Jio-4 New Recharge Plans Below Rs 300: Jio యూజర్లకు అంబానీ గిఫ్ట్‌.. తక్కువ ధరలో 4 కొత్త ప్లాన్స్‌

Jio యూజర్లకు అంబానీ గిఫ్ట్‌.. తక్కువ ధరలో 4 కొత్త ప్లాన్స్‌

Jio-Recharge Plans Below Rs 300: రీఛార్జ్‌ ప్లాన్స్‌ ధరల పెంపుతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం జియో నాలుగు బడ్జెట్‌ ఫ్రెండ్లీ రీఛార్జ్‌ ప్లాన్స్‌ను తీసుకు వచ్చింది. వాటి వివరాలు..

Jio-Recharge Plans Below Rs 300: రీఛార్జ్‌ ప్లాన్స్‌ ధరల పెంపుతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం జియో నాలుగు బడ్జెట్‌ ఫ్రెండ్లీ రీఛార్జ్‌ ప్లాన్స్‌ను తీసుకు వచ్చింది. వాటి వివరాలు..

ప్రైవేటు టెలికాం రంగంలో జియో ఒక సెన్సేషన్‌గా నిలిచింది. రావడంతోనే.. కస్టమర్లను ఆకట్టుకునేందుకు.. ఉచిత సిమ్ముతో పాటు.. తక్కువ ధరకే అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, ఇంటర్నెట్‌ డేటా ఇస్తూ.. వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇక జియో దెబ్బకు అప్పటి వరకు ఈ రంగంలో టాప్‌లో ఉన్న ఎయిర్‌టెల్‌ పడిపోయింది. చాలామంది కస్టమర్లు జియోకు మారారు. దాంతో ఎయిర్‌టెల్‌ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. జియో బాటలోనే పయనిస్తూ.. తక్కువ ధరలోనే అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, ఇంటర్నెట్‌ డేటా ఇచ్చే రీఛార్జ్‌ ప్లాన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇలా కొన్నాళ్లపాటు సాగింది. ఇక తాజాగా జియో తన రీఛార్జ్‌ ప్లాన్స్‌ ధరలను భారీగా పెంచింది. ఒక్కో ప్లాన్‌ మీద ఏకంగా 11-25 శాతం వరకు పెంచి.. కస్టమర్లకు షాక్‌ ఇచ్చింది. ఎయిర్‌టెల్‌, వీఐ కూడా జియో బాటలోనే పయనిస్తూ.. రీఛార్జ్‌ రేట్లను భారీగా పెంచాయి.

ఇక టెలికాం సంస్థల నిర్ణయంపై కస్టమర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతేకాక.. తక్కువ ధరకే బెస్ట్‌ రీఛార్జ్‌ ప్లాన్స్‌ను అందిస్తోన్న బీఎస్‌ఎన్‌ఎల్‌కి మారుతున్నారు. ఇప్పటికే లక్షల మంది జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లు బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారారు. కస్టమర్లను కాపాడుకునేందుకు రిలయన్స్‌ జియో దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగానే అంబానీ నాలుగు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టారు. వీటి ధర 300 రూపాయలలోపే ఉండటం గమనార్హం. ఆ ప్లాన్స్‌ వివరాలు మీకోసం..

జియో కొత్త ప్లాన్‌లు

రూ.199 ప్లాన్

జియో తెచ్చిన బడ్జెట్‌ ఫ్రెండ్లీ ప్లాన్లలో అత్యంత తక్కువ ధర ఉన్న ప్లాన్‌ ఇదే. దీన్ని రీఛార్జ్ చేసుకుంటే.. రోజుకు 1.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌తో పాటు.. రోజుకు వంద ఎస్‌ఎంఎస్‌లు పొందవచ్చు. ఇవే కాకుండా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి సబ్‌స్క్రిప్షన్‌ సౌకర్యం కల్పిస్తోంది. కాకపోతే కేవలం 18 రోజులు మాత్రమే.

రూ.209 ప్లాన్

జియో తెచ్చిన మరో బడ్జెట్‌ ఫ్రెండ్లీ ప్లాన్‌ 209 రూపాయలదే. దీన్ని రీఛార్జ్‌ చేసుకుంటే.. రోజుకు 1 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు వంద ఎస్‌ఎంఎస్‌లతో పాటు 22 రోజుల చెల్లుబాటుతో జియో ఎంటర్‌టైన్‌మెంట్ యాక్సిస్ అదనంగా లభిస్తుంది.

రూ.249 ప్లాన్

మీరు గనక ఈ ప్లాన్‌ను రీఛార్జ్‌ చేసుకుంటే.. రోజుకు 1జీబీ డేటా, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌తో పాటుగా రోజుకు వంద ఎస్‌ఎంఎస్‌లు పొందుతారు. అలానే 28 రోజుల చెల్లుబాటుతో జియో ఎంటర్‌టైన్‌మెంట్ యాక్సిస్ అదనంగా లభిస్తుంది.

రూ.299 ప్లాన్

ఈ ప్లాన్‌ను రీఛార్జ్‌ చేసుకుంటే.. మీకు రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు వంద ఎస్‌ఎంఎస్‌లతో పాటు 28 రోజుల చెల్లుబాటుతో జియో ఎంటర్‌టైన్‌మెంట్ యాక్సిస్ లభిస్తుంది.

Show comments