Tirupathi Rao
TCS And BSNL Deal- Jio May Face Tough Fight: జియో కంపెనీకి కొత్త కష్టాలు తప్పవు అంటూ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం.. టాటా కంపెనీ కుదుర్చుకున్న కొత్త డీల్ గా చెప్తున్నారు.
TCS And BSNL Deal- Jio May Face Tough Fight: జియో కంపెనీకి కొత్త కష్టాలు తప్పవు అంటూ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం.. టాటా కంపెనీ కుదుర్చుకున్న కొత్త డీల్ గా చెప్తున్నారు.
Tirupathi Rao
ప్రస్తుతం ఎక్కడ చూసినా రీఛార్జుల ప్రీమియాలు పెంచేశారు అని వినియోగదారులు లబోదిబోమంటున్నారు. జియో, ఎయిర్ టెల్ వంటి సంస్థలు తమ టారిఫ్ లను భారీగా పెంచేశాయి. గరిష్టంగా 20 శాతం వరకు రీఛార్జ్ ప్లాన్లు పెరిగిపోయాయి. అయితే ఈ నేపథ్యంలో టాటా కంపెనీ చేసుకున్న ఒక డీల్ ఇప్పుడు వారికి తలనొప్పి తెచ్చి పెట్టే ఆస్కారం ఉంది అంటున్నారు. ఇప్పుడు వినియోగదారులు ఆ కంపెనీ వైపు ఆశగా చూస్తున్నారంట. ఇప్పటికే చాలా మంది మార్చుకోవడం కూడా మొదలు పెట్టేశారు. అది మరేదో కంపెనీ కాదు.. బీఎస్ఎన్ఎల్ కంపెనీకి వినియోగదారులు షిఫ్ట్ అవుతున్నారంట. అందుకు టాటా కంపెనీ కుదుర్చున్న డీల్ కారణంగా చెబుతున్నారు.
రెండు వారాలుగా మొబైల్ టారిఫ్ ల గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఒకవైపు అంబానీ ఇంట పెళ్లి గురించి మాట్లాడుతూనే.. మరోవైపు జియో రీఛార్జ్ ప్లాన్స్ ధరలు పెరిగిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. జియో దారిలోనే ఎయిర్ టెల్ కూడా వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కంపెనీల నుంచి బీఎస్ఎన్ఎల్ కంపెనీకి పోర్టులు పెరిగాయి అంటూ వార్తలు వస్తున్నాయి. చాలామంది బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ కి తమ మొబైల్ నంబర్ ను మార్చుకుంటున్నారంట. అందుకు కారణం బీఎస్ఎన్ఎల్- టీసీఎస్ కంపెనీల మధ్య కుదిరిన డీలే అని చెబుతున్నారు. ఇటీవల బీఎస్ఎన్ఎల్- టీసీఎస్ కంపెనీల మధ్య రూ.15 కోట్లకు ఒక డీల్ కుదిరింది.
టాటా కన్సల్టెన్సీ- బీఎస్ఎన్ఎల్ మధ్య కుదిరిన డీల్ ప్రకారం.. దేశమంతటా 1000 గ్రామాలకు 4జీ ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నారు. ఈ ప్రయత్నం ద్వారా పల్లెటూళ్లల్లో కూడా స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయి. అలాగే టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్ దేశవ్యాప్తంగా 4 ప్రాంతాల్లో డేటా సెంటర్లను నిర్మిస్తోంది. అవి దేశంలో 4జీ మౌలిక సదుపాయాల డెవలప్మెంట్ కి దోహదపడుతుంది. ఇప్పుడు 5జీ నెట్ వర్క్ హవా కొనసాగుతున్నా కూడా.. 4జీ నెట్ వర్కే అత్యధికంగా వాడుతున్నారు. ఈ నెట్ వర్క్ లో జియో- ఎయిర్ టెల్ టాప్ లో కొనసాగుతున్నాయి. ఒకవేళ బీఎస్ఎన్ఎల్ గనుక ఒక పటిష్టమైన 4జీ నెట్ వర్క్ ప్రొవైడర్ గా ఎదగగలిగితే.. అది కచ్చితంగా పోటీ కంపెనీలకు పెద్ద దెబ్బ అనే చెప్పాలి. సాధారణంగానే బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్ చాలా అందుబాటులో ఉంటాయి. ఒకవేళ 4జీ ప్లాన్స్ వచ్చినా కూడా సరసమైన ధరల్లోనే ఉంటాయనే అభిప్రాయాలు ఉన్నాయి. అదే జరిగితే వలసలు మరింత పెరుగుతాయని.. టెలికాం కంపెనీలకు గట్టి పోటీ వస్తుంది అంటున్నారు.