కారు కొంటారా? ఈ కార్లు చాలా సేఫ్.. క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్!

Best Safe Cars: కారు కొనాలనుకునేవారు ఖచ్చితంగా క్రాష్ టెస్టులో కారుకి ఉన్న రేటింగ్ ఎంత అనేది దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఎంత జాగ్రత్తగా నడిపినా కూడా అవతల వచ్చేవాళ్ళు సరిగా నడపకపోవచ్చు. ఇలాంటి సమయాల్లో మనల్ని సురక్షితంగా ఉంచే కార్లు కొనుక్కోవడమే ఉత్తమం. ఇవాళ్టి కథనంలో అలాంటి కార్ల గురించి తెలుసుకోబోతున్నారు.

Best Safe Cars: కారు కొనాలనుకునేవారు ఖచ్చితంగా క్రాష్ టెస్టులో కారుకి ఉన్న రేటింగ్ ఎంత అనేది దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఎంత జాగ్రత్తగా నడిపినా కూడా అవతల వచ్చేవాళ్ళు సరిగా నడపకపోవచ్చు. ఇలాంటి సమయాల్లో మనల్ని సురక్షితంగా ఉంచే కార్లు కొనుక్కోవడమే ఉత్తమం. ఇవాళ్టి కథనంలో అలాంటి కార్ల గురించి తెలుసుకోబోతున్నారు.

కారు కొనాలనుకునేవారు ఖచ్చితంగా చూడాల్సింది క్రాష్ టెస్టులో ఎంత రేటింగ్ సంపాదించుకున్నాయి అనేది. ఎప్పుడైనా ఏదైనా యాక్సిడెంట్ అయితే ప్రాణాలతో సురక్షితంగా బయటపడేయగల కార్లు ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో మళ్ళీ పెద్దలకు ఒక రకమైన సేఫిటీ, పిల్లలకు ఒక రకమైన సేఫిటీ ఉంటుంది. ఈ రెండిటిలో అత్యధిక స్కోర్ సంపాదించుకోవడం అనేది చాలా కష్టం. కానీ టాటా కంపెనీకి చెందిన ఈ రెండు కార్లు మాత్రం క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ దక్కించుకున్నాయి. మన దేశంలో తయారయ్యే టాటా కార్లకు సేఫిటీ విషయంలో మంచి పేరు ఉంది. నాణ్యతలో నంబర్ వన్ గా ఉంది. క్రాష్ టెస్ట్ లో టాటా పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ కార్లకు 5 స్టార్ రేటింగ్ వచ్చాయి. భారత ఎన్సీఏపీ సేఫ్టీలో ఈ టాటా కార్లు 5 స్టార్ రేటింగ్ దక్కించుకున్నాయి.

ఈ విషయాన్ని టాటా మోటార్స్ అనుబంధ సంస్థ టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ వెల్లడించింది. అడల్ట్ యాక్సిడెంట్ ప్రొటెక్షన్ లో 32కి 31.46 పాయింట్లు, చైల్డ్ యాక్సిడెంట్ ప్రొటెక్షన్ లో 49కి 45 పాయింట్లు సాధించింది పంచ్ ఈవీ కారు. ఇప్పటి వరకూ ఏ వాహనం కూడా అత్యధిక స్కోర్లను సాధించలేదు. దీంతో టాటా పంచ్ ఈవీ ఈ అరుదైన ఘనత సాధించింది. నెక్సాన్ ఈవీ విషయానికొస్తే.. ఇది అడల్ట్ యాక్సిడెంట్ ప్రొటెక్షన్ లో 32కి 29.86 పాయింట్లు, చైల్డ్ యాక్సిడెంట్ ప్రొటెక్షన్ లో 49కి 44.95 పాయింట్లు దక్కించుకుంది. దీంతో టాటా మోటార్స్ భారత్ ఎన్ క్యాప్, గ్లోబల్ ఎన్ క్యాప్ టెస్టుల్లో 5 స్టార్ స్కోర్ చేసి సురక్షితమైన ఎస్యూవీ శ్రేణి కార్ల పోర్ట్ ఫోలియో కలిగిన సొంత తయారీ సంస్థగా నిలిచింది.

ఇక దీనిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. భారత్ ఎన్క్యాప్ కింద టాటా పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ పంచ్ కార్లకు 5 స్టార్ రేటింగ్ దక్కించుకున్న టాటా మోటార్స్ కి అభినందనలు తెలియజేశారు. ఈ సర్టిఫికేషన్ దేశంలో సురక్షిత వాహనాల పట్ల భారత ప్రభుత్వ దర్శనీయతకు అనుగుణంగా ఉంటుందని.. దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమను ఆతనిర్భర్ భారత్ గా మార్చడంలో భారత్ ఎన్క్యాప్ పాత్రను నొక్కి చెబుతుందని నితిన్ గడ్కరీ అన్నారు. ఇక టాటా పంచ్ ఈవీ విషయానికొస్తే.. ఇది లాంఛ్ అయినప్పటి నుంచి విశేష ఆదరణను సొంతం చేసుకుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల మార్కెట్ల నుంచి 35 శాతానికి పైగా వినియోగదారులు ఉండడం విశేషం. 10 వేల మందికి పైగా ఈ పంచ్ ఈవీని కొనుగోలు చేశారు. ఇక నెక్సాన్ ఈవీ 2020లో లాంఛ్ అయ్యింది. ఇప్పటి వరకూ 68 వేలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. 

Show comments