Ratan Tata: పార్సీ పద్ధతిలో కాకుండా.. రతన్ టాటా అంత్యక్రియలు వర్లీ శ్మశానవాటికలో ఎందుకంటే?

Ratan Tata Final Rites In Mumbai Varli Burial ground: భారతదేశ వ్యాపార దిగ్గజం రతన్ టాటా తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహానికి ముంబయి వర్లీ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే పార్సీ పద్ధతిలో కాకుండా.. ఇలా ఎందుకు చేశారు?

Ratan Tata Final Rites In Mumbai Varli Burial ground: భారతదేశ వ్యాపార దిగ్గజం రతన్ టాటా తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహానికి ముంబయి వర్లీ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే పార్సీ పద్ధతిలో కాకుండా.. ఇలా ఎందుకు చేశారు?

రతన్ టాటా ఇకలేరు.. ఈ వార్త కొన్ని కోట్ల మందిని కలచి వేస్తోంది. బిగ్గెస్ట్ బిజినెస్ టైకూన్లలో ఒకరైన రతన్ టాటా దేశానికి ఎనలేని సేవ చేశారు. తాను సంపాదించిన దానిలో 65 శాతం సేవల కోసమే వినియోగించారు. దేశమే తన కుటుంబంగా భావించారు. ఈ దేశం తనకు ఏం చేసింది అని కాకుండా.. దేశానికి ఆయన ఏం చేయగలరు అని మాత్రమే ఆలోచించారు. టాటా గ్రూప్ విజయాల్లో కీలక భూమిక పోషించారు. వ్యాపారవేత్తగానే కాకుండా.. ఒక వ్యక్తిగా కూడా కొన్ని కోట్ల మంది అభిమానాన్ని చూరగొన్నారు. అలాంటి వ్యక్తి ఇక మన మధ్యలేరు అనే వార్తను చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తున్నారు. ముంబయిలోని వర్లీ శ్మశానవాటికలో అధికార లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలను పూర్తి చేశారు. రతన్ టాటా పార్సీ మతానికి చెందిన వ్యక్తి అని అందరికీ తెలిసిందే. పార్సీ కమ్యూనిటీలో అంత్యక్రియలు భిన్నంగా ఉంటాయి. కానీ, రతన్ టాటా అంత్యక్రియలను సాధారణంగానే నిర్వహిస్తున్నట్లు టాటా గ్రూప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అసలు అలా ఎందుకు చేశారు అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. అసలు అలా ఎందుకు చేశారో చూద్దాం..

మొదట ఆస్పత్రి నుంచి రతన్ టాటా పార్థివదేహాన్ని ఇంటికి తరలించారు. గురువారం ఉదయం ఇంటి నుంచి ఎన్సీపీఏ గ్రౌండ్ కు తరలించారు. అక్కడ సందర్శనార్థం రతన్ టాటా పార్థివదేహాన్ని 3.30 గంటల వరకు ఉంచారు. తర్వాత అక్కడి నుంచి వర్లి శ్మశానవాటికకు తీసుకెళ్లారు. ముంబయిలోని వర్లి శ్మశాన వాటికలో రతన్ టాటా అంత్యక్రియలను పూర్తి చేశారు. ప్రభుత్వం అధికార లాంఛనలతో రతన్ టాటా అంత్యక్రియలు నిర్వహించింది. మహారాష్ట్ర ప్రభుత్వం సంతాప దినంగా ప్రకటించింది. అయితే సాధారణ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించడంపై ఒకింత చర్చ జరుగుతోంది.

రతన్ టాటా పార్సీ మతానికి చెందిన వ్యక్తి అని అందరికీ తెలిసిందే. జొరాస్ట్రియన్ మతాన్ని అనుసరించే పార్సీ కమ్యూనిటీ ఇండియాలో అతి చిన్నది. కానీ, వాళ్లు అత్యంత ప్రభావవంతమైన వాళ్లు. వారిలో రతన్ టాటా కూడా ఒకరు. అయితే పార్సీ క్మయూనిటీలో అంత్యక్రియలు ప్రత్యేకంగా ఉంటాయి. వాళ్లు సాధారణంగా నిర్వహించే అంత్యక్రియల పద్ధతులను పాటించరు. మొదట అసలు పార్సీ విధానంలో అంత్యక్రియలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. పార్సీలు మృతదేహాలను కాల్చడం, పూడ్చడం వంటివి చేయరు. మానవ శరీరం పకృతి ఇచ్చిన వరం అంటారు. అందుకే తిరిగి ఆ శరీరాన్ని ప్రకృతికి ఇచ్చేయాలి అంటారు. గాలి, భూమి, నిప్పు, నీరు చాలా పవిత్రమైనవి. కాబట్టి వాటిని కలుషితం చేయకూడదు అంటారు. అందుకే మృతదేహాలను రాబందులు, పక్షులు, జంతువులు ఉన్న దగ్గర గాలికి వదిలేస్తారు. ఇందుకోసం టవర్ ఆఫ్ సైలెన్స్ అనే ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకుంటారు.

పార్సీలు ఈ విధానాన్ని ధమ్కా అని పిలుస్తారు. ఈ విధానంలో మృతదేహాలను రాబందులు పీక్కుతింటాయి. ఆ తర్వాత మిగిలిన వాటిని ఎలుకలు, పక్షులు తింటాయి. ఎముకలు మాత్రం అలాగే బావిలో ఉండిపోతాయి. రెండేళ్ల తర్వాత తమ వాళ్లు వెళ్లి ఆ ఎముకలను సేకరించి డిస్పోజ్ చేస్తారు. అయితే ఇప్పుడు పార్సీల్లో చాలామంది ఈ విధానాన్ని పాటించడం లేదు. ఎందుకంటే ఇప్పుడు దేశంలో రాబందుల జాడ కనిపించడం లేదు. ముఖ్యంగా సిటీల్లో అసలు రాబందులు కనిపించడమే లేదు. అందుకే పార్సీల్లో చాలా మంది టవర్ ఆఫ్ సైలెన్స్ విధానాన్ని పాటించడం మానేశారు. చాలా మంది ఈ విధాన్ని కొనసాగించకూడదు అని డిమాండ్లు కూడా చేస్తున్నారు. 2022లో పార్సీ మతానికి చెందిన మరో ప్రముఖుడైన సైరస్ మిస్త్రీ అంత్యక్రియలు కూడా.. వర్లీ శ్మశాన వాటికలోనే నిర్వహించారు. ఇప్పుడు రతన్ టాటా అంత్యక్రియలను కూడా సాధారణ పద్ధతిలోనే వర్లీ శ్మశాన వాటికలో నిర్వహించారు.

Show comments