Jio Removes 395 1559 Unlimited 5G Plans: కస్టమర్లకు Jio ఊహించని షాక్‌.. ఆ పాపులర్‌ ప్లాన్ల నిలిపివేత

కస్టమర్లకు Jio ఊహించని షాక్‌.. ఆ పాపులర్‌ ప్లాన్ల నిలిపివేత

Jio Removes 395 1559 5G Plans: రీఛార్జ్‌ ప్లాన్స్‌ ధరలను భారీగా పెంచిన జియో.. తాజాగా కస్టమర్లకు మరో షాక్‌ ఇచ్చింది. రెండు పాపులర్‌ ప్లాన్లను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

Jio Removes 395 1559 5G Plans: రీఛార్జ్‌ ప్లాన్స్‌ ధరలను భారీగా పెంచిన జియో.. తాజాగా కస్టమర్లకు మరో షాక్‌ ఇచ్చింది. రెండు పాపులర్‌ ప్లాన్లను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

రిలయన్స్‌ జియో.. ప్రైవేటు టెలికాం రంగంలో ఓ సంచలనంగా నిలిచిన సంగతి తెలిసిందే. రావడంతోనే ఉచిత డేటా, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సౌకర్యం కల్పిస్తూ.. వినియోగదారులను ఆకట్టుకుంటూ.. అప్పటికే ఈ రంగంలో నంబర్‌ వన్‌గా ఉన్న ఎయిర్‌టెల్‌కు భారీ షాక్‌ ఇచ్చిందని చెప్పవచ్చు. కస్టమర్లందరూ జియోకు మారుతుండటంతో.. మిగతా కంపెనీలు కూడా దిగి రాక తప్పలేదు. దాంతో ఎయిర్‌టెల్‌, వీఐ వంటి కంపెనీలు కూడా జియో బాటలో పయనిస్తూ.. తక్కువ ధరలోనే రీఛార్జ్‌ ప్లాన్స్‌ను తీసుకువచ్చాయి. ఇలా కొన్నాళ్ల పాటు సాగింది. ఇక తాజాగా రిలయన్స్‌ జియో.. తన రీఛార్జ్‌ ప్లాన్స్‌ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జూలై నుంచే పెరిగిన రేట్లు అమల్లోకి వచ్చాయి. ఇక ఎయిర్‌టెల్‌, వీఐ కూడా ఇదే బాటలో పయనిస్తూ.. రీఛార్జ్‌ ప్లాన్స్‌ రేట్లను పెంచాయి. ఇదిలా ఉండగా తాజాగా జియో కస్టమర్లకు మరో షాక్‌ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. పాపులర్‌ ప్లాన్స్‌ను తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

రిలయన్స్ జియోలో ఎంతో పాపురల్‌ అయిన అన్‌లిమిటెడ్‌ 5 జీ ప్లాన్స్‌ ఏవంటే.. రూ .395, రూ .1,559 ప్రీపెయిడ్ ప్లాన్లే అని చెబుతారు. చాలా మంది వీటినే రీఛార్జ్‌ చేసుకుంటారు. అయితే తాజాగా జియో వాటిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించి భారీ షాక్‌ ఇచ్చింది. ఈ నిర్ణయం చాలా మంది జియో ప్రీ పెయిడ్ వినియోగదారులను నిరాశపరిచింది. జియో వినియోగదారుల్లో ఎక్కువ మంది.. అపరిమిత 5జీ డేటా ఆఫర్లు, పొడిగించిన వ్యాలిడిటీ పీరియడ్స్ కోసం ఈ ప్లాన్లను రీఛార్జ్‌ చేసుకునేవారు. ఇప్పుడు జియో వాటిని తొలగించడం కస్టమర్లకు షాక్‌ అని చెప్పవచ్చు.

లాభాల కోసమే ఈ నిర్ణయం..

రిలయన్స్ జియో తన రీఛార్జ్‌ ప్లాన్స్‌ రేట్లను జూలైలో పెంచి.. అమల్లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లాభాల పెంపు కోసం ఈ పాపులర్ 5జీ ప్లాన్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. పోటీ మార్కెట్లో లాభదాయకతను పెంచుకోవడానికి, ప్రతి వినియోగదారుడిపై సగటు ఆదాయాన్ని పెంచుకోవడానికే జియో ఈ నిర్ణయం తీసుకుంది అంటున్నారు.

రిలయన్స్ జియో ఇప్పుడు నిలిపివేసిన రూ .395 ప్లాన్ 84 రోజుల వాలిడిటీని అందించగా, రూ .1,559 ప్లాన్ 336 రోజుల వాలిడిటీని అందించింది. ఈ రెండు ప్లాన్లలో అపరిమిత 5జీ డేటా వస్తుండటంతో.. ఎక్కువ మొత్తంలో డేటాను ఉపయోగించే వినియోగదారులను ఈ ప్లాన్లు బాగా ఆకర్షించాయి. చాలా మంది వీటినే రీఛార్జ్‌ చేసుకునేవారు. అలాంటి వారందరికి ఈ నిర్ణయం షాక్‌ అనే చెప్పవచ్చు. ఇక టారిఫ్ సవరణలో భాగంగా జియో బేస్ ప్లాన్ రూ.155 నుంచి రూ.189కి పెరిగింది. అంటే, దాదాపు 22 శాతం పెరిగింది.

వీటితో పాటు రిలయన్స్ జియో ఆఫర్ చేస్తున్న ఇతర ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్స్‌ ధరలు కూడా పెరిగాయి. విభిన్న రోజువారీ డేటా పరిమితులతో (1.5 జీబీ, 2 జీబీ, 3 జీబీ) మూడు నెలల ప్లాన్ల రేట్లు భారీగా పెరిగాయి. వీటితో పాటుగా వార్షిక ప్లాన్ల ధరలు కూడా పెంచారు. 2.5 జీబీ రోజువారీ డేటాతో 365 రోజుల వ్యాలిడిటీ ఉన్న ఏడాది ప్లాన్ ధరపై ఏకంగా రూ .600 పెంచారు. ఇప్పుడు దీని ధర రూ.3,599 కి పెరిగింది.

Show comments