HYDలో మరో బాచుపల్లిగా ఆ ఏరియాలు.. మిడిల్ క్లాస్ వారు లక్షాధికారులయ్యే ఛాన్స్!

Another Bachupally: బాచుపల్లి ఏరియాని హైదరాబాద్ బాహుబలిగా పిలుస్తుంటారు. ఈ ఏరియాలో గజం స్థలం 60 వేలు పైనే ఉంది. అయితే ఒకప్పుడు 5 వేల లోపే ఉండేది. అయితే అప్పుడు ఇన్వెస్ట్ చేయలేదని బాధపడేవారికి ఇప్పుడు పెట్టుబడి పెట్టే ఛాన్స్ వచ్చింది. మరో బాచుపల్లిగా పిలవబడే ఏరియాల్లో పెట్టుబడి పెడితే ఫ్యూచర్ లో భారీ లాభాలను పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు.

Another Bachupally: బాచుపల్లి ఏరియాని హైదరాబాద్ బాహుబలిగా పిలుస్తుంటారు. ఈ ఏరియాలో గజం స్థలం 60 వేలు పైనే ఉంది. అయితే ఒకప్పుడు 5 వేల లోపే ఉండేది. అయితే అప్పుడు ఇన్వెస్ట్ చేయలేదని బాధపడేవారికి ఇప్పుడు పెట్టుబడి పెట్టే ఛాన్స్ వచ్చింది. మరో బాచుపల్లిగా పిలవబడే ఏరియాల్లో పెట్టుబడి పెడితే ఫ్యూచర్ లో భారీ లాభాలను పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు.

స్థలం కొనుక్కుని కొన్నాళ్ల తర్వాత ఇల్లు కట్టుకుని అందులో నివసించాలనో లేక ఇల్లు కట్టి అద్దెకు ఇవ్వాలనో లేక స్థలం కొనుక్కుని మంచి రేటు వచ్చాక అమ్ముకోవాలనో అని అనుకునేవారికి ఇది మంచి అవకాశం. ముఖ్యంగా మధ్యతరగతి వ్యక్తులకు సువర్ణావకాశం. తక్కువ ధరకు అందుబాటులో ఉండగా స్థలం మీద పెట్టుబడి పెడితే ఫ్యూచర్ లో లక్షలు సంపాదించవచ్చు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేసి చాలా మంది బాగుపడ్డారు. భూమిని నమ్ముకున్నవాళ్ళు మోసపోరు. మీరు కనుక ఇప్పుడు ఈ ప్రాంతాల్లో పెట్టుబడి పెడితే కనుక రాబోయే రోజుల్లో ఊహించని లాభాలను సొంతం చేసుకోవచ్చు.   

హైదరాబాద్ ఇప్పుడు తన పరిధిని పెంచుకుంటుంది. హెచ్ఎండీఏ పరిధిని కూడా పెంచుతున్నారు. అవుటర్ రింగ్ రోడ్ బయట ఉన్న స్థలాల రేట్లు తక్కువగా ఉన్నాయి. ఈ అవుటర్ రింగ్ రోడ్ బయట స్థలాలు కొన్నప్పటికీ కూడా సిటీ లోపల తీసుకున్నట్టే ఉంటుంది. ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ వస్తే అవుటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ నగరంలో ఉన్నట్టే ఉంటుంది. ఒకప్పుడు అవుటర్ రింగ్ రోడ్ రాకముందు వరకూ బండ్లగూడ జాగీర్, నిజాంపేట, బాచుపల్లి వంటి ఏరియాలన్నీ హైదరాబాద్ బయట ఉన్నట్టే ఉండేది. ఎప్పుడైతే అవుటర్ రింగ్ రోడ్ పడిందో.. అప్పుడు ఈ ఏరియాలన్నీ సిటీ లోపల ప్రాంతాలుగా పరిగణించబడ్డాయి. దీని వల్ల ఆ ప్రాంతాలకు డిమాండ్ అనేది పెరిగిపోయింది. బాచుపల్లిలో ఇప్పుడు గజం 60 వేలు ఉంది.

అవుటర్ రింగ్ రోడ్ పడకముందు వరకూ గజం ఇక్కడ 3 వేలు, 5 వేలుగా ఉండేది. అలానే ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ బయట ఉన్న ఏరియాలు కూడా రీజనల్ రింగ్ రోడ్ పడ్డాక సిటీ లోపల ప్రాంతాలుగా పరిగణించబడతాయి. హైదరాబాద్ సిటీ లిమిట్ అనేది పెరుగుతుంది. కాబట్టి అవుటర్ రింగ్ రోడ్ అవతల ఉన్న ఏరియాల్లో స్థలాలు కొనుక్కుంటే ఫ్యూచర్ లో మంచి లాభాలను పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు. యాచారం, కొంపల్లి, కీసర, జీడిమెట్ల, సూరారం, చౌటుప్పల్, ఘట్కేసర్ వైపు ఉన్న స్థలాల మీద పెట్టుబడి పెట్టడం అనేది మిడిల్ క్లాస్ వారికి మంచి అవకాశం అని చెబుతున్నారు. మెట్రో కూడా అన్ని వైపులా విస్తరిస్తోంది. అవుటర్ రింగ్ రోడ్ ని బేస్ చేసుకుని రింగ్ రైల్ ప్రాజెక్ట్ కూడా ప్రతిపాదనలో ఉంది. ఇవన్నీ వస్తే ఈ ఏరియాల్లో రియల్ ఎస్టేట్ డిమాండ్ అనేది పెరుగుతుందని చెబుతున్నారు.   

గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ధరల్లో మార్పులు ఉండవచ్చు. గమనించగలరు.

Show comments