Dharani
Today Gold Price: బంగారం కొందామనుకునేవారికి భారీ ఊరట అని చెప్పవచ్చు. క్రితం సెషన్‌లో దిగి వచ్చిన రేటు.. ఇవాళ మళ్లీ తగ్గింది. ఆ వివరాలు..
Today Gold Price: బంగారం కొందామనుకునేవారికి భారీ ఊరట అని చెప్పవచ్చు. క్రితం సెషన్‌లో దిగి వచ్చిన రేటు.. ఇవాళ మళ్లీ తగ్గింది. ఆ వివరాలు..
Dharani
శ్రావణమాసం అంటేనే పండగల సీజన్. ఈ మాసంలో మహిళలు కచ్చితంగా ఎంతో కొంత బంగారం కొనుగోలు చేస్తారు. గత నెల వరకు కూడా భారీగా పెరిగిన గోల్డ్ రేటు.. బడ్జెట్ తర్వాత రోజు నుంచి దిగి రాసాగింది. పసిడి ధర ఇంత భారీ ఎత్తున పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. పైగా పండగల సీజన్‌లో రేటు దిగి రావడంతో.. పసిడి కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఈ ఏడాది 24 క్యారెట్ గోల్డ్ రేటు 75 వేల రూపాయలకు చేరగా.. తాజాగా అది 70 వేల కిందకు దిగి వచ్చింది. ఇక 22 క్యారెట్ గోల్డ్ రేటు 63 వేల పైచిలుకు పలుకుతుంది. ఇదిలా ఉండగా క్రితం సెషన్‌లో భారీగా దిగి వచ్చిన పుత్తడి ధర.. ఈ రోజు కూడా పడిపోయింది. మరీ నేడు దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఎంత ఉన్నాయంటే..
ఇవాళ హైదాబారాబాద్ బులియన్ మార్కెట్‌లో గోల్డ్ రేటు దిగి వచ్చింది. ఆభణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్ బంగారం పది గ్రాముల మీద రూ.400 దిగి వచ్చింది. దాంతో నేడు భాగ్యనగరంలో 22 క్యారెట్ గోల్డ్ పది గ్రాముల ధర 63,500 రూపాయల వద్దకు దిగి వచ్చింది. అలానే 24 క్యారెట్ స్వచ్ఛమైన మేలిమి బంగారం రేటు నేడు పడిపోయింది. ఇవాళ భాగ్యనగరంలో 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్ పది గ్రాముల ధర 440 రూపాయలు దిగి వచ్చి.. రూ.69,270 వద్ద అమ్ముడవుతోంది. క్రితం సెషన్‌లో ఇది పది గ్రాముల మీద 870 రూపాయలు పడిపోయింది. రెండు రోజుల్లో కలిపి ఏకంగా పది గ్రాముల మీద 1300 రూపాయలు దిగి రావడం గమనార్హం.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు దిగి వస్తున్నాయి. నేడు హస్తినలో 22 క్యారెట్ బంగారం పది గ్రాముల మీద రూ.400 తగ్గి.. 63,650 రూపాయల వద్ద అమ్ముడవుతోంది. అలానే 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్ రేటు 10 గ్రాముల మీద 440 రూపాయలు దిగి వచ్చి.. రూ.69,420 అమ్ముడవుతోంది. హైదరాబాద్‌తో పోలిస్తే ఢిల్లీలో బంగారం, వెండి ధరల్లో స్వల్ప తేడాలుంటాయి. స్థానికంగా ఉండే పన్నుల వల్ల ఇలా జరుగుతుంది.
హైదరాబాద్ మార్కెట్లో వెండి రేటు కుప్పకూలుతోంది. కిలో వెండి ధర క్రితం రోజు రూ.3500 తగ్గగా ఇవాళ మరో రూ.500 దిగి వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రేటు రూ. 87 వేల వద్దకు దిగివచ్చింది. ఇక ఢిల్లీ మార్కెట్లో చూసుకుంటే కిలో వెండి రేటు ఇవాళ మరో రూ.500 తగ్గి రూ. 82 వేల వద్దకు పడిపోయింది.