దంపతుల ఐడియాకి ఫిదా అయిన రతన్ టాటా! ఒక్క ఆలోచన 200 కోట్లు..

  • Author Soma Sekhar Updated - 05:34 PM, Mon - 2 October 23
  • Author Soma Sekhar Updated - 05:34 PM, Mon - 2 October 23
దంపతుల ఐడియాకి ఫిదా అయిన రతన్ టాటా! ఒక్క ఆలోచన 200 కోట్లు..

నేటి ఆధునిక కాలంలో ఐడియాలే పెట్టుబడులు. మీ దగ్గర కోట్లు కురిపించే ఉపాయం ఉంటే చాలు.. మీ సంస్థలో పెట్టుబడిపెట్టడానికి ఎంతో మంది పారిశ్రామిక దిగ్గజాలు రెడీగా ఉన్నారు. తాజాగా ఓ దంపతుల ఐడియాకి ఫిదా అయ్యాడు పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా. వ్యాపార రంగంలో రతన్ టాటా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి దిగ్గజాన్నే మరిపించిన ఐడియా ఏంటి? ఆ దంపతులు ఎవరు? ఒక్క ఐడియా రూ. 200 కోట్ల సామ్రాజ్యంగా ఎలా మారిందో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచ వ్యాప్తంగా స్టార్టప్ కల్చర్ పెరిగిపోతోంది. అందుకు తగ్గట్లుగానే కొత్త కొత్త ఆలోచనలతో సరికొత్త వ్యాపారాలు పుట్టుకొస్తున్నాయి. ఇలాంటి సరికొత్త ఆలోచనతోనే ముందుకు వచ్చారు చేతన్ వాటుంజ్-అదితి భోసలే దంపతులు. స్విగ్గీ, జోమాటో తరహాలో వాహన వినియోగదారులకు అవసరమైన పెట్రోల్ డోర్ డెలివరీ చేస్తే ఎలా ఉంటుంది అన్నదే వారి ఆలోచన. ఇక తమకు వచ్చిన ఆలోచనను లేట్ చేయకుండా ‘రెపోస్ ఎనర్జీ’ అనే స్టార్టప్ కంపెనీని ప్రారంభించి.. పెట్రోల్ డోర్ డెలివరీ చేయడం స్టార్ట్ చేశారు. పూణేలో ప్రారంభమైన రెపోస్ ఎనర్జీ భారతదేశం మెుత్తం విస్తరించింది. ప్రస్తుతం దేశంలో సుమారు 65 నగరాల్లో తమ సేవలను అందిస్తోంది. ప్రారంభంలో వీరి ఆదాయం నెలకు రూ. 70 వేల రూపాయాలు మాత్రమే ఉండగా.. ప్రస్తుతం రూ. 2.2 కోట్లు సంపాదిస్తున్నారు.

ఇక ఈ బిజినెస్ ఎంతో మంది దిగ్గజ పారిశ్రామిక వేత్తలను ఆకర్షించింది. దీంతో రెపోస్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టడానికి వారు ముందుకు వచ్చారు. రతన్ టాటా సైతం ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టాడు. దీంతో వీరి బిజినెస్ వేగంగా విస్తరించడం ప్రారంభమైంది. ఇదిలా ఉంటే.. గతేడాది వీరి ఆదాయం రూ. 65 కోట్లు ఉండగా.. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ రూ. 200 కోట్లకు చేరుకుంది. టాటాగ్రూప్ మాత్రమే కాకుండా మహీంద్రా అండ్ మహీంద్రా, జనరల్ ఎలక్ట్రికల్, లారెన్స్ అండ్ టబ్రో, జేడబ్ల్యూ మారియట్ హోటల్, ఫీనిక్స్ మాల్ లాంటి కంపెనీలు రెపోస్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టాయి. అయితే పెళ్లి తర్వాత ఎలాగైనా స్టార్టప్ ప్రారంభించాలనే ఆలోచనతోనే అదితి, చేతన్ ను పెళ్లిచేసుకుందట. మరి రతన్ టాటాను ఫిదా చేసిన ఈ దంపతుల ఐడియాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments