Swetha
Gambler trailer: ప్రేక్షకులలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు సంగీత్ శోభన్. ఇక ఇప్పుడు ఈ హీరో నుంచి వస్తున్న మరో మూవీ గ్యాంబ్లర్.ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమా మీద క్యూరియాసిటీని పెంచగా... ట్రైలర్ ఇంకాస్త అంచనాలను పెంచేసింది.

యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ ను అందిస్తూ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో వస్తున్నాడు సంగీత్ శోభన్. ప్రేక్షకులలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ హీరో నుంచి వస్తున్న మరో మూవీ గ్యాంబ్లర్. ఈ సినిమాలో కేసీఆర్ ఫేమ్ రాకింగ్ రాకేష్ పృథ్వీరాజ్ బన్న, సాయి శ్వేత, , జస్విక, భరణి శంకర్, మల్హోత్త్ర శివ, శివారెడ్డి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. కేఎస్‌కే చైతన్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. జూన్ 6 న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. రిలీజ్ కు ఇంకా ఎంతో సమయం లేకపోవడంతో మూవీ టీం ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు.
ఇక రీసెంట్ గా ఈ మూవీ కి సంబందించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమా మీద క్యూరియాసిటీని పెంచగా… ట్రైలర్ ఇంకాస్త అంచనాలను పెంచేసింది. ఇప్పటివరకు సంగీత్ శోభన్ నుంచి కేవలం కామిడి యాంగిల్ ను మాత్రమే చూసిన ప్రేక్షకులకు ఈ సినిమా కొత్తగా అనిపించడం ఖాయం. ఆల్రెడీ ఈ హీరోకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.. ఇక ఇప్పుడు సరికొత్త అంశాలతో కంప్లీట్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ‘గ్యాంబ్లర్’ మూవీ రాబోతుంది. ఇక ఈ మూవీ ఎంతవరకు సస్సెస్ అవుతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.