iDreamPost

మొరాయిస్తున్న UPI పేమెంట్స్.. మనీ పంపేందుకు తిప్పలు!

UPI Payments: నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించడంలో భాగంగా ప్రవేశ పెట్టిన యూపీఐ పేమెంట్స్ సేవల్లో అంతరాయం ఏర్పడింది.

UPI Payments: నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించడంలో భాగంగా ప్రవేశ పెట్టిన యూపీఐ పేమెంట్స్ సేవల్లో అంతరాయం ఏర్పడింది.

మొరాయిస్తున్న UPI పేమెంట్స్.. మనీ పంపేందుకు తిప్పలు!

దేశంలో నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించేందుకు యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కేంద్రం ఏ ఉద్దేశంతో ఈ సేవలను ప్రోత్సహించిందో అందులో నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ యూపీఏ యాప్స్ ద్వారానే నగదు చెల్లింపులు చేస్తున్నారు. ఆఖరికి రూ.10 టీ తాగినా కూడా ఆన్ లైన్ పేమెంటే చేస్తున్నారు. వినియోగదారులు అందరూ కూడా ఈ యూపీఐ చెల్లింపులకే అలవాటు పడిపోయారు. అయితే ఇప్పుడు కొంత సమయం నుంచి యూపీఐ వినియోగదారులు చెల్లింపులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు.

నగదురహిత చెల్లింపులను తీసుకురావాలని, కరెన్సీ నోట్ల వాడకాన్ని తగ్గించాలని యూపీఐ చెల్లింపులను తీసుకొచ్చారు. కానీ, ఇప్పుడు ఆ యూపీఐ సర్వర్లు మొరాయిచండంతో మళ్లీ కరెన్సీ నోట్లు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మంగళవారం సాయంత్రం నుంచి కొంత సమయం వరకు యూపీఐ చెల్లింపుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎవరైనా పేమెంట్స్ చేస్తుంటే.. “యూపీఐ ఇష్యూ యట్ రిసీవర్స్ బ్యాంక్.. ప్లీజ్ ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్” అంటూ చూపిస్తోంది. ఈ విషయాన్ని వినియోగదారులు ఎక్స్.కామ్ వేదికగా చెప్పుకొచ్చారు. ఒక్కో బ్యాంక్ ని ట్యాగ్ చేస్తూ మీ సేవలు నిలిచిపోయాయి అంటూ చెబుతున్నారు. ముఖ్యంగా HDFC బ్యాంకు వినియోగదాలులు ఈ ఇబ్బందిని ఎదుర్కొన్నారు. అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ బరోడా, కోటక్ బ్యాంకు కస్టమర్స్.. బ్యాంకుల సర్వర్స్ పని చేయడం లేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

కొద్దిసేపటి తర్వాత HDFC బ్యాంకు సర్వర్ కూడా సెట్ అయ్యింది. మళ్లీ యథావిధిగా చెల్లింపులు జరుగుతున్నాయి. అయితే సేవలు నిలిచిపోయిన కాసేపు మాత్రం కస్టమర్స్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎందుకంటే అందరూ ఇప్పుడు ప్రతి చిన్న పేమెంట్ ని కూడా ఆన్ లైన్ లోనే చేస్తున్నారు. అందుకే ఎవరూ నగదును తీసుకెళ్లడం లేదు. కేవలం స్మార్ట్ ఫోన్ తీసుకుని వెళ్లిపోతున్నారు. ఇలా సర్వర్లు మొరాయించినప్పుడు మాత్రం నగదు ఉంటే ఎంత మేలో కదా అనే భావనకు వినియోగదారులు వచ్చేస్తున్నారు. కాబట్టి ఏ ఉద్దేశంతో అయితే కేంద్రం ఈ ఆన్ లైన్ చెల్లింపులను ప్రోత్సహిస్తోందో.. అది సరిగ్గా అమలు కావాలి అంటే.. ఇలా సర్వర్లు మొరాయించకుండా చూసుకోవాలి. మరి.. మీ యూపీఐ పేమెంట్స్ సరిగ్గా జరుగుతున్నాయా? ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీ బ్యాంకు కూడా సర్వర్ ఇష్యూ అంటే సోషల్ మీడియాలో మీ బాధను వెళ్లగక్కుతూ.. ఆ బ్యాంకును ట్యాగ్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి