Somesekhar
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇది ఒక విధంగా బ్యాంకులకు, వినియోగదారులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మరి ఆ నిర్ణయం ఏంటో తెలుసుకుందాం.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇది ఒక విధంగా బ్యాంకులకు, వినియోగదారులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మరి ఆ నిర్ణయం ఏంటో తెలుసుకుందాం.
Somesekhar
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 6 నుంచి మూడు రోజుల పాటు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో ద్రవ్య విధాన కమిటీ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది కమిటి. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ తీరుపై, సమస్యలపై జరుగుతున్న ఆర్థిక పరిణామాలపై చర్చించినట్లు గవర్నర్ తెలిపారు. ఈ క్రమంలోనే బ్యాంకులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది ఆర్బీఐ. వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
RBI వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో ఫిబ్రవరి 6 నుంచి మూడు రోజుల పాటు మానిటరీ పాలసీ కమిటీ(MPC) వడ్డీ రేట్లపై సమావేశం నిర్వహిస్తోంది. ఈ మీటింగ్ లో రెపో రేట్ ను ప్రస్తుతం ఉన్న 6.5 శాతం దగ్గరే యథాతథంగా కొనసాగించాలని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ తీర్మానించింది. దీంతో రెపో రేటులో ఎలాంటి మార్పు లేకుండా కొనసాగించడం ఇది ఆరోసారి కావడం గమనార్హం. ఇక రెపో రేటు అంటే ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చిన రుణాలపై విధించే వడ్డీ రేటు. ఈ వడ్డీ రేటు ఆధారంగానే బ్యాంకులు వినియోగదారులకు ఇచ్చే రుణాలపై వడ్డీని నిర్ణయిస్తాయి. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం ఒక విధంగా బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
రెపో రేటు పెంచకపోవడంతో.. బ్యాంకులు సైతం కస్టమర్లకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లను కూడా పెంచవు. ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ..”దేశంలో మారుతున్న స్థూల ఆర్థిక పరిణామాలు, దృక్పథాలను అంచనావేసిన తర్వాతనే కమిటీ వడ్డీ రేట్లపై ఈ నిర్ణయం తీసుకుంది. అందుకే రెపో రేటును 6.5 శాతం వద్దనే యథతంథంగా ఉంచడం జరిగింది” అని గవర్నర్ శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. మరి ఆర్బీఐ వడ్డీ రేట్లపై తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదికూడా చదవండి: మొరాయిస్తున్న UPI పేమెంట్స్.. మనీ పంపేందుకు తిప్పలు!