iDreamPost
android-app
ios-app

Post Ofiice ఫ్రాంఛైజీ బిజినెస్.. రూ. 5 వేల పెట్టుబడితో.. కళ్లు చెదిరే ఆదాయం!

మీరు బిజినెస్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే పోస్టల్ డిపార్ట్ మెంట్ అందించే పోస్టాఫీస్ ఫ్రాంచైజీని ప్రారంభించి అధిక లాభాలను ఆర్జించొచ్చు. కేవలం 5 వేల పెట్టుబడితోనే ఫ్రాంచైజీని ఓపెన్ చేయొచ్చు.

మీరు బిజినెస్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే పోస్టల్ డిపార్ట్ మెంట్ అందించే పోస్టాఫీస్ ఫ్రాంచైజీని ప్రారంభించి అధిక లాభాలను ఆర్జించొచ్చు. కేవలం 5 వేల పెట్టుబడితోనే ఫ్రాంచైజీని ఓపెన్ చేయొచ్చు.

Post Ofiice ఫ్రాంఛైజీ బిజినెస్.. రూ. 5 వేల పెట్టుబడితో.. కళ్లు చెదిరే ఆదాయం!

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో సేవలందిస్తున్న పోస్టాఫీస్ భారతీయ తపాలా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నది. పోస్టాఫీస్ ద్వారా పార్శిల్లు, ఉత్తర ప్రత్యుత్తరాలు చేరవేయుటకు ప్రజలు విరివిగా ఉపయోగిస్తున్నారు. ప్రజావసరాలకు అనుగుణంగా పోస్టాఫీస్ సేవలు కూడా విస్తరించాయి. నేడు బ్యాంకులకు సమాంతరంగా సేవలందిస్తున్నాయి. అంతే కాదు పోస్టాఫీస్ నేడు అధిక లాభాలతో కూడిన పెట్టుబడి పథకాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. పెట్టుబడులపై మంచి వడ్డీ రేట్లను కూడా అందిస్తోంది. కాగా పెట్టుబడుల ద్వారానే గాక పోస్టాఫీస్ ఫ్రాంచైజీ వ్యాపారంతో కూడా కళ్లు చెదిరే లాభాలను అందుకోవచ్చు.

ఇప్పటికే కొంతమంది ఏటీఏం ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసుకుని మంచి ఆదాయం పొందుతున్నారు. ఇదే గాక ఇప్పుడు పోస్టల్ డిపార్ట్ మెంట్ పోస్టాఫీస్ ఫ్రాంచైజీ అవకాశం కల్పిస్తోంది. అదే ప్రోస్టాఫీసు ఫ్రాంచైజీ బిజినెస్ స్కీమ్. మీరు కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఇదే మంచి అవకాశం. తక్కువ పెట్టుబడితోనే అధిక లాభాలను అందుకోవచ్చు. పోస్టాఫీస్ ఫ్రాంచైజీ తెరిచేందుకు రూ. 5వేలు పెట్టుబడిపెడితే చాలు. పోస్టాఫీస్ ఫ్రాంచైజీని ఓపెన్ చేసి సేవలపై కమీషన్ల ద్వారా మంచి లాభాలను పొందే వీలుంది. ప్రజలకు విసృతమైన సేవలు అందించడంలో భాగంగా పోస్టల్ డిపార్ట్ మెంట్ రెండు రకాల ఫ్రాంచైజీలను ఆఫర్ చేస్తోంది. ఒకటి ఫ్రాంచైజీ అవుట్‌లెట్లు, రెండోది పోస్టల్ ఏజెంట్లు. ఫ్రాంచైజీ అవుట్‌లెట్లను కౌంటర్ సర్వీసులు అందించేందుకు ప్రారంభించొచ్చు. అలాగే పోస్టల్ ఏజెంట్స్ కింద పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పోస్టల్ స్టాంపులు, స్టేషనరీ వస్తువులు విక్రయించేందుకు అవకాశం ఉంటుంది.

అర్హులు:

పోస్టాఫీస్ ఫ్రాంచైజీని ఓపెన్ చేయాలనుకునే వారు 18 ఏళ్ల వయసు నిండి ఉండాలి. అదేవిధంగా గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి పదో తరగతి పాసై ఉండాలి. ఈ ఫ్రాంచైజీని ఓపెన్ చేసేందుకు భారత పౌరులు ఎవరైనా అర్హులే. కానీ పోస్టల్ ఉద్యోగులకు చెందిన కుటుంబ సభ్యులు మాత్రం అనర్హులు.

ఆదాయం:

పోస్టల్ సర్వీసులపై మీరు కమీషన్ ద్వారా ఆదాయం పొందొచ్చు. రిజిస్టర్డ్ పోస్టు బుకింగ్ కోసం ఒక్కో ట్రాన్సాక్షన్‌ ద్వారా రూ.3 కమీషన్ తీసుకోవచ్చు. అలాగే స్పీడ్ పోస్ట్ బుకింగ్ పై రూ.5, రూ.100 నుంచి రూ. 200 మధ్య ఉండే మనీయార్డర్లకు రూ. 3.50 కమీషన్, రూ.200 ఆపైన ఉండే వాటికి రూ.5 కమీషన్ పొందొచ్చు. నెలవారీ టార్గెట్ కింద 1000 రిజిస్టర్డ్, స్పీడ్ పోస్ట్ బుకింగ్స్ చేసినట్లయితే అదనంగా 20 శాతం కమీషన్ లభిస్తుంది. పోస్టల్ స్టాంపులు, స్టేషనరీ విక్రయించడం ద్వారా 5 శాతం కమీషన్ పొందవచ్చు. పోస్టాఫీస్ ఫ్రాంచైజీ ద్వారా తక్కువలో తక్కువ నెలకు రూ. 80వేల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంది. మరి మీరు కూడా పోస్టాఫీస్ ఫ్రాంచైజీని ప్రారంభించాలనుకుంటే పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి. లేదా మీ దగ్గర్లోని పోస్టాఫీస్ ను సందర్శించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.