​కేంద్రం గుడ్‌న్యూస్‌.. ఖాతాల్లోకి రూ.2 వేలు! చెక్‌ చేసుకోండిలా..!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు రంగాల వారికి పలు పథకాలను తీసుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దసరా కానుకగా వారికి తీపి కబురు చెప్పింది మోడీ సర్కార్. వారి ఖాతాల్లోకి రూ. 2 వేలు వేయనుంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు రంగాల వారికి పలు పథకాలను తీసుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దసరా కానుకగా వారికి తీపి కబురు చెప్పింది మోడీ సర్కార్. వారి ఖాతాల్లోకి రూ. 2 వేలు వేయనుంది.

రైతే దేశానికి వెన్నుముక అంటుంటారు. అన్నదాత లేకపోతే మానవుడి మనుగడ ప్రశ్నార్థంకగా మారిపోతుంది. నాలుగేళ్లు నోటిలోకి వెళుతున్నాయంటే కారణం కర్షకుడి ఫలితమే. కానీ అలాంటి రైతు ప్రకృతి విపత్తు, దళారీ చేతిలో మోసపోతున్నాడు. చివరకు ఉరి కొయ్యకు వేలాడుతూ, పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకుంటున్నారు. ఏటా వందలాది మంది రైతులు బలౌపోతున్నారు. దీంతో కర్షకులను ఆదుకునేందుకు ముందుకు వచ్చాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. పలు పథకాలను తీసుకు వచ్చాయి. వీటిలో ఒకటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన పథకమే పీఎం కిసాన్ యోజన . రైతుల వ్యవసాయానికి పెట్టుబడికి, ఇతర అవసరాలకు ఏడాదికి రూ. 6 వేలు చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. 2019లో ఫిబ్రవరిలో ఈ పథకాన్ని తీసుకు వచ్చింది మోడీ సర్కార్.

ఈ మొత్తాన్ని ప్రతి నాలుగు నెలలకు రెండు వేల చొప్పున మూడు దఫాలుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తుంది. అలా వీరి ఖాతాలోకి రూ. 6 వేలు బదిలీ కానున్నాయి. ఇప్పటి వరకు 17 విడతలుగా నగదును రైతులకు అందజేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ లెక్కన మొత్తం 34 వేలు పొందారు అన్నదాతలు. ఇప్పుడు 18వ దఫా నిధులు విడుదల చేయాల్సి ఉంది. ఈ నగదు కోసం దేశ వ్యాప్తంగా రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ దఫా ఫీఎం కిసాన్ డబ్బులు విడుదలయ్యే తేదీ ఖరారైంది. అక్టోబర్ 5న ఈ డబ్బులు విడుదల చేస్తారని పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ పేర్కొంది. అంటే దసరా సమయంలో అన్నదాతల ఖాతాల్లోని నిధులు జమ కానున్నాయి. అయితే ఈ నగదు నేరుగా రైతుల ఖాతాల్లోనే పడనున్నాయి. 18వ విడత అందాలంటే రైతులు ఈ కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎలా చేయాలంటే..?

ఈ- కేవైసీని మొత్తం 3 విధానాల్లో చేసుకోవచ్చు. ఒకటి పీఎం కిసాన్ పోర్టల్ ద్వారా ఓటీపీ బేస్డ్ కేవైసీ చేసుకోవచ్చు.

అధికారిక https://pmkisan.gov.in కి వెళ్లాలి.

ఫార్మర్ కార్నర్.. విభాగంలోని ‘ఈకేవైసీ’ పై క్లిక్ చేయాలి.

12 అంకెల ఆధార్ నంబర్‌ను టైప్ చేయాలి

‘సెర్చ్’ బటన్‌పై క్లిక్ చేస్తే ఆధార్- రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి

ఈకేవైసీపీ ప్రక్రియను పూర్తి చేయడానికి సబ్‌మిట్ బటన్ నొక్కాలి.

లేదా సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్లలో బయోమెట్రిక్ ద్వారా కేవైసీ చేసుకునే వీలుంటుంది. లేదా పీఎం కిసాన్ మొబైల్ యాప్‌లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా ఇ- కేవైసీ ప్రాసెస్ ఇంటి నుండే సులభంగా పూర్తి చేసుకోవచ్చు. ఈ పథకానికి అర్హత సాధించాలంటే.. కచ్చితంగా లబ్దిదారుడు ఆధార్ కార్డును బ్యాంక్ ఖాతాకు లింక్ చేసుకొని ఉండి తీరాలి.అప్పుడే మీ ఖాతాలోకి 2, 000 రూపాయలు జమ అవుతాయి.

Show comments