nagidream
35 Lakhs Scehme Details: పిల్లల కోసం తల్లిదండ్రులు ఏమైనా చేయాలని అనుకుంటారు. వారికంటూ ఏదో ఒక ఆస్తి సంపాదించి పెట్టాలనో లేక డబ్బు కూడబెట్టాలనో కలలు కంటారు. కానీ అందరి కలలు నెరవేరవు. అయితే ఈ పథకం ద్వారా మీ కలలు నెరవేరతాయి. ఇంట్లో ఆడపిల్ల ఉంటే 35 లక్షల రూపాయలు వస్తాయి. ఈ పథకం గురించి ప్రతీ తల్లిదండ్రులు ఖచ్చితంగా తెలుసుకోవాలి.
35 Lakhs Scehme Details: పిల్లల కోసం తల్లిదండ్రులు ఏమైనా చేయాలని అనుకుంటారు. వారికంటూ ఏదో ఒక ఆస్తి సంపాదించి పెట్టాలనో లేక డబ్బు కూడబెట్టాలనో కలలు కంటారు. కానీ అందరి కలలు నెరవేరవు. అయితే ఈ పథకం ద్వారా మీ కలలు నెరవేరతాయి. ఇంట్లో ఆడపిల్ల ఉంటే 35 లక్షల రూపాయలు వస్తాయి. ఈ పథకం గురించి ప్రతీ తల్లిదండ్రులు ఖచ్చితంగా తెలుసుకోవాలి.
nagidream
పెళ్ళికి ముందు ఎన్ని కలలు ఉన్నా గానీ పెళ్ళై పిల్లలు పుట్టాక వాళ్ల కలలే తమ కలలుగా భావిస్తారు తల్లిదండ్రులు. అంతకు ముందు వరకూ వారికంటూ వేరే ప్రపంచం ఉన్నా కానీ పిల్లలు పుట్టాక మాత్రం పిల్లలే ప్రపంచం అయిపోతారు. వారి కోసం ఏమైనా చేయాలి అనుకుంటారు తల్లిందండ్రులు. కానీ చేద్దాం చేద్దాం అనుకుంటున్నా గానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏమీ చేయలేని పరిస్థితి. ఇలాంటి తల్లిదండ్రుల కోసమే కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. సుకన్య సమృద్ధి యోజన పథకం ఆడపిల్లల పాలిట వరం. ఈ పథకంలో చేరితే మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు డోకా ఉండదు. వారి చదువుల కోసం, పెళ్లి కోసం అయ్యే లక్షల రూపాయలను వారు ఎదిగే సమయానికి పొందవచ్చు. మీరు నిశ్చింతగా ఉండచ్చు.
ఇలా ఉండాలంటే మీరు చేయాల్సిందల్లా కూతురు పేరు మీద నెలకు కొంత చొప్పున డిపాజిట్ చేస్తూ ఉండాలి. నెలకు కనీసం 250 రూపాయలైనా పెట్టుబడి పెట్టాలి. అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయానికి ఎక్కువ డబ్బులు వస్తాయి. ఈ సుకన్య సమృద్ధి యోజన పథకానికి సంబంధించి ఖాతాను ఏ పోస్టాఫీసులో అయినా తెరవచ్చు. ఇందులో అత్యధికంగా 8.2 శాతం వడ్డీ లభిస్తుంది. 15 ఏళ్ల కాలపరిమితితో ఈ పథకం ఉంటుంది. పదిహేనేళ్ల పాటు నెలకు కొంత చొప్పున పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్తే.. మెచ్యూరిటీ సమయానికి ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు చేతికి వస్తుంది. ఆ డబ్బుని అమ్మాయి పై చదువుల కోసమో లేక పెళ్ళి సమయానికో వినియోగించవచ్చు. అమ్మాయికి పదేళ్ల వయసు లోపు ఉన్నప్పుడే ఈ పథకంలో చేరాలి.
ఈ పథకంలో చేరిన తర్వాత 21 ఏళ్లకు క్లోజ్ అవుతుంది. లేదంటే అమ్మాయి పెళ్లి అయితే క్లోజ్ అవుతుంది. ఇప్పుడు మీకు 35 లక్షలు రావాలంటే నెలకు రూ. 6,250 చొప్పున 15 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టాలి. అమ్మాయి భవిష్యత్తు కోసం రోజుకు 210 రూపాయలు పక్కన పెడితే నెలకు రూ. 6,250, ఏడాదికి 75 వేలు పెట్టుబడి కింద పథకంలో జమ అవుతుంది. 15 ఏళ్లలో మీరు పెట్టిన పెట్టుబడి 11,25,000 అవుతుంది. దీనిపై మీకు 8.2 శాతం వడ్డీ లెక్కన మొత్తం 23,38,789 రూపాయలు వస్తుంది. మెచ్యూరిటీ సమయానికి మీరు పెట్టిన పెట్టుబడి, వడ్డీ కలిపి రూ. 34,63,789 రూపాయలు వస్తాయి. దాదాపు 35 లక్షలు వస్తాయి. కరెక్ట్ గా 35 లక్షలు రావాలంటే కనుక రూ. 6,250 కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ప్రభుత్వ పథకం కాబట్టి గ్యారంటీ రిటర్న్స్ ఉంటాయి. రిస్క్ ఉండదు. మీ కూతురు బంగారు భవిష్యత్తుకి భరోసా ఇచ్చినట్టు ఉంటుంది.