P Venkatesh
ఆర్బీఐ క్రెడిట్ ఇన్ఫర్ మేషన్ కంపెనీస్ కు కొత్త రూల్స్ ను పెట్టింది. దీంతో సిబిల్ స్కోర్ లో భారీ మార్పులు రానున్నాయి. అసలు ఆర్బీఐ తెచ్చిన ఆ రూల్స్ ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఆర్బీఐ క్రెడిట్ ఇన్ఫర్ మేషన్ కంపెనీస్ కు కొత్త రూల్స్ ను పెట్టింది. దీంతో సిబిల్ స్కోర్ లో భారీ మార్పులు రానున్నాయి. అసలు ఆర్బీఐ తెచ్చిన ఆ రూల్స్ ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
P Venkatesh
మనం లోన్ల కోసం బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, ఆర్థిక సంస్థలను సంప్రదిస్తుంటాము. అయితే ఆ సంస్థలు లోన్ ఇచ్చే సమయంలో సిబిల్ స్కోర్ ను చూసి లోన్ ఇవ్వాలా వద్దా అని నిర్ణయిస్తాయి. క్రెడిట్ స్కోర్ బాగుంటేనే రుణం అందిస్తాయి. లేదంటే నిరాకరిస్తాయి. అయితే ఈ క్రెడిట్ స్కోర్ ను ఆ సంస్థలు ఎక్కడ చూస్తాయో తెలుసా. క్రెడిట్ ఇన్ఫర్ మేషన్ కంపెనీస్ ద్వారానే సిబిల్ స్కోర్ ను చెక్ చేస్తాయి. దీన్ని హార్డ్ ఎంక్వైరీ అంటారు. ఇలా చేస్తే సిబిల్ స్కోర్ తగ్గుతూ ఉంటుంది. క్రెడిట్ ఇన్ఫర్ మేషన్ కంపెనీస్ లో సిబిల్, ఎక్స్ పీరియన్, ఈక్విఫాక్స్, సీఆర్ఐఎఫ్ హై మార్క్ ఉంటాయి. వీటిని క్రెడిట్ బ్యూరోస్ అని కూడా అంటారు.
అదే మనం చెక్ చేసుకుంటే సాఫ్ట్ ఎంక్వైరీ అంటాము. మనం స్వతహాగా ఎన్ని సార్లు చెక్ చేసుకున్న స్కోర్ మాత్రం తగ్గదు. అయితే మనం లోన్ కోసం ఏదైన ఆర్థిక సంస్థ వద్ద అప్లై చేసుకున్నప్పుడు ఆ సంస్థ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలకు ఆ సమాచారాన్ని చేరవేస్తోంది. దీంతో ఆ సంస్థలు సిబిల్ స్కోర్ ను చెక్ చేస్తున్నాయి. దీంతో సిబిల్ స్కోర్ భారీగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే క్రెడిట్ స్కోర్‌కు సంబంధించి అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీన్ని గమనించిన ఆర్బీఐ కొత్త రూల్స్ ను ప్రవేశపెట్టింది. ఆర్బీఐ తెచ్చిన ఆ రూల్స్ తో సిబిల్ స్కోర్ సమస్యలకు పరిష్కారం లభించినట్లైంది.