పోస్టాఫీస్ లో సూపర్ స్కీమ్.. రోజుకు రూ.30 కడితే చాలు.. చేతికి రూ.5 లక్షలు!

Post Office Scheme: ఎలాంటి రిస్క్ లేకుండా మంచి రాబడి అందుకోవాలని చూస్తున్న వారికి పోస్టాఫీసు నుంచి బెస్ట్ పథకాలు అందుబాటులో ఉన్నాయి. చిన్నమొత్తాల పొదుపు పథకాల్లో ఒకటైన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో మీరు రోజుకు రూ.30 జమ చేస్తే ఒకేసారి రూ.5 లక్షలకుపైగా అందుకోవచ్చు.

Post Office Scheme: ఎలాంటి రిస్క్ లేకుండా మంచి రాబడి అందుకోవాలని చూస్తున్న వారికి పోస్టాఫీసు నుంచి బెస్ట్ పథకాలు అందుబాటులో ఉన్నాయి. చిన్నమొత్తాల పొదుపు పథకాల్లో ఒకటైన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో మీరు రోజుకు రూ.30 జమ చేస్తే ఒకేసారి రూ.5 లక్షలకుపైగా అందుకోవచ్చు.

కేంద్ర ప్రభుత్వానికి చెందిన తపాల వ్యవస్థ ఒకటి. పూర్వం ఇది కేవలం ఉత్తరాలను, ఇతర సమాచారాలను చేరవేసేది. అయితే ఇప్పుడు మాత్రం అలా కాదు..పోస్టాఫీస్ అనేక రకాల  సేవలను ప్రజలకు అందిస్తోంది. సామాన్య ప్రజలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు ఎన్నో స్కీమ్ లో ప్రారంభించింది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికి ఎన్నో రకలా పథకాలను అందిస్తోంది. అలాంటి వాటిలో ఓ స్కీమ్ సూపర్ గా ఉంది. చిన్నపొదుపు పథకాల్లో ఒకటైన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో మంచి రాబడులు అందిస్తోంది. ఇక  ఈ స్కీమ్ యొక్క పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

కేంద్ర ప్రభుత్వం సంస్థ అయినా పోస్టాఫీస్ చాలా రకాల పొదుపు పథకాలను అందిస్తోంది. అలానే స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌లో ఒకటైన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ను కూడా పోస్టాఫీస్ అందిస్తోంది. దీని ద్వారా  మంచి రాబడులు వస్తాయి. ఈ స్కీమ్‌లో క్రమం తప్పకుండా పెట్టుబడి చేయడం ద్వారా మంచి రిటర్న్స్ పొందవచ్చు. పోస్టాఫీస్ అందిస్తున్న వాటిల్లో పీపీఎఫ్ మంచి రిటరైర్మెంట్ పథకంగా చెప్పవచ్చు. ఈ స్కీమ్ మెచ్యూరిటీ టెన్యూర్ 15 ఏళ్లుగా ఉంటుంది. ఆ తర్వాత కూడా మరో 5 ఏళ్ల పెంచుకుంటూ వెళ్లవచ్చు.

ఇక ఈ పీపీఎఫ్ స్కీమ్ లో ప్రస్తుతం 7.1 శాతం మేర వడ్డీ  ఉంటుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ పథకాల వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయడం పెట్టడం ద్వారా సెక్షన్ 80సీ కింద టాక్స్ మినహాయింపులూ పొందవచ్చు. వార్షికంగా రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపులు సేవ్ అవుతాయి.  అదే విధంగా వడ్డీ, విత్ డ్రా చేసుకునే మొత్తంపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు. ఇక ఈ స్కీమ్ ద్వారా గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు ఇందులో పెట్టుబడి చేసేందుకు అవకాశం ఉంటుంది.

ఉదాహరణకు మీరు పీపీఎఫ్ స్కీమ్ లో రూ.10 వేలు పెట్టుబడి పెట్టారు అనుకుందాం. మీరు పెట్టుబడి పెట్టే మొత్తం రూ.2 లక్షలు అవుతుంది. 15 ఏళ్ల మెచ్యూరిటీ తర్వాత మరో 5 ఏళ్ల పాటు అంటే 20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ మెంట్ అలానే  ఉంచితే.. దానిపై వడ్డీ రూ.2.43 లక్షల వరకు అందుతుంది. మొత్తంగా మీ చేతికి 4.50 లక్షల రూపాయలు అందుతాయి. ఏడాదికి రూ.10 వేలు అంటే రోజుకు వచ్చేసి.. రూ.27 మాత్రమే పడుతుంది. అదే మీరు రోజుకు రూ.30 చొప్పున పెట్టుబడి పెట్టినట్లు అయితే నెలకు రూ.1000 అవుతుంది. ఏడాదికి చూసినట్లు అయితే రూ.12వేలు పెట్టుబడి పెట్టాలి. ఆ 12 వేల పెట్టుబడికి 20 ఏళ్ల మెచ్యూరిటీ తర్వాత మీ చేతికి రూ.5.3 లక్షలు అందుతాయి. అలా  పీపీఎఫ్ స్కీమ్ ద్వారా మంచి లాభాలు ఉన్నాయి.

Show comments