Tata Punch: సేల్స్ లో నెం.1.. జనాలు ఎక్కువగా కొనడానికి కారణాలు ఏంటంటే?

Tata Punch: టాటా పంచ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆకట్టుకునే ఫీచర్లతో మంచి డిజైన్ తో అమ్మకాల్లో దూసుకుపోతుంది.

Tata Punch: టాటా పంచ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆకట్టుకునే ఫీచర్లతో మంచి డిజైన్ తో అమ్మకాల్లో దూసుకుపోతుంది.

టాటా కంపెనీకి ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకంటే బడ్జెట్ ధరలో ఈ కార్స్ వినియోగదారులకు మంచి ఫీచర్లని అందిస్తాయి. అంతేగాక ఈ కార్లు మంచి బిల్డ్ క్వాలిటీతో వస్తాయి. అందువల్ల యాక్సిడెంట్లు జరిగినా ఈ కార్లు పెద్దగా డ్యామేజ్ కావు. అందుకే మధ్యతరగతి ప్రేక్షకులు టాటా కార్లని ఎక్కువగా కొనడానికి ఇష్టపడతారు. టాటా కంపెనీ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఇప్పుడు పంచ్‌ నంబర్‌ 1 కారుగా దూసుకుపోతుంది. పైగా ఇది దేశంలో అత్యంత చౌకైన ఎస్‌యూవీలలో ఒకటి. ఈ కారు లగ్జరీ కార్ల లాంటి సూపర్ ఫీచర్లు కలిగి ఉంది. అన్నిటికి మించి దీని లుక్ ఎంతో స్టైలిష్ గా ఉంటుంది. సేఫ్టీ విషయంలో ఈ కార్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఏకంగా 5 స్టార్ రేటింగ్‌ని కలిగి ఉంది. ఈ కారు అత్యంత సురక్షితమైన మైక్రో ఎస్‌యూవీగా పేరు సంపాదించుకుంది. అందుకే ఈ కార్ దేశంలోనే టాప్ సెల్లింగ్ కార్ గా నిలిచింది.

టాటా పంచ్ కార్ ఈ ఏడాది జనవరి-జూలై నెలల మధ్య 1.26 లక్షల యూనిట్లు అమ్ముడుపోయి టాప్‌లో నిలిచింది. 2024 మొదటి 7 నెలల్లో భారీ స్థాయిలో అమ్మకాలు జరుపుకొని తన సత్తా ఏంటో చూపించింది. ఎక్కువ సేఫ్టీ, ధర తక్కువగా ఉండటం దీని ప్లస్ పాయింట్. పైగా టాటా కంపెనీ ఈ కారుని వివిధ వెర్షన్‌లో అందిస్తుంది. దీని సేల్స్‌ పెరగడానికి ఇది కూడా ఓ ప్రధాన కారణంగా చెప్పవచ్చు. టాటా మోటార్స్ ఈ కారును పెట్రోల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వెర్షన్‌లలో సేల్ చేస్తుంది. ఇండియన్ మార్కెట్లో టాటా పంచ్ ధర విషయానికి వస్తే.. రూ.6 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. 1.26 లక్షల యూనిట్లు అమ్ముడైన టాటా పంచ్ కార్లలో 79 వేలకు పైగా ఎలక్ట్రిక్, సీఎన్జీ వేరియంట్ కార్లు అమ్ముడయ్యాయి. ఈ కార్ ఒకే ఇంజన్ ఆప్షన్‌తో వస్తుంది. ఇది 1.2-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్. అలాగే CNG కిట్ కోసం ఒక ఆప్షన్ కూడా ఉంది. దీని ఇంజిన్ 86PS, 113Nm అవుట్‌పుట్‌ను అందిస్తుంది.

ఈ కారు 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMT ట్రాన్స్‌మిషన్‌తో పని చేస్తోంది. CNG వేరియంట్‌ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే వస్తుంది. ఈ కారులో ఇంకో ఆకట్టుకునే అంశం ఏంటంటే.. దీని మైలేజ్.. ఇది పెట్రోల్‌పై 20 కి.మీల దాకా మైలేజీనీ, సిఎన్‌జిపై దాదాపు 26 కి.మీల దాకా మైలేజీని ఇస్తుంది. ఈ కార్ CNG బ్రాండ్, ట్విన్-సిలిండర్ టెక్నాలజీతో వస్తుంది.దీని బూట్ స్పేస్‌ కూడా ఎక్కువే ఉంటుంది. ఇందులో సన్‌రూఫ్, రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 7-అంగుళాల టచ్ స్క్రీన్, ఎలక్ట్రానిక్‌ మిర్రర్స్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, 2 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD, TPMS, గైడ్‌లైన్స్‌తో కూడిన రివర్సింగ్ కెమెరా, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే ఈ కార్ ని భారతీయులు ఎగబడి మరీ కొంటున్నారు.

 

Show comments