iDreamPost
android-app
ios-app

HYDలో 18 లక్షలకే 150 గజాల స్థలం.. ఇప్పుడు కొంటే లక్షల్లో లాభాలు!

  • Published May 02, 2024 | 4:11 PM Updated Updated May 02, 2024 | 4:11 PM

హైదరాబాద్ లో ప్రధాన ఏరియాల్లో గజం స్థలం కొనాలంటే లక్ష పైమాటే. తక్కువలో తక్కువ అంటే కనీసం 50 వేలు పెడితేనే గానీ గజం స్థలం దొరకడం అనేది కష్టం. కానీ సౌత్ హైదరాబాద్ లో రూ. 18 లక్షలకే 150 గజాల స్థలం వస్తుంది. ఇప్పుడు కనుక ఈ ఏరియాలో పెట్టుబడి పెడితే లక్షల్లో లాభాలు పొందే అవకాశం ఉంది. 

హైదరాబాద్ లో ప్రధాన ఏరియాల్లో గజం స్థలం కొనాలంటే లక్ష పైమాటే. తక్కువలో తక్కువ అంటే కనీసం 50 వేలు పెడితేనే గానీ గజం స్థలం దొరకడం అనేది కష్టం. కానీ సౌత్ హైదరాబాద్ లో రూ. 18 లక్షలకే 150 గజాల స్థలం వస్తుంది. ఇప్పుడు కనుక ఈ ఏరియాలో పెట్టుబడి పెడితే లక్షల్లో లాభాలు పొందే అవకాశం ఉంది. 

HYDలో 18 లక్షలకే 150 గజాల స్థలం.. ఇప్పుడు కొంటే లక్షల్లో లాభాలు!

ఈస్ట్ హైదరాబాద్, నార్త్ హైదరాబాద్, వెస్ట్ హైదరాబాద్ లో స్థలం రేట్లు ఎలా ఉన్నాయి? ఎక్కడ తక్కువగా ఉన్నాయి అని వెబ్ సైట్ లో కథనాలు ఇచ్చి ఉన్నాం. ఇవాళ్టి కథనంలో సౌత్ హైదరాబాద్ లో ల్యాండ్ రేట్లు ఎలా ఉన్నాయి? రేట్లు ఎక్కడ తక్కువ ఉన్నాయి? అనే వివరాలు మీ కోసం.  

తుక్కుగూడ, ఆదిభట్ల, బండ్లగూడ జాగీర్, అత్తాపూర్, రాజేంద్రనగర్, శ్రీశైలం హైవే ఏరియాలు సౌత్ హైదరాబాద్ జోన్ కిందకు వస్తాయి.  బండ్లగూడ జాగీర్ లో చదరపు అడుగు స్థలం రూ. 7,800 పడుతుంది. అంటే గజం రూ. 70 వేలు పైనే. 150 గజాల స్థలం కొనాలంటే కోటి రూపాయల పైనే అవుతుంది. రాజేంద్రనగర్ లో చదరపు అడుగు రూ. 6,200 నుంచి 11,650 రేంజ్ లో ఉంది. అంటే గజం స్థలం రూ. 55,800 నుంచి లక్ష 5 వేల వరకూ ఉంది. 150 గజాల స్థలం కొనాలంటే ఈ ఏరియాలో 80 లక్షల నుంచి 2 కోట్లు పెట్టుబడి పెట్టాల్సిందే. తుక్కుగూడలో చదరపు అడుగు స్థలం ధర రూ. 3,050గా ఉంది. అంటే ఇక్కడ గజం స్థలం రేటు రూ. 27,450గా ఉంది.

డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కి సరిపడా స్థలం అంటే 150 గజాలకు రూ. 41 లక్షలు పైనే అవుతుంది. అత్తాపూర్ లో చదరపు అడుగు రూ. 1250 నుంచి రూ. 12,200 మధ్య రేంజ్ లో ఉంది. అంటే గజం స్థలం రూ. 11,250 నుంచి లక్ష 10 వేల రేంజ్ లో కొనసాగుతుంది. 150 గజాల స్థలం కొనాలంటే 16 లక్షల నుంచి కోటి 70 లక్షల రేంజ్ లో ఉంది. ఆదిభట్లలో చదరపు అడుగు స్థలం ధర రూ. 1700గా ఉంది. అంటే గజం రూ. 15,300 పడుతుంది. 150 గజాల ఇంటి స్థలానికి సుమారు 23 లక్షలు అవుతుంది. 

సౌత్ హైదరాబాద్ లో పైన చెప్పుకున్నవాటి కంటే కూడా శ్రీశైలం హైవే మీద ఉన్న స్థలాల రేట్లు తక్కువగా ఉన్నాయి. ఇక్కడ చదరపు అడుగు స్థలం ధర రూ. 1300 పడుతుంది. అంటే గజం స్థలం రూ. 11,700 పడుతుంది. 150 గజాలకు సుమారు 18 లక్షలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు కనుక ఈ ఏరియాలో స్థలాలు కొంటే భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని మిగతా ప్రాంతాలకు కలిపే కమర్షియల్ కారిడార్ గా ఈ శ్రీశైలం హైవే ఉంది. దీని వల్ల ఆర్థిక వృద్ధి అనేది ఏర్పడుతుంది. ఎన్‌హెచ్ 44, ఎన్‌హెచ్ 65 వంటి ప్రధాన హైవేలకు అతి దగ్గరగా.. అలానే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా ఉన్న కారణంగా ఈ శ్రీశైలం హైవే పెట్టుబడులకు ఉత్తమ ఛాయిస్ అని నిపుణులు చెబుతున్నారు.

కర్నూలు, అనంతపురం, కడప సహా ప్రధాన పారిశ్రామిక కేంద్రాలకు ఈ శ్రీశైలం హైవే యాక్సెస్ కల్పిస్తుంది. ముంబై, బెంగళూరు వంటి అనేక నగరాలతో పోలిస్తే జీవించడానికి అయ్యే ఖర్చులు హైదరాబాద్ లో తక్కువ. అందుకే చాలా మంది ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నారు. ఇక శ్రీశైలం హైవే పెట్టుబడుల ప్రాంతంగా ఆవిర్భవిస్తుందని.. ల్యాండ్ రేట్లు అమాంతం పెరిగిపోతాయని నిపుణులు అంటున్నారు. ఇప్పుడు పెట్టుబడి పెడితే భవిష్యత్తులో లక్షల్లో లాభాలు పొందవచ్చునని అంటున్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో ప్రధాన ఏరియాల్లో చదరపు అడుగు 5 వేలు నుంచి 10 వేలు పలికినట్టే ఫ్యూచర్ లో ఈ శ్రీశైలం హైవేలో కూడా అలానే పలుకుతాయని అంటున్నారు.