iDreamPost
android-app
ios-app

Gold: ఇంగ్లాండ్‌ నుంచి ఇండియాకు 100 టన్నుల బంగారం తెచ్చిన RBI.. కారణమిదే

  • Published May 31, 2024 | 3:12 PMUpdated May 31, 2024 | 4:17 PM

ఆర్బీఐ.. ఇంగ్లాండ్‌ నుంచి ఇండియాకు.. 100 టన్నుల బంగారం తెచ్చింది. మరి ఇంత భారీ ఎత్తున తరలించడానికి కారణం ఏంటి అంటే.

ఆర్బీఐ.. ఇంగ్లాండ్‌ నుంచి ఇండియాకు.. 100 టన్నుల బంగారం తెచ్చింది. మరి ఇంత భారీ ఎత్తున తరలించడానికి కారణం ఏంటి అంటే.

  • Published May 31, 2024 | 3:12 PMUpdated May 31, 2024 | 4:17 PM
Gold: ఇంగ్లాండ్‌ నుంచి ఇండియాకు 100 టన్నుల బంగారం తెచ్చిన RBI.. కారణమిదే

ప్రపంచంలో బంగారాన్ని అధికంగా ఇష్టపడేది ఎవరంటే.. భారతీయులే అని చెప్పవచ్చు. మన దేశంలో ఉన్నన్ని పసిడి నిల్వలు ప్రపంచంలో ఏ దేశం వద్ద లేవు. భారతీయుల దృష్టిలో బంగారం అంటే కేవలం ఖరీదైన ఆభరణం మాత్రమే కాదు.. అక్కరకు ఆదుకునే నేస్తం కూడా. చేతిలో రూపాయి లేకపోయినా.. ఇంట్లో ఎంతో కొంత బంగారం ఉంటే సరి. దాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుని సమస్య నుంచి బయటపడవచ్చు. ఇక మన దేశంలో బంగారం నిల్వలు చాలా తక్కువ. అందుకే ప్రతి ఏటా మనం విదేశాల నుంచి భారీ ఎత్తున బంగారం దిగుమతి చేసుకుంటాం. మన దగ్గర పసిడికి డిమాండ్‌ ఎక్కువ.. దిగుబడి తక్కువ కావడంతో.. ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే పసిడి ధర ఎంత పెరిగినా మన వాళ్లు కొనడం మాత్రం ఆపరు. రోజు రోజుకు మన దగ్గర పసిడి కొనగోళ్లు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ఈ క్రమంలో తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఇండియా.. ఇంగ్లాండ్‌ నుంచి 100 టన్నుల బంగారాన్ని తెచ్చింది. ఎందుకంటే..

తాజాగా మన దేశ కేంద్ర బ్యాంక్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. బ్రిటన్‌ నుంచి సుమారు 100 టన్నుల బంగారాన్ని ఇండియాకు తీసుకువచ్చింది. ఇండియాలోని వాల్ట్స్‌కు ట్రాన్సఫర్‌ చేసినట్లు నివేదించింది. 1991 నుంచి దేశీయ స్టాక్‌కు ఇంత విలువైన బంగారాన్ని ట్రాన్స్ఫర్‌ చేయడం ఇదే మొదటిసారి. మార్చి చివరి నాటి ఆర్బీఐ వద్ద 822.1 టన్నుల బంగారం ఉంది. దీనిలో 413.8 టన్నుల గోల్డ్‌ని విదేశాల్లో నిల్వ చేసింది ఆర్బీఐ. ఇంత పెద్ద మొత్తంలో బంగారం నిల్వలు ఉండే సమస్యలు వస్తాయి. అందుకే దీనిలో కొంత భాగాన్ని విదేశాల్లో నిల్వ చేస్తుంది ఆర్బీఐ.

చాలా దేశాల సెంట్రల్‌ బ్యాంకులకు.. ఇంగ్లాండ్‌లోని బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ ప్రైమరీ స్టోర్‌ హౌస్‌గా పని చేస్తుంది. ఇండియా స్వాతంత్య్రానికి ముందు నుంచి కూడా లండన్‌ బ్యాంక్‌లో బంగారాన్ని నిల్వ చేస్తూ వస్తోంది. అయితే ఓవర్‌సీస్‌ స్టాక్‌ పెరిగిపోతున్నందున విదేశాల్లో ఉంచిన బంగారంలో కొంత ఇండియాకు తీసుకురావాలని ఆర్బీఐ నిర్ణయించుకుంది. ఈ క్రమంలో బ్రిటన్‌లోని బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ నుంచి 100 టన్నుల బంగారాన్ని భారత్‌కు తీసుకొచ్చింది. దాన్ని ముంబైలోని బింగ్‌, నాగపూర్‌ ఆర్బీఐ పాత ఆఫీస్‌లలో భద్రపర్చనుంది. ఇంత భారీ మొత్తంలో బంగారాన్ని రవాణా చేయడానికి ప్రత్యేక విమానాన్ని వినియోగిస్తారని.. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఇండియాకు చేర్చుతారని అధికారులు వెల్లడించారు.

ఆర్బీఐ వద్ద ఉన్న బంగారం నిల్వలు.. అత్యవసర ఆర్థిక పరిస్థితుల్లో, విదేశాలతో వ్యాపారం చేసే సమయంలో వాటితో లావాదేవీల కోసం వినియోగిస్తారు. అంతేకాక ప్రపంచవ్యాపంగా.. రోజు రోజుకు పసిడి విలువ పెరుగుతుంది తప్ప దిగి రావడం లేదు. కాబట్టి విదేశీ మారక ద్రవ్యం నిల్వల్లో గోల్డ్‌ ఉండటం ఇండియా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది అంటున్నారు ఆర్థిక నిపుణులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి