iDreamPost
android-app
ios-app

16 ఏళ్లకే రూ.100 కోట్ల స్టార్టప్‌.. ఇది కదా నిజమైన తెలివికి అర్థం!

16 ఏళ్ల వయసులో పిల్లలు చదువులతో బిజీగా ఉంటారు. అయితే ఓ బాలిక మాత్రం అందుకు భిన్నం చదువుకుంటూనే ఏకంగా ఓ స్టార్టప్ ను ప్రారంభించి.. 100 కోట్లు విలువ చేసే స్టార్టప్ గా సక్సెస్ సాధించింది.

16 ఏళ్ల వయసులో పిల్లలు చదువులతో బిజీగా ఉంటారు. అయితే ఓ బాలిక మాత్రం అందుకు భిన్నం చదువుకుంటూనే ఏకంగా ఓ స్టార్టప్ ను ప్రారంభించి.. 100 కోట్లు విలువ చేసే స్టార్టప్ గా సక్సెస్ సాధించింది.

16 ఏళ్లకే రూ.100 కోట్ల స్టార్టప్‌.. ఇది కదా నిజమైన తెలివికి అర్థం!

లక్ష్యాన్ని సాధించే క్రమంలో వేసే మొదటి అడుగు కష్టంగా ఉన్నప్పటిక అధైర్యపడకుండా ముందుకు సాగితేనే విజయం వరిస్తుంది. జీవితంలో సాధించాలనే కసి ఉంటే ఏదైనా సాధించొచ్చని నిరూపిస్తున్నారు నేటి యువత. వినూత్నమైన ఆలోచనలతో సరికొత్త ఆవిష్కరణలు సృష్టిస్తూ ఔరా అనిపిస్తున్నారు. అందివచ్చిన టెక్నాలజీని ఆసరాగా చేసుకుని అద్భుతాలు సృష్టిస్తున్నారు. ప్రతిభ ఉంటే చాలు సంపాదనకు ఎండ్ పాయింట్ ఉండదని రుజువు చేస్తున్నారు. ఈ క్రమంలో 16 ఏళ్ల ఓ బాలిక స్టార్టప్ ను ప్రారంభించి కోట్లు కొల్లగొట్టింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100 కోట్లు విలువను కలిగి ఉంది ఆ బాలిక స్థాపించిన ఆ స్టార్టప్.

ప్రస్తుతం ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని శాసిస్తోంది. ఏఐ టెక్నాలజీతో పలు రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అయితే ఏఐ టెక్నాలజీ కొంతమందికి కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రాంజలి అవస్థి అనే 16 ఏళ్ల బాలిక డెల్వ్.ఏఐ అనే స్టార్టప్ ను స్థాపించి రూ. 100 కోట్ల విలువతో సక్సెస్ సాధించింది. సాధారణంగా ఈ వయసులో పిల్లలు చదువులతో బిజీగా ఉంటారు. కానీ ప్రాంజలి మాత్రం చదువుకుంటూనే స్టార్టప్ ను ప్రారంభించింది. ప్రాంజలి డెల్వ్.ఏఐని 2022లో ప్రారంభించింది. ఈ సంస్థ రీసెర్చ్, డేటా వెలికితీతకు సంబంధించిన సేవలను అందిస్తుంది. భారత్ కు చెందిన ప్రాంజలి అవస్థి కుటుంబం తనకు 11 ఏళ్ల వయసున్నప్పుడు భారత్ నుంచి ఫ్లోరిడాకు వెళ్లింది. అవస్థి తండ్రి ప్రాంజలిని కంప్యూటర్ సైన్స్ వైపు ప్రోత్సహించడంతో ఏడు సంవత్సరాల వయసులోనే కోడింగ్ ప్రారంభించింది.

13 ఏళ్ల వయసులో ప్రాంజలి ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్శిటీకి చెందిన రీసెర్చ్ ల్యాబ్స్‌లో ఇంటర్న్‌షిప్ ద్వారా బిజినెస్ వరల్డ్ లోకి ప్రవేశించింది. ఇంటర్న్‌షిప్ సమయంలో ప్రాంజలి మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్‌లలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ప్రాంజలి మియామిలో ఏఐ స్టార్టప్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌లోకి అడుగుపెట్టింది. దీంతో ఆన్ డెక్, విలేజ్ గ్లోబల్ సంస్థలు పెట్టుబడులను పెట్టాయి. అయితే ప్రాంజలి కంపెనీని స్థాపించిన తర్వాత దాదాపు రూ3.7 కోట్ల నిధులను సేకరించింది. ప్రాంజలి ప్రారంభించిన స్టార్టప్ కేవలం ఒక ఏడాదిలోనే రూ100 కోట్లకు చేరింది. ప్రాంజలి ప్రస్తుతం పలువురిక ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి