iDreamPost
android-app
ios-app

వీడియో వైరల్: అమెజాన్ కొరియర్ లో కోబ్రా.. షాక్ తిన్న కస్టమర్లు

  • Published Jun 19, 2024 | 3:54 PMUpdated Jun 19, 2024 | 3:54 PM

ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో ఇప్పటి వరకు ఒక వస్తువు ఆర్డర్ చేస్తే బదులుగా మరొక వస్తువు డెలవరీ అయ్యేది. కానీ, తాజాగా ఓ వ్యక్తి ఆర్డర్ చేసిన వస్తువు డెలవరీ కాగా, దానిని ఓపెన్ చేసి చూస్తే ఒక్కసారిగా భయంకరమైన పరిస్థితి ఏర్పడింది.

ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో ఇప్పటి వరకు ఒక వస్తువు ఆర్డర్ చేస్తే బదులుగా మరొక వస్తువు డెలవరీ అయ్యేది. కానీ, తాజాగా ఓ వ్యక్తి ఆర్డర్ చేసిన వస్తువు డెలవరీ కాగా, దానిని ఓపెన్ చేసి చూస్తే ఒక్కసారిగా భయంకరమైన పరిస్థితి ఏర్పడింది.

  • Published Jun 19, 2024 | 3:54 PMUpdated Jun 19, 2024 | 3:54 PM
వీడియో వైరల్: అమెజాన్ కొరియర్ లో కోబ్రా.. షాక్ తిన్న కస్టమర్లు

దేశంలో ఆన్ లైన్ షాపింగ్ ఉండే గీరాకీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ప్రస్తుతం గడుపుతున్న బిజీ లైఫ్ కారణంగా ప్రతిఒక్కరూ బయట షాప్ లకు వెళ్లి కొనుగోలు చేసే తీరిక ఉండటం లేదు. ముఖ్యంగా ఏమాత్రం ఖాళీ దొరికిన ప్రశాంతంగా ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేస్తుంటారు. మరి ఇలాంటి సమయంలో ఇంటికి కావల్సిన ఏ చిన్న వస్తువైన బయటకు వెళ్లకుండా.. ఇంటికి రావాలంటే.. దానికి ఆన్ లైన్ షాపింగ్ ఒక్కటే మార్గం. ఈ క్రమంలోనే.. ప్రతిఒక్కరూ ఆన్ లైన్ షాపింగ్ వైపే ఎక్కువ ఆసక్తి కనబరుచుతారు. ముఖ్యంగా వీటిలో ఇ కామర్స్ ఫ్లాట్ ఫారమ్ సంస్థలో ఒకటైన అమెజాన్ లో అయితే భారీ సంఖ్యలో కస్టమర్లు కొనుగోలు చేస్తుంటారు.

ఎందుకంటే.. ఈ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో పండగ సీజన్ అనే నార్మల్ సీజన్ అని తేడా లేకుండా.. వివిధ రకాల ప్రొడక్ట్స్ ను కస్టమర్లకు ఆకర్షించే ధరలకు పొందవచ్చు. అయితే సాధారణంగా ఈ ఆన్ లైన్ షాపింగ్ లో వస్తువులను కొనుగోలు చేసినప్పుడు కొన్ని సందర్భాలంలో ఒక వస్తువు బదులు మరొక వస్తువు వచ్చిన ఘటనలు చాలానే చూస్తుంటాం. కానీ, తాజాగా ఓ కస్టమర్ కు అమెజాన్ లో వస్తువు ఆర్డర్ చేయగా.. ఆ  పార్శల్ ఇంటికి వచ్చి తెరిచి చూశాడు. అంతే.. ఒక్కసారిగా భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇంతకి ఏం జరిగిందంటే..

తాజాగా బెంగళూర్ కు చెందిన ఇద్దరు దంపతులు ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌ లో ఎక్స్ బాక్స్ కంట్రోలర్ ఆర్డర్ చేశారు. అయితే ఆ ఆర్డర్ మంగళవారం ఇంటికి డెలివరీ అయ్యింది. కానీ, ఈమధ్య తప్పుడు ఆర్డర్లు వస్తున్నాయన్న అనుమానంతో ఎందుకైనా మంచిదని ఆర్డర్ తీసుకునే వ్యక్తి దాన్ని తెరిచే సమయంలో వీడియో తీశారు. ఇక బాక్స్ ఓపెన్ చెయ్యగానే దాని టేప్ కు అతుక్కున్న పామును గుర్తించారు. దీంతో ఒక్కసారిగా ఆ కస్టమర్ కంగుతిన్నారు. ఎందుకంటే.. ఆ బాక్స్ లో నాగు పాము అతుక్కొని ఉంది. ఇక అది టేప్ కు అతుక్కొని బయటకు రాలేకపోయింది. దీంతో ఆ జంట ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే పరిస్థితి మరోలా ఉండేదని వాపోయారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ ఘటనపై స్పందించిన అమెజాన్ డెలివరీ సొమ్మును రీఫండ్ చేసి చేతులు దులుపుకున్నట్టు సమాచారం. మరి ఏదీ ఏమైనా అమెజాన్ లో ఎదురయ్యే ఈ భయంకరమైన ఘటనపై అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు ఏదైనా వస్తువు ఆర్డర్ పెడితే ఒక దానికి బదులు మరొకటి వచ్చేది. కానీ, ఇప్పుడు ఏకంగా ఇలా విష జంతువులు వస్తున్నాయని విమర్శల దుమ్మెత్తిపోస్తున్నారు. మరి, అమెజాన్ లో ఆర్డర్ చేసిన ప్రొడక్ట్ లో పాము రావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి