iDreamPost
android-app
ios-app

HYDలో ఈ ఏరియాలో గజం స్థలం రూ. 14 వేలే.. ఫ్యూచర్ అంతా ఇక్కడే ఉంది!

  • Published May 06, 2024 | 3:25 PM Updated Updated May 06, 2024 | 3:25 PM

స్థలం కొనే యోచనలో ఉన్నారా? అయితే హైదరాబాద్ లో ఈ ఏరియాలో గజం స్థలం 14 వేలకే దొరుకుతుంది. ఇప్పుడు పెట్టుబడి పెడితే ఫ్యూచర్ లో భారీగా లాభాలు పొందవచ్చు.

స్థలం కొనే యోచనలో ఉన్నారా? అయితే హైదరాబాద్ లో ఈ ఏరియాలో గజం స్థలం 14 వేలకే దొరుకుతుంది. ఇప్పుడు పెట్టుబడి పెడితే ఫ్యూచర్ లో భారీగా లాభాలు పొందవచ్చు.

HYDలో ఈ ఏరియాలో గజం స్థలం రూ. 14 వేలే.. ఫ్యూచర్ అంతా ఇక్కడే ఉంది!

డబ్బు సంపాదించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే కొంతమంది తెలియక భూమ్మీద పెట్టకుండా అవగాహన లేని వాటిలో పెట్టుబడి పెట్టి పోగొట్టుకుంటూ ఉంటారు. అదే పెట్టుబడి భూమ్మీద పెట్టి ఉంటే లక్షలు, కోట్లు సంపాదించేవారు. ఇప్పటికీ చాలా మంది పెట్టుబడి పెట్టలేదే అని బాధపడుతూ ఉంటారు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ డెవలప్ కావడానికి సిద్ధంగా ఉన్న రోజుల్లో మాదాపూర్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టడానికి నిరాకరించారు. కట్ చేస్తే ఇప్పుడు ఆ ఏరియాల్లో స్థలాలు కొనలేని పరిస్థితి.

అందుకే భూమి మనకి అందుబాటులో ఉన్నప్పుడు కొనుగోలు చేస్తేనే దాంతో పాటు ఆకాశంలా ఎదుగుతాము. లేదంటే ఆ తర్వాత కొందామన్నా గానీ ఆకాశంలా చేతికి అందదు. ఇప్పుడు అలాంటి అవకాశమే వచ్చింది. అదే బెంగళూరు హైవే. అవును హైదరాబాద్ లో ఉన్న ఈ బెంగళూరు హైవేలో ఇప్పుడు పెట్టుబడులు పెడితే ఫ్యూచర్ లో లక్షల్లో లాభాలు పొందవచ్చునని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. కనెక్టివిటీ పరంగా, ఇప్పుడిప్పుడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతున్న ఈ బెంగళూరు హైవే అనేది స్ట్రాటజిక్ లొకేషన్ గా ఉంది. సరసమైన ధరలకు స్థలాలు దొరుకుతున్న కారణం వల్ల ఇన్వెస్టర్లు ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తికనబరుస్తున్నారు. 

బెంగళూరు హైవే మీదనే ఎందుకు పెట్టుబడి పెట్టాలి?

కనెక్టివిటీ:

కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఇది అవుటర్ రింగ్ రోడ్ కి చాలా దగ్గరగా ఉంది. అలానే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి కూడా దగ్గరలో ఉంది. 

ఇన్ఫ్రాస్ట్రక్చర్: 

హైవేల నిర్మాణాలు, ఫ్లై ఓవర్లు, మెట్రో రైల్ నెట్వర్క్స్ సహా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ని హైదరాబాద్ నగరంలో మనం చూశాం. ఫ్యూచర్ లో బెంగళూరు హైవే కూడా ఇదే విధంగా డెవలప్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. 

పారిశ్రామిక వృద్ధి:

అమెజాన్, జాన్సన్ అండ్ జాన్సన్, ఏషియన్ పెయింట్స్ సహా అనేక కంపెనీలకు, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అనేవి ఈ బెంగళూరు హైవేకి ఆనుకుని ఉన్నాయి. 

రవాణా:

రవాణా పరంగా బెంగళూరు హైవే అనేది ఈజీ యాక్సెస్ కలిగి ఉంది. హైదరాబాద్ సిటీలోకి వెళ్లడానికైనా.. అలానే మిగతా ప్రాంతాలకు వెళ్లేందుకు చాలా అనుకూలంగా ఉంది. 

ధరలు:

ఇక్కడ ల్యాండ్ రేట్లు చౌక ధరకే అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ బెంగళూరు హైవే అనేది పెట్టుబడికి ఉత్తమ మార్గం అని నిపుణులు చెబుతున్నారు. 

బెంగళూరు హైవే మీద స్థలాల రేట్లు:

ప్రస్తుతం పలు ప్రాపర్టీ వెబ్ సైట్స్ సమాచారం మేరకు.. అలానే పలు రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్న లెక్కలు ప్రకారం.. బెంగళూరు హైవే మీద చదరపు అడుగు స్థలం రూ. 1600గా ఉంది. అంటే గజం 14,400 రూపాయలుగా ఉంది. ఈ లెక్కన ఒక 100 గజాల స్థలం కొనాలంటే 15 లక్షల లోపే అవుతుంది. ఒక 200 గజాల స్థలం కొనాలంటే 30 లక్షల లోపే అవుతుంది. 2019లో చదరపు అడుగు 1150 రూపాయలుగా ఉంది. ఇప్పుడు దాని విలువ 1600 అయ్యింది. అంటే ఈ ఐదేళ్ళలో చదరపు అడుగు మీద 450 రూపాయల లాభం. గజం మీద 4050 రూపాయల లాభం. 100 గజాల మీద 4 లక్షలు లాభం అన్న మాట. ఏడాదికి లక్ష రూపాయలు లాభం వచ్చినట్టు. ఇప్పుడు ఈ బెంగళూరు హైవే మీద ల్యాండ్ కొంటే గనుక ఫ్యూచర్ లో ఇంతకంటే మంచి లాభాలు చూడవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏరియాలో కుటుంబాలకు, పని చేసే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. బాగా నిర్వహించబడుతున్న రోడ్లు, ప్రజా రవాణా, హైవే దగ్గరలోనే మార్కెట్లు, స్కూల్స్ వంటివి ఉన్నాయి. 

గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ధరల్లో మార్పులు ఉండవచ్చు. గమనించగలరు.