iDreamPost
android-app
ios-app

Paytm కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఆ సేవలపై RBI కీలక నిర్ణయం

  • Published Feb 17, 2024 | 11:27 AM Updated Updated Feb 17, 2024 | 11:27 AM

పేటీఎం కస్టమర్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ అందించింది. పేటీఎం పేమెంట్ బ్యాంక్ సేవలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఆ సేవలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

పేటీఎం కస్టమర్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ అందించింది. పేటీఎం పేమెంట్ బ్యాంక్ సేవలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఆ సేవలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

Paytm కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఆ సేవలపై RBI కీలక నిర్ణయం

పేటీఎం.. ఇప్పుడు ఎక్కడ చూసిన దీని గురించే చర్చంతా. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేటీఎం పేమెంట్ బ్యాక్ పై ఆంక్షలు విధించిన నాటి నుంచి పేటీఎం వ్యవహారం హాట్ టాపిక్ గా మారిపోయింది. కేవైసీ నియమాలను పాటించనందుకు, ట్రాన్సాక్షన్ల విషయంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు పేటీఎం పేమెంట్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. దీంతో పేటీఎం కస్టమర్లకు పేటీఎం బ్యాంక్, వ్యాలెట్లు, ఫాస్టాగ్ సేవలపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఆ సేవలపై కీలక నిర్ణయం తీసుకుంది. పేటీఎం కస్టమర్లకు శుభవార్తను అందించింది. డిపాజిట్స్, వ్యాలెట్లు, ఫాస్టాగ్‌లను ఈ ఏడాది మార్చి 15వరకు నిర్వహించే అవకాశం కల్పిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది.

పేటీఎం యూజర్లకు మరికొంత సమయం ఇచ్చేందుకు ఆర్బీఐ పేటీఎం సేవలను పొడిగించింది. కాగా ఆర్బీఐ ఈ గడువును ఫిబ్రవరి 29 వరకు విధించగా.. తాజాగా మార్చి 15 వరకు పొడిగించింది. గడువు అనంతరం ట్రాన్సాక్షన్లకు అనుమతి ఉండదని ఆర్బీఐ స్పష్టం చేసింది. మరోవైపు పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ తన నోడల్ అకౌంట్‌ను పేటీఎం బ్యాంక్ నుంచి యాక్సిస్ బ్యాంకుకు మార్చింది. దీంతో పేటీఎం క్యూఆర్, సౌండ్ బాక్స్, కార్డ్ మెషీన్ సేవలు కొనసాగుతాయని తెలిపింది. గత కొంత కాలంగా ఆర్బీఐ నియమాలను ఉల్లంఘిస్తున్న బ్యాంకుల లైసెన్స్ లను రద్దు చేస్తూ, భారీ జరిమానాలు విధిస్తున్న విషయం తెలిసిందే.