Keerthi
Reliance Jio: టెలికాం రంగం సంస్థ రిలియన్స్ జియో మళ్లీ కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం ఊహించని విధంగా సరసమైన రిఛార్జ్ ధరలను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజగా జియో మరోసారి అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్ లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో రూ.91కే నెలవారి అపరిమిత రీఛార్జ్ ప్లాన్ కూడా ఉంది.
Reliance Jio: టెలికాం రంగం సంస్థ రిలియన్స్ జియో మళ్లీ కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం ఊహించని విధంగా సరసమైన రిఛార్జ్ ధరలను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజగా జియో మరోసారి అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్ లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో రూ.91కే నెలవారి అపరిమిత రీఛార్జ్ ప్లాన్ కూడా ఉంది.
Keerthi
ప్రముఖ టెలికాం రంగం సంస్థ రిలియన్స్ జియో ఈ మధ్య కాస్త రూటు మార్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే అధిక రీఛార్జ్ ప్లాన్స్ తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కస్టమర్లు.. BSNL నెట్ వర్క్ కు ఆకర్షితులు అవుతున్నారు. దీంతో ఇప్పటికే చాలామంది యూజర్స్ నెట్ వర్క్ మారిపోతున్నట్లు గ్రహించిన జియో.. మళ్లీ కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం ఊహించని విధంగా సరసమైన రిఛార్జ్ ధరలను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వాటిలో నెలవారి అపరిమిత కాలింగ్ తో పాటు రోజువారీ డేటా ఎస్ఎంఎస్ వంటి ఫీచర్లను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా జియో మరోసారి అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్ లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో రూ.91కే నెలవారి అపరిమిత రీఛార్జ్ ప్లాన్ ను తో మరిన్నీ ప్లాన్స్ ను ప్రకటించారు. అ మరి ఆ ప్లాన్స్ వివరాలను ఒకసారి చూద్దాం.
జియో రూ.449 రీఛార్జ్ ప్లాన్:
జియో ఇప్పుడు రూ.449కే ప్రీపెయిడ్ ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ ప్లాన్ 28 రోజుల పాటు చెల్లుబాటుతో వస్తుంది. పైగా ఇందులో రోజూ 3జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజూ 100 ఎస్ఎంఎస్ లు అందించబడతాయి. అలాగే హై స్పీడ్ డేటా పరిమితి ముగిసిన తర్వాత మీకు 64Kbps వేగంతో ఇంటర్నెట్ అందించబడుతుంది. ఒకవేళ మీరు ఈ ప్లాన్ ను కొనుగులు చేస్తే, మీరు జియో యాప్‌ల సభ్యత్వాన్ని కూడా పొందుతారు.
రూ. 448 రీఛార్జ్ ప్లాన్:
కొత్తగా రూ.448కే జియో మరో కొత్త ప్లాన్ ను అందిస్తోంది. కాగా, ఇందులో రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, 2జీబీ రోజువారీ డేటా అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు ఈ ప్లాన్ లో అపరిమిత వాయిస్ కాలింగ్ కూడా అందించబడుతుంది. పైగా ఈ ప్లాన్ లో OTT యాప్‌లకు కూడా యాక్సెస్ ఇస్తుంది. కనుక ఇందులో Jio TV యాప్, Sony LIV, Zee5 ఉన్నాయి.
రూ. 399 రీఛార్జ్ ప్లాన్:
జియో కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన రూ.399 రీఛార్జ్ ప్లాన్ గురించి చూస్తే.. ఇందులో కూడా అపరిమిత కాలింగ్, 100 ఎస్ఎంఎస్‌లు, 2.5జీబీ రోజువారీ డేటాను అందిస్తుంది. అలాగే ఇందులో కూడా హై స్పీడు ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. పైగా ఇది జియో యాప్‌లకు కూడా యాక్సెస్ ఇస్తోంది. కనుక ఈ ప్లాన్ మీకు బెస్ట్ అప్షన్ అని చెప్పవచ్చు.
రూ. 349 రీఛార్జ్ ప్లాన్:
జియో సరి కొత్తగా ఇప్పుడు రూ.రూ. 349 రీఛార్జ్ ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్లాన్ ని Hero 5G ప్లాన్ అని కూడా అంటారు. అయితే ఇందులో రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు అందుబాటులోకి రానున్నాయి. దీని వాలిడిటీ 28 రోజులు. పైగా ఇందులో ప్రతిరోజూ 2జీబీ డేటాను పొందుతారు. ఇది జియో యాప్‌లకు యాక్సెస్‌ని అందిస్తుంది. ఇది మిగతా వాటి కంటే భిన్నంగా ఉంటుంది. ఈ ప్లాన్‌కు కంపెనీ హీరో 5G ట్యాగ్‌ని కూడా ఇచ్చింది.
రూ.329 రీఛార్జ్ ప్లాన్:
రూ.329కే జియో ఇప్పుడు కొత్తగా 28 రోజుల చెల్లుబాటు అయ్యే ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. అయితే ఈ ప్లాన్ కోసం కంపెనీ 1.5జీబీ డేటా యాక్సెస్‌ను అందిస్తోంది. పైగా ఇది జియో యాప్‌లకు యాక్సెస్‌ని అందిస్తుంది. ఇక ఇందులో జియో క్లౌడ్, జియో సావ్న్ ప్రో కూడా ఉన్నాయి. పైగా మీరు జియో సినిమాని కూడా ఇందులో యాక్సెస్ చేయవచ్చు. కానీ, ఈ ప్రీమియం అందుబాటులో లేదు.
రూ.91 రీఛార్జ్ ప్లాన్:
జియో అత్యంత చవకైనా ధరకే ఇప్పుడు మరో కొత్త ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే రూ.91ల రీఛార్జ్ ప్లాన్. ఈ ప్లాన్ లో అపరిమిత వాయిస్ కాలింగ్, 50 ఎస్ఎంఎస్‌లు, 100 MB రోజువారీ డేటా పొందుతారు. దీనితో పాటు మీరు దానిలోని ప్రత్యేక జియో యాప్‌లకు కూడా యాక్సెస్ పొందుతారు. మీకు కావాలంటే, మీరు My Jio యాప్ నుండి కూడా ఈ రీఛార్జ్‌ని కొనుగోలు చేయవచ్చు. కానీ, ఈ ప్లాన్ కేవలం జియో ఫోన్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది.