Safest Car: మిడిల్ క్లాస్ కోసం 6 లక్షల్లోనే సేఫెస్ట్ కారు.. మరెన్నో ప్రత్యేకలు కూడా..!

ఏ కారు కొనాలి? ఎంతలో కొనాలి? ఎలాంటి ఫీచర్లతో కొనాలి? అనే ప్రశ్నలను పరిశీలించే చాలామంది.. ఎంతో సేఫెస్ట్ కారు కొనాలి అనిమాత్రం ఆలోచించరు. అందుకే బడ్జెట్ లో సేఫెస్ట్ కారుని మీకోసం తీసుకొచ్చాం.

ఏ కారు కొనాలి? ఎంతలో కొనాలి? ఎలాంటి ఫీచర్లతో కొనాలి? అనే ప్రశ్నలను పరిశీలించే చాలామంది.. ఎంతో సేఫెస్ట్ కారు కొనాలి అనిమాత్రం ఆలోచించరు. అందుకే బడ్జెట్ లో సేఫెస్ట్ కారుని మీకోసం తీసుకొచ్చాం.

కారు కొనాలి అని ఫిక్స్ అయిన తర్వాత అందరూ ఏ కారు కొనాలి? ఎంతలో కొనాలి? ఎంత మైలేజ్ ఇచ్చే కారు కొనాలి అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ, చాలా తక్కువ మంది మాత్రమే ఎంత సేఫెస్ట్ కారు కొనాలి అనే ఆలోచన చేస్తారు. నిజానికి మైలేజ్, ప్రైస్, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఇలా అన్నీ చూసిన తర్వాత మాత్రమే భద్రత గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ, నిజానికి మీరు భద్రత గురించే ముందు తెలుసుకోవాలి. అందుకే మీకోసం ఇప్పుడు బడ్జెట్ లోనే సేఫెస్ట్ కారుని తీసుకొచ్చాం. ఆ కారు ధర, స్పెసిఫికేషన్స్, మైలేజ్, వివరాలు అన్నీ తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు.

ఆ సేఫెస్ట్ కారు మరేదో కాదు.. టాటా పంచ్. టాటా కంపెనీ కార్లు అంటే వినియోగదారులకు ఒక భద్రత పరంగా ఎంతో నమ్మకం ఉంటుంది. కానీ, ధరలు మాత్రం ఎక్కువగా ఉంటాయి అనుకుంటారు. కానీ, మీరు కేవలం రూ.6 లక్షల ఎక్స్ షోరూమ్ ధరకే టాటా పంచ్ బేసిక్ మోడల్ ని సొంతం చేసుకోవచ్చు. ఈ ఎస్యూవీ ఎక్స్ షోరూమ్ ధర రూ.6 లక్షల నుంచి రూ.10.10 లక్షల వరకు ఉంటుంది. మొత్తం 31 వేరియంట్స్ ఉన్నాయి. బేసిక్ నుంచి వేరియంట్ మారే కొద్దీ.. మోడల్ పెరగడంతో పాటు స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ కూడా పెరుగుతాయి. అలాగే ధర కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ కారు 1199సీసీ.. 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తోంది. మైలేజ్ విషయానికి వస్తే.. పెట్రోల్ వేరియంట్ లో లీటరుకు రూ.18.8 నుంచి 20 కిలోమీటర్ల వరకు మైలేజ్ వస్తుందని కంపెనీ క్లయిమ్ చేస్తోంది. అలాగే సీఎన్జీ మోడల్ లో కిలోకి రూ.26.5 కిలో మీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

ఇంక బూట్ స్పేస్ చూస్తే 366 లీటర్స్ బూట్ స్పేస్ లభిస్తుంది. టాటా పంచ్ కారు ఇంటీరియర్ కూడా ఎంతో క్లాసీగా ఉంటుంది. ఇందులో 7 ఇంచెస్ ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఉంటుంది. 6 స్పీకర్స్ ఉంటాయి. ఇందులో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఇంక సేఫ్టీ పరంగా చూసుకుంటే ఈ కారుకు గ్లోబల్ ఎన్ క్యాప్ రేటింగ్ లో 5కి 5 స్టార్స్ వచ్చాయి. అంటే ఇది మీకు, మీ కుటుంబసభ్యులకు మంచి సేఫెస్ట్ కారుగా చెప్పచ్చు. ఇప్పటికే టాటా పంచ్ కు సంబంధించి నెట్టింట ఎన్నో వీడియోలు వైరల్ అయ్యాయి. వాటిలో కొన్ని గొప్ప గొప్ప కార్లుగా చెప్పుకున్న మోడల్స్ కు టాటా పంచ్ ఇచ్చిన పంచులను చూసి నివ్వెర పోయారు. అవతలి కారు నుజ్జు నుజ్జు అయినా కూడా టాటా పంచ్ కు మాత్రం చిన్న డెంట్లు పడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంక ఈ కారులో మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మరి.. టాటా పంచ్ కారు మీకు ఎలా అనిపించింది? ఒకవేళ మీరు ఇప్పటికే టాటా పంచ్ వాడుతూ ఉన్నట్లయితే మీ యూజర్ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments