P Venkatesh
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ పై సీరియస్ అయ్యింది. కొటక్ మహీంద్రా బ్యాంక్ పై కఠిన చర్యలు తీసుకుంది. దీంతో కస్టమర్లకు ఆ సేవలు బంద్ కానున్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ పై సీరియస్ అయ్యింది. కొటక్ మహీంద్రా బ్యాంక్ పై కఠిన చర్యలు తీసుకుంది. దీంతో కస్టమర్లకు ఆ సేవలు బంద్ కానున్నాయి.
P Venkatesh
బ్యాంకుల పెద్దన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ అతిక్రమించే బ్యాంకులపై కొరఢా ఝుళిపిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులపై ఉక్కుపాదం మోపుతోంది. నిబంధనలు ఉల్లంఘించే బ్యాంకులకు భారీగా జరిమానా విధిస్తోంది. అంతే కాదు కొన్ని సందర్భాల్లో బ్యాంకు లైసెన్స్ లను కూడా రద్దు చేసేందుకు వెనకాడడం లేదు ఆర్బీఐ. ఇటీవలికాలంలో పెద్ద సంఖ్యలో బ్యాంకులపై చర్యలు తీసుకుంది. తాజాగా మరో ప్రముఖ బ్యాంకు కొటక్ మహీంద్రా పై సీరియస్ అయ్యింది. ఏకంగా ఆ బ్యాంకు అందించే ఆ సేవలపై ఆంక్షలు విధించింది. దీంతో కొటక్ మహీంద్రా బ్యాంకు ఖాతాదారులకు ఆ సేవలు బంద్ కానున్నాయి.
ఆర్బీఐ ప్రైవేట్ బ్యాంక్ అయిన కొటాక్ మహీంద్రా బ్యాంక్ ఆన్ లైన్ సేవలపై ఆంక్షలు విధించింది. కొటక్ మహీంద్రా బ్యాంక్ పై కఠిన చర్యలు తీసుకన్న ఆర్బీఐ కొత్త కస్టమర్లను చేర్చుకోవడం, కొత్త క్రెడిట్ కార్డ్‌లను జారీ చేయకుండా నిలిపివేసింది. ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కొత్త కస్టమర్‌లను చేర్చుకోకుండా ఆంక్షలు విధించింది. ఈ మేరకు 2024, ఏప్రిల్ 24వ తేదీన ఆదేశాలు జారీ చేసింది ఆర్బీఐ. కాగా కోటక్ మహీంద్రా బ్యాంక్ తన ప్రస్తుత కస్టమర్లకు, క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు మునుపటిలాగే సేవలను కొనసాగిస్తుందని ఆర్‌బిఐ స్పష్టం చేసింది.
బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లోని సెక్షన్ 35A ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ చర్య తీసుకుంది. కొటక్ మహీంద్రా బ్యాంక్ పై ఆర్బీఐ సీరియస్ కావడానికి కారణం ఏంటంటే?.. కొటాక్ మహీంద్రా బ్యాంక్ లో 2022, 2023 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి.. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ గవర్నరెన్స్, ఐటీ రిస్క్ కేటగిరీల్లో లోపాలు ఉన్నట్లు గుర్తించింది ఆర్బీఐ. కొటక్ బ్యాంకులో అనేక లోపాలు, వైఫల్యాలు గుర్తించడంతో ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ఆన్లైన్ ద్వారా కస్టమర్లను తీసుకోవటం, ఆన్లైన్ ద్వారా క్రెడిట్ కార్డులను జారీ చేయటాన్ని నిలిపివేసింది ఆర్బీఐ.