా ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉంది. నేడు భాగ్యనగరంలో 24 క్యారెట్‌ పది గ్రాముల రేటు రూ. 73,800 వద్ద అమ్ముడవుతోంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్ విషయానికి వస్తే అక్కడ కూడా బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. నేడు హస్తినలో 22 క్యారెట్‌ పుత్తడి పది గ్రాముల ధర రూ. 67,800 వద్ద ఉండగా.. 24 క్యారెట్‌ స్వచ్ఛమైన మేలిమి బంగారం ధర కూడా రూ. 73,950 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

స్వల్పంగా దిగి వచ్చిన వెండి రేటు..

నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధర స్థిరంగా ఉండగా.. వెండి రేటు మాత్రం చాలా స్వల్పంగా దిగి వచ్చింది. ఇక హైదరాబాద్  క్రితం రోజుతో పోలిస్తే.. నేడు వెండి ధర కిలో మీద రూ.100 తగ్గింది. దాంతో ఇవాళ భాగ్యగరంలో కిలో వెండి వెండి ధరరూ. 99,200 వద్ద అమ్ముడవుతోంది. ఇక ఢిల్లీ మార్కెట్లో వెండి ధర దిగి వచ్చింది. హస్తినలో నేడు వెండి ధర కిలో మీద 100 రూపాయలు దిగి వచ్చి.. రూ. 94,700 వద్ద అమ్ముడవుతోంది.

Show comments