Gold & Silver Price Decreased On May 31st: భారీ ఊరట.. దిగివస్తోన్న పసిడి ధర.. ఈ ఛాన్స్‌ మిస్సైతే బాధపడతారు

Gold Price: భారీ ఊరట.. దిగివస్తోన్న పసిడి ధర.. ఈ ఛాన్స్‌ మిస్సైతే బాధపడతారు

Gold And Silver Price: బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే మీరు ఈ రోజు మంచి అవకాశం. త్వరపడండి. ఆలస్యం చేస్తే మళ్లీ రేటు పెరిగే ఛాన్స్‌ ఉంది. నేడు బంగారం, వెండి ధరలు భారీగా దిగివచ్చాయి. ఆ వివరాలు..

Gold And Silver Price: బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే మీరు ఈ రోజు మంచి అవకాశం. త్వరపడండి. ఆలస్యం చేస్తే మళ్లీ రేటు పెరిగే ఛాన్స్‌ ఉంది. నేడు బంగారం, వెండి ధరలు భారీగా దిగివచ్చాయి. ఆ వివరాలు..

బంగారం అంటే భారతీయులకు ఎంత మోజో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంత చిన్న శుభకార్యం చేసినా.. పండుగ వచ్చినా కచ్చితంగా పసిడి కొనుగోలు చేస్తారు. ఇక దీపావళి, ధన్‌తెరాస్‌, అక్షయతృతియ వంటి పర్వదినాల వేళ బంగారం కొనగోళ్లు భారీగా ఉంటాయి. అయితే మన దేశం విదేశాల నుంచి పసిడి దిగుమతి చేసుకుంటుంది. మన దేశంలో ఉన్నన్ని బంగారం నిల్వలు మరెక్కడా లేవు. మన దగ్గర పసిడి దిగుమతి చాలా తక్కువ కనుక పుత్తడికి డిమాండ్‌ ఎక్కువ.. ధర కూడా భారీగానే ఉంటుంది. ఇక ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం రేటు.. రాకెట్‌ వేగంతో పరుగులు తీస్తుంది. ఇప్పటికే ఈ ఏడాది గరిష్టాలకు చేరింది గోల్డ్‌ రేట్‌. వెండి రేటు అయితే ఏకంగా లక్ష రూపాయల మార్క్‌ దాటేసింది. ఇక గత కొన్ని రోజులుగా పరుగులు తీస్తున్న పుత్తడి ధర ఇవాళ కాస్త శాంతించింది. మరి నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో గోల్డ్‌ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

గత కొన్ని రోజులుగా పెరగడమే తప్ప దిగి రావడం తెలియదు అన్నట్లుగా ఉన్న పసిడి పరుగుకు నేడు బ్రేక్‌ పడింది. ఇవాళ గోల్డ్‌ రేటు దిగి వచ్చింది. నేడు అనగా శుక్రవారం నాడు హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు భారీగానే పడిపోయాయి. నేడు భాగ్యనగరంలో 24 క్యారెట్‌ మేలిమి బంగారం రేటు పది గ్రాముల మీద రూ. 440 మేర దిగివచ్చింది. ఈక్రమంలో నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్‌ స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ. 72, 760 వద్ద ఉంది. అలానే ఆభరణాల తయారీకి వినియోగించే.. 22 క్యారెట్‌ బంగారం రేటు 10 గ్రాములకు రూ. 400 తగ్గింది. నేడు అనగా శుక్రవారం నాడు హైదరాబాద్‌లో 22 క్యారెట్‌ గోల్డ్‌ 10 గ్రాముల ధర రూ. 66,700 కు చేరింది.

ఇక దేశ రాజధాని హస్తినలో కూడా నేడు పసిడి రేటు దిగి వచ్చింది. నేడు హస్తినలో 24 క్యారెట్‌ ప్యూర్‌ గోల్డ్‌ ధర పది గ్రాముల మీద రు. 440 తగ్గింది. దాంతో శుక్రవారం నాడు ఢిల్లీలో 24 క్యారెట్‌ బంగారం 10 గ్రాముల ధర రూ. 72,910 వద్దకు దిగి వచ్చింది. అలానే 22 క్యారెట్‌ పసిడి రేటు కూడా తగ్గింది. నేడు ఢిల్లీలో 22 క్యారెట్‌ గోల్డ్‌ ధర 10 గ్రాముల మీద రూ. 400 తగ్గి రూ. 66,850 వద్ద ఉంది. ఇక ఢిల్లీ, హైదరాబాద్‌లో బంగారం ధరల్లో వ్యత్సానికి కారణం.. స్థానికంగా ఉండే పన్నులు

రూ. 1200 తగ్గిన వెండి..

ఇక ఈ మధ్య కాలంలో వెండి రేటు రాకెట్‌ స్పీడుతో దూసుకుపోతుంది. లక్ష రూపాయల మార్కు దాటేసింది. గత కొన్ని రోజులుగా పరుగులు తీస్తోన్న వెండి ధర నేడు మాత్రం తగ్గింది. ఇక శుక్రవారం నాడు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వెండి రేటు భారీగా పడిపోయింది. నేడు భాగ్యనరంలో సిల్వర్‌ రేటు కిలో మీద ధర రూ.1200 తగ్గి.. లక్ష రూపాయల దిగువకు వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రేటు రూ. 98,900కు చేరింది. ఇక ఢిల్లీ మార్కెట్లో చూసుకుంటే కిలో వెండి ధర రూ. 1200 తగ్గి రూ. 96,500 మార్క్ వద్ద ఉంది. అటు అంతర్జాతీయ మార్కెట్‌లో సైతం నేడు బంగారం, వెండి ధరలు దిగి వచ్చాయి.

Show comments