AC, టీవీలపై ఆఫర్ కావాలా.. మీకోసమే రిలయన్స్ డిస్కౌంట్ సేల్.. త్వరపడండి

Reliance Digital Discount Days Sale: ఏసీలు, టీవీలు తక్కువ ధరలో కొనాలని చూస్తున్నారా.. అయితే మీ కోసమే రిలయన్స్ భారీ ఆఫర్ ప్రకటించింది. ఆ వివరాలు..

Reliance Digital Discount Days Sale: ఏసీలు, టీవీలు తక్కువ ధరలో కొనాలని చూస్తున్నారా.. అయితే మీ కోసమే రిలయన్స్ భారీ ఆఫర్ ప్రకటించింది. ఆ వివరాలు..

ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెల నుంచే భానుడు తన ప్రతాపం చూపించడం మొదలు పెట్టాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో 43 డిగ్రీల వరకు ఉఫ్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం పది గంటల ప్రాంతం నుంచే వడగాలులు వీస్తున్నాయి. ఇక మధ్యాహ్నం పూట అడుగు బయటపెట్టడం అంటే నిప్పుల కొలిమిలో ప్రవేశించడమే. ఇక వేసవి తాపాన్ని ఫ్యాన్లు చల్లార్చలేకపోతున్నాయి. చాలా మంది కూలర్లు, ఏసీలు కొనుగోలు చేసేందుకు క్యూ కడుతున్నారు. మరి వాటికేమో భారీ రేట్లు. ఎలా అని ఆలోచిస్తున్నారా.. మీకోసమే రిలయన్స్ భారీ డిస్కౌంట్ సేల్ తీసుకువచ్చింది. దీనిలో భాగంగా ఏసీలు, టీవీల మీద బంపరాఫర్లు ఇస్తుంది. ఆ వివారలు..

రిలయన్స్ డిజిటల్.. డిస్కౌంట్ డేస్ సేల్ పేరుతో ప్రత్యేక డిస్కౌంట్ లు కల్పిస్తోంది. ఈ సేల్ ఏప్రిల్ 6-15 వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్లు రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్స్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్ లో భాగంగా కస్టమర్లు తమకు ఇష్టమైన ఎలక్ట్రానిక్ వస్తువులను డిస్కౌంట్ ధరల్లో కొనుగోలు చేయవచ్చని రిలయన్స్ డిజిటల్ తెలిపింది. ఎంపిక చేసిన ప్రముఖ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో చెల్లింపులు చేసినట్లయితే 10 శాతం మేర తక్షణ డిస్కౌంట్ సైతం అందిస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది.

బ్యాంకు కార్డుల మీద కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్‌తో పాటు లోన్లు తీసుకుంటే రూ. 15 వేల వరకు క్యాష్ బ్యాంక్ లభించే అవకాశం ఉందని తెలిపింది. స్మార్ట్ టీవీలు, ఐఫోన్లు, ల్యాప్ ట్యాప్‌లు, ఐపాడ్, ఏసీలు.. వంటి పలు ఎలక్ట్రానిక్, డిజిటల్ వస్తువులపై ఈ డిస్కౌంట్ లు లభిస్తాయని చెప్పుకొచ్చింది. డాల్బీ ఆట్మోస్ సౌండ్ బార్ పై 65 శాతం, బోస్ సౌండ్ బార్ పై 30 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది.

ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లపై భారీ ఆఫర్లు..

ఈ డిజిటల్ డిస్కౌంట్ డేస్ సేల్స్ లో ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు కొనుగోలు చేసే వారికి రిలయన్స్ భారీ ఆపర్స్ అందిస్తోంది. సేల్ లో భాగంగా 1 టన్ 3 స్టార్ ఇన్వర్టెర్ ఏసీ రూ.20,990లకే కొనుగోలు చేయవచ్చని తెలిపింది. అలాగే హై ఎండ్ 11 కేజీ/ 7కేజీ వాషర్ డ్రయర్ వాషింగ్ మెషిన్ రూ. 61, 990 కి లభిస్తుందని తెలిపింది. ఇక సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ డిస్కౌంట్ తర్వాత రూ. 49,990 కి లభిస్తుందని వెల్లడించింది.

స్మార్ట్ టీవీలు, స్పీకర్లు..

ఎల్‌జీ కంపెనీకి చెందిన కొత్త స్మార్ట్ టీవీ పై ఏకంగా 45 శాతం మేర డిస్కౌంట్ ఇస్తున్నట్లు రిలయన్స్ చెప్పుకొచ్చింది. సేల్ లో భాగంగా శాంసంగ్ నియో క్యూఎల్ఈడీ టీవీలు రూ. 79,990 నుంచి లభిస్తాయన్నది. మరోవైపు.. డాల్బీ ఆట్మోస్ సౌండ్ బార్ పై 65 శాతం మేర డిస్కౌంట్.. బోస్ సౌండ్ బార్ 900 పై 30 శాతం మేర డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. కనుక వినియోగదారులు ఈ ఆఫర్లను వినియోగించుకోవాలని కోరింది.

Show comments