Arjun Suravaram
Reliance Jio: ఇప్పటికే రీఛార్జ్ ధరలు పెంచి వినియోగదారులకు షాకిచ్చిన జియో..మరోసారి సడెన్ షాకిచ్చింది. మరో రెండు ప్లాన్ ప్రిపెయిడ్ ధరలను పెంచేసింది.
Reliance Jio: ఇప్పటికే రీఛార్జ్ ధరలు పెంచి వినియోగదారులకు షాకిచ్చిన జియో..మరోసారి సడెన్ షాకిచ్చింది. మరో రెండు ప్లాన్ ప్రిపెయిడ్ ధరలను పెంచేసింది.
Arjun Suravaram
ప్రముఖ టెలికాం సంస్థ జియో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లదు. చాలా ఏళ్ల క్రితం టెలికాం సెక్టార్ లోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు అనేక ఆఫర్లను, రీచార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. అయితే ఇటీవలే రీచార్జీ ప్లాన్ ధరలు పెంచి వినియోగదారులకు గట్టి షాకిచ్చింది. ఆ షాక్ నుంచి కోలుక ముందే మరోసారి సడెన్ షాక్ ఇచ్చింది. మరోసారి తన ప్రీపెయిడ్ ప్లాన్ ధరలను జియో పెంచింది. ఇక వివరాల్లోకి వెళ్తే..
గతంలో సాధారణ ప్లాన్లను పెంచేసిన జియో ఈ సారీ ఎంటర్ టైన్ మెంట్ ప్యాక్ లను కాస్టిలీ చేసింది. ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సబ్ స్ర్కిప్షన్ తో వచ్చే రీఛార్జ్ ధరలను భారీగా పెంచేసేంది. గతంలో జియో కంపెనీ జాబితాలో నెట్ ఫ్లిక్స్ ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ధరలైన రూ.1, 099, రూ.1499 ఈ సారీ చాలా ఖరీదుగా మారాయి. ఇంతకముందు ఈ రెండు ప్లాన్‌లు నెట్‌ఫ్లిక్స్‌కి ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌తో వస్తాయి. తాజాగా ఈ రెండు ప్లాన్ పెరిగిన ధరలు చూసినట్లు అయితే రూ.1,099 ప్లాన్ రూ.200 పెరిగి ఏకంగా రూ.1299 అయింది. అలానే రూ.1,499 ప్లాన్ రూ.300 పెరిగి, రూ.1,799గా అందుబాటులోకి రానుంది.
ఇక జియో అందించే రూ. 1,299 రీఛార్జ్ ప్లాన్ ప్రయోజనాల గురించి చూసినట్లు అయితే రూ. 1,099 జియో ప్లాన్ ద్వారా వచ్చే బెనిఫిట్సే వస్తాయి. ఈ ప్లాన్ ద్వారా 84 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. అలానే వినియోగదారులు 2జీవీ డేటాకు యాక్సెస్ పొందుతారు. అంతేకాక అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజూ 100 ఎస్ఎంఎస్ లు చేసుకోవచ్చు. ఈ ప్లాన్ తీసుకున్న వాళ్లకి ఉచిత నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ పొందుతారు. ఇక జియో అందిస్తున్న రెండో ప్లాన్ రూ. 1,799 ప్లాన్ కూడా 84 రోజుల వరకు ఉంటుంది.
అయితే ఇందులో ప్రత్యేకమైన బెనిఫిట్స్ కొన్ని ఉన్నాయి. ఈ ప్రిపెయిడ్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు ప్రతిరోజూ 3 జీబీ డేటాను పొందవచ్చు. 84 రోజుల వాలిడిటీకి ఈ ప్లాన్ మీకు 252 జీబీ డేటాకు యాక్సెస్‌ను అందిస్తుంది. ఇందులో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 100 ఎస్ఎంఎస్ ల సౌలభ్యం కూడా అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ కి కూడా నెట్‌ఫ్లిక్స్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ ఉంది. మొత్తంగా జియో..మరోసారి తన కస్టమర్ల గట్టి షాకిచ్చింది. తాజాగా జియో తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.