Electric cars : ఎలక్ట్రిక్ వాహనాలపై షాకింగ్ సర్వే... 51 శాతం మంది అభిప్రాయం ఇదే!

ఎలక్ట్రిక్ వాహనాలపై షాకింగ్ సర్వే… 51 శాతం మంది అభిప్రాయం ఇదే!

Electric cars: భారతదేశంలోని ఆటోమొబైల్ మార్కెట్ లో ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతమైన డిమాండ్ ఉన్న సంగతి తెలిసింది.  నేపథ్యంలోనే ఒక ఆసక్తికరమైన సర్వే బయటకు వచ్చింది. కార్ల ఓనర్లకు వివిధ సేవలు అందించే పార్క్ ప్లస్ అనే సంస్థ ఈ సర్వేను నిర్వహించింది.

Electric cars: భారతదేశంలోని ఆటోమొబైల్ మార్కెట్ లో ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతమైన డిమాండ్ ఉన్న సంగతి తెలిసింది.  నేపథ్యంలోనే ఒక ఆసక్తికరమైన సర్వే బయటకు వచ్చింది. కార్ల ఓనర్లకు వివిధ సేవలు అందించే పార్క్ ప్లస్ అనే సంస్థ ఈ సర్వేను నిర్వహించింది.

ప్రస్తుతం మార్కెట్ లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగింది. ముఖ్యంగా కాలుష్యం, ఇంధన ఖర్చు తగ్గించుకునేందుక ఈ వాహనాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు కేంద్రం ఎలక్ట్రిక్ వెహికల్స్ ను ప్రొత్సాహిస్తుంది. ప్రస్తుతం చాలా మంది వినియోగదారులు ఈవీ బైక్స్, కార్లును నడుపుతున్నారు. కొన్ని ఈ వాహనాలు పేలి పోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలపై ఓ సంస్థ సర్వే చేసింది. ఈ సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరి..  ఆవివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

భారతదేశంలోని ఆటోమొబైల్ మార్కెట్ లో ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతమైన డిమాండ్ ఉన్న సంగతి తెలిసింది.  నేపథ్యంలోనే ఒక షాకింగ్​ సర్వే బయటకు వచ్చింది. కార్ల ఓనర్లకు వివిధ సేవలు అందించే పార్క్ ప్లస్ అనే సంస్థ ఈ సర్వేను నిర్వహించింది. 500 మంది ఎలక్ట్రిక్ కార్ల యజమానులపై ఈ సర్వేను నిర్వహించింది. ఈక్రమంలోనే 51 శాతం మంది రెండో ఈవీని కొనుగోలు చేయడానికి ఇష్టపడటం లేదని  ఈ సర్వేలో తేలింది. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ఐసీఈ) కార్లకు మారేందుకు వారు ఆసక్తి చూపుతున్నారని స్పష్టమైంది.

ఇండియాలోని ఈవీ యజమానుల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ సర్వే నిర్వహించామని పార్క్ ప్లస్ సీఈవో అమిత్ లఖోటియా చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాలు వద్దంటున్న వారి ప్రధాన సమస్య ఛార్జింగ్ అంట. ఈ సర్వేలో 88 శాతం మంది ఛార్జింగ్ అంశంపై ఎక్కువగా ఆందోళన చేస్తున్నట్లు సర్వే నివేదించింది.  భారతదేశంలో 20 వేల కంటే ఎక్కువ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నప్పటికీ నాణ్యమైన, సురక్షితమైన, పనిచేసే ఛార్జింగ్ స్టేషన్​లు దొరక్కపోవడం చాలా మంది ఈవీ కార్ల ఓనర్లలో అతిపెద్ద ఆందోళనగా ఉందని సర్వే వెల్లడించింది. అదే విధంగా ఎలక్ట్రిక్ వాహనాల మరమ్మతులకు అధిక  ఖర్చులు అవుతుండటంతో వీటి కొనుగోలుకుపై ఆసక్తి చూపడం లేదని తెలిపింది. 73 శాతం మంది తమ ఈవీ కార్లు తమకు అర్థం కాని బ్లాక్ బాక్స్ లాంటివని సర్వేలో పేర్కొన్నారు.

ఒక ఈవీల రీపేర్​ అయ్యే ఖర్చుపై అనేక రిపైర్​ షాప్​లు రెండో ఆప్షన ఇవ్వలేకపోతుండటంతో ఖర్చు పెరుగుతోందని అన్నారు. అంతేకాక పలు ఇతర కారణాలతో చాలా మంది ఐసీఈ కార్లకు తిరిగి మారాలని కోరుకుంటున్నట్టు సర్వేలో పేర్కొన్నారు. ఐసీఈ కార్ల ఓనర్ల కంటే సగటున ఈవీ కార్ల యజమానులు అసంతృప్తిగా ఉన్నారని సర్వేలో తేలింది. ఇండియాలో 4వాట్​ ఈవీ స్టోరీ కొనసాగుతోందని, కానీ రోబస్ట్​, స్మార్ట్​ ఈవీ ఛార్జింగ్​ వెసులుబాటులను నిర్మిచాల్సిన అవసరం చాలా ఉందని లఖోటియా అన్నారు. మరి.. ఈ సర్వేపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments