P Venkatesh
Mahabhairab Coop Urban Bank: బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. మరో బ్యాంక్ పై ఆర్బీఐ చర్యలు తీసుకుంది. ఏకంగా బ్యాంక్ లైసెన్స్ ను రద్దు చేసింది. ఖాతాదారులు సేవలు పొందలేరు.
Mahabhairab Coop Urban Bank: బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. మరో బ్యాంక్ పై ఆర్బీఐ చర్యలు తీసుకుంది. ఏకంగా బ్యాంక్ లైసెన్స్ ను రద్దు చేసింది. ఖాతాదారులు సేవలు పొందలేరు.
P Venkatesh
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు పాటించని బ్యాంకులపై ఉక్కుపాదం మోపుతున్నది. నియమాలను అతిక్రమించే బ్యాంకుపై కొరడా ఝుళిపిస్తోంది ఆర్బీఐ. గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు చాలా బ్యాంకులకు భారీగా జరిమానాలు విధిస్తూ.. అవసరమైతే బ్యాంకుల లైసెన్స్ కూడా రద్దు చేస్తోంది. కస్టమర్లకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆర్బీఐ బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, కోపరేటీవ్ బ్యాంకులపై చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసింది ఆర్బీఐ. ఆ బ్యాంకులో మీకు అకౌంట్ ఉందేమో చెక్ చేసుకోండి.
ఆర్బీఐ బ్యాంకులపై చర్యలు తీసుకుంటుండడంతో ఖాతాదారులు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా తేజ్ పూర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మహా బైరబ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసింది ఆర్బీఐ. లైసెన్స్ రద్దవడంతో బ్యాంక్ సేవలు నిలిచిపోనున్నాయి. బ్యాంకుకు ఆదాయం లేకపోవడం.. తగినంత మూలధనం లేని కారణంగా లైసెన్స్ రద్దు చేసినట్లు ఆర్బీఐ ప్రకటించింది. బ్యాంక్‌ను మూసివేసి, లిక్విడేటర్‌ను నియమించాలని అస్సాంలోని రిజిస్ట్రార్ ఆఫ్ కో-ఆపరేటివ్ సొసైటీలకు కూడా ఆదేశాలు జారీ చేసినట్లు రిజర్వు బ్యాంక్ తెలిపింది.
మహా బైరబ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఆర్థిక పరిస్థితి సరిగా లేనందున డిపాజిటర్లకు పూర్తిగా చెల్లించలేకపోతుందని ఆర్బీఐ తెలిపింది. ఇలాంటి సందర్భాల్లో బ్యాంక్ ను కొనసాగించడం డిపాజిటర్ల ప్రయోజనాలకు విఘాతం కలిగించినట్లు అవుతుందని తెలిపింది. లైసెన్స్ రద్దైన క్రమంలో ప్రతి డిపాజిటర్ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ నుండి కస్టమర్‌లు ఒక్కో డిపాజిటర్‌కు రూ.5 లక్షల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆర్బీఐ చర్యలు తీసుకుంటున్నప్పటికీ బ్యాంకుల పనితీరులో మాత్రం మార్పుకనపడడం లేదని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.