iDreamPost
android-app
ios-app

బ్యాంక్ కస్టమర్లకు RBI భారీ షాక్! అంతకు మించి విత్ డ్రా చేసుకోలేరు..

  • Author Soma Sekhar Published - 09:01 PM, Tue - 25 July 23
  • Author Soma Sekhar Published - 09:01 PM, Tue - 25 July 23
బ్యాంక్ కస్టమర్లకు RBI భారీ షాక్! అంతకు మించి విత్ డ్రా చేసుకోలేరు..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. దాంతో కస్టమర్లకు భారీ షాక్ తగలనుంది. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం ఖాతాదారులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఓ బ్యాంక్ కు సంబంధించిన విత్ డ్రాల పై ఆంక్షలు విధించింది బ్యాంకుల రారాజు. దీనివల్ల కస్టమర్లపై ప్రతికూల ప్రభావం పడనుంది. ఈ బ్యాంక్ నుంచి కస్టమర్ రూ. 50 వేలు మాత్రమే విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇక ఈ ఆంక్షలు బ్యాంక్ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే వరకు అమలులో ఉంటాయని ఆర్బీఐ తెలిపింది. దీనితో పాటుగా కొత్తగా కస్టమర్లకు బ్యాంక్ రుణాలు ఇవ్వడానికి అవకాశం లేదని తెలిపింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..

ఆర్బీఐ దేశంలో పలు బ్యాంకులకు ఝలక్ ఇస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు బ్యాంకుల లైసెన్స్ ను రద్దు చేసిన ఆర్బీఐ.. తాజాగా మరో బ్యాంక్ పై ఆంక్షలు విధించింది. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న నేషనల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ పై ఆంక్షలు తీసుకొచ్చింది. బ్యాంక్ ఆర్థిక పరిస్థితులు రోజురోజుకు దివాలా తీస్తుండటంతో.. ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ బ్యాంక్ పై ఆంక్షలు విధించడంతో.. కస్టమర్లు తమ అకౌంట్ లో ఎంత డబ్బు ఉన్నా గానీ ఇక నుంచి రోజులో రూ. 50 వేలు మాత్రమే విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించింది.

ఈ క్రమంలోనే కో-ఆపరేటివ్ బ్యాంక్ కొత్తగా రుణాలు ఇవ్వడాకి కూడా అవకాశం లేదని అలాగే కొత్తగా ఖాతాదారుల దగ్గర నుంచి డిపాజిట్లను తీసుకోకూడదని దేనికైనా ఆర్బీఐ అనుమతి పొందాలని స్పష్టం చేసింది. కాగా.. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పోరేషన్ స్కీమ్ కింద బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికి రూ.5 లక్షల వరకు బీమా పరిహారం లభిస్తుందని పేర్కొంది. అయితే ఖాతాదారుల డబ్బులు ఎక్కడికి పోవని చెప్పుకొచ్చింది. బ్యాంక్ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేదాక ఈ ఆంక్షలు కొనసాగుతాయని ఆర్బీఐ వెల్లడించింది.

ఇదికూడా చదవండి: సామాన్యులకు భారీ షాక్.. పెరగనున్న వంట నూనె ధరలు!