Hindenburg: హిండెన్‌బర్గ్‌ సంచలన రిపోర్ట్‌! వాస్తవం లేదన్న సెబీ ఛైర్‌పర్సన్‌

SEBI, Madhabi Puri Buch, Hindenburg: అమెరికాకు చెందిన షార్ట్‌ సెల్లర్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ తాజాగా సెక్యూరిటీ అండ్‌ ఎక్స్‌ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్‌పర్సన్‌పై సంచలన ఆరోపణలుచేసింది. వాటిపై ఆమె రియాక్ట్‌ అయ్యారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

SEBI, Madhabi Puri Buch, Hindenburg: అమెరికాకు చెందిన షార్ట్‌ సెల్లర్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ తాజాగా సెక్యూరిటీ అండ్‌ ఎక్స్‌ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్‌పర్సన్‌పై సంచలన ఆరోపణలుచేసింది. వాటిపై ఆమె రియాక్ట్‌ అయ్యారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

గతేడాది గౌతమ్‌ అదానీకి చెందిన కంపెనీల్లో అవకతవకలు జరుగుతున్నాయని.. అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ అనే సంస్థ ఇచ్చిన నివేదిక మన దేశంలో ఎలాంటి సంచలనం నమోదు చేసిందో అందరికి తెలిసిందే. దేశవ్యాప్తంగా దానిపై చర్చ జరిగింది. పార్లమెంట్‌, సుప్రీం కోర్టు వరకు వెళ్లింది ఆ చర్చ. అయితే.. తాజాగా శనివారం ఇండియాలో మరో పెద్ద సంచలనం రాబోతుంది అంటూ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ సంస్థ ఒక ట్వీట్‌ చేసింది. ఆ తర్వాత.. హిండెన్‌బర్గ్‌ నుంచి ఒక సంచలన నివేదిక వచ్చింది. అందులో ఈసారి సెబీ(సెక్యూరిటీ అండ్‌ ఎక్స్‌ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియాన్‌) ఛైర్‌పర్సన్‌ను టార్గెట్‌ చేసింది హిండెన్‌బర్గ్‌.

సెబీ ఛైర్‌పర్సన్‌ మాధబి పురి బచ్‌, ఆమె భర్త అదానీ మారిషస్‌ ఫండ్స్‌లో వాటా ఉన్నట్లు సంచలన ఆరోపణలు చేసింది. ఆదానీ గ్రూప్‌ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్‌ ఫండ్‌లలో మాధబి పురి, ఆమె భర్త ధావల్‌ బచ్‌లకు వాటాలు ఉన్నట్లు హిండెన్‌బర్గ్‌ పేర్కొంది. దీనిపై విజిల్‌ బ్లోయర్‌ నుంచి తమకు సమాచారం అందినట్లు ఆ సంస్థ వెల్లడించింది. గౌతమ్‌ అదాని సోదరుడు వినోద్‌ అదాని కంట్రోల్‌లో ఉన్న కొన్ని ఆఫ్‌షోర్‌ బెర్ముడా, మారిషస్‌ ఫండ్‌లలో వాటాలు ఉన్నాయని హిండెన్‌ బర్గ్‌ ఆరోపించింది.

హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణలపై స్పందించిన సెబీ ఛైర్‌పర్సన్‌ మాధబి.. తమకు అందులో ఎలాంటి వాటాలు లేవని, హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని ఖండించారు. తమ ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడులు, తమ జీవితం అంతా తెరిచిన పుస్తకం అని ఆమె పేర్కొన్నారు. తన భర్తకు కూడా మారిషస్‌ ఫండ్స్‌లో ఎలాంటి వాటాలు లేవంటూ మాధవి వెల్లడించారు. అయితే.. గతంలో అదానిని టార్గెట్‌ చేసిన హిండెన​బర్గ్‌ ఇప్పుడే నేరుగా సెబీ ఛైర్‌పర్సన్‌నే టార్గెట్‌ చేసింది. అదానిపై గతేడాది హిండెన్‌బర్గ్‌ ప్రచురించిన నివేదికపై సెబీ అప్పట్లో హిండెన్‌బర్గ్‌ను వివరణ కోరింది. దానిపై ఈ ఏడాది జులై 1న హిండెన్‌బర్గ్‌ వివరణ ఇచ్చింది. మరి సెబీ లాంటి ఒక పవర్‌ఫుల్‌ బోర్డ్‌ ఛైర్‌పర్సన్‌పై హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments