కూలర్ ధరకే AC.. పేదవారు కూడా దైర్యంగా కొనేసుకోవచ్చు!

బయట ఎండలు దంచికొడుతున్నాయి. చెప్పుల్లేకుండా ఒక్క అడుగు కూడా పెట్టలేని పరిస్థితి. ఈ ఉక్కపోతకు తోడు ఫ్యాన్ గాలికి శరీరం ఉడికిపోతుంది. ప్రాణం ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది.

బయట ఎండలు దంచికొడుతున్నాయి. చెప్పుల్లేకుండా ఒక్క అడుగు కూడా పెట్టలేని పరిస్థితి. ఈ ఉక్కపోతకు తోడు ఫ్యాన్ గాలికి శరీరం ఉడికిపోతుంది. ప్రాణం ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది.

ఎండలు మండిపోతున్నాయి. కాలు బయటపెట్టలేని పరిస్థితి. ఓ వైపు భానుడి భగ భగలతో పాటు ఉక్కపోత కూడా సామాన్యులకు చిరాకు తెప్పిస్తోంది. గతం కన్నా ఈ ఏడాది ఎక్కువగా ఎండలు ఉండవచ్చునని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ. ప్రస్తుతం వడ గాల్పులు లేవు.. కానీ ఏప్రిల్ మధ్యలో నుండి ఇవి మొదలయ్యే అవకాశాలున్నాయని చెబుతోంది. ఈ నేపథ్యంలో అవసరమైతే తప్ప అత్యవసరంగా బయటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇక ఇంట్లో లేదా షాపుల్లో ఫ్యాన్ కింద ఉంటే వేడి గాలి తగిలి పెనంపై కూర్చున్న పరిస్థితి నెలకొంది. పోనీ కూలర్, ఏసీ వైపు చూద్దామంటే.. సమ్మర్‌లో ఎండ వేడిమి కన్నా వీటి ధరే మండిపోతుంది.

వీటి ధరలకు రెక్కలు రావడంతో పేద, మధ్యతరగతి కుటుంబం కొనలేని పరిస్థితి. అలాంటి వారి కోసమే అందుబాటు ధరల్లో ఓ పోర్టబుల్ ఏసీ లభిస్తుంది. ఇది మీ ఇంటిని చాలా చల్లగా మార్చేస్తుంది. దీన్ని ఈజీగానే క్యారీ చేయొచ్చు. వీటి ధర నాలుగు వేల లోపే దొరుకుతుండటం హాట్ సమ్మర్‌లో కూల్ విషయం. సుమారు రూ.3,500 నుండి రూ. 4 వేల లోపు లభిస్తున్నాయి. ఇందులో మినీ వాటర్ ట్యాంకు ఉంటుంది. ఇందులో 500 మిలీల నీరు పోస్తే.. చల్లని గాలి వస్తుంది. ఇక ఏసీలా పనిచేయాలంటే.. ఐస్ క్యూబ్స్ వేసుకుంటే.. జిల్లుమనేలా ఎయిర్ వస్తుంది. ఇందులో మరో ఫీచర్ ఏంటంటే.. ఫ్యాన్స్ స్పీడ్ కంట్రోల్ చేసుకోవచ్చు. చలి ఎక్కువగా ఉన్నప్పుడు తగ్గించుకోవచ్చు. ఫ్యాన్ వేగాన్ని బట్టి ఇది 3 నుంచి 5 గంటల వరకు పనిచేస్తుంది.

 

ఈ పోర్టబుల్ మినీ ఏసీలో లైటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. రాత్రి పూట బెడ్ లైట్‌గా కూడా పనిచేస్తుంది. ఇందులో 7 రంగుల నైట్ లైట్లు కూడా ఇచ్చారు. ఇందులో శబ్దం కూడా తక్కువ. ప్రస్తుతం బయట మార్కెట్ ఇన్ని ఫీచర్లతో కూడిన మినీ ఏసీ కూడా ఐదు వేలకు పై చిలుకు పలుకుతోంది. కానీ ఈ ఏసీ రూ.3, 299 నుండి స్టార్ అవుతుంది. ప్రస్తుతం కూలర్లు ధరలు కూడా మండిపోతున్నాయి. ఈ కూలర్ ధరకే మినీ ఏసీ వచ్చేస్తోంది ఆన్ లైన్‌లో. ప్రముఖ ఈ కామర్స్ సంస్థల్లో ఈ రకమైన ఏసీలు అందుబాటులో ఉన్నాయి. మరీ ఇంకెందుకు ఆలస్యం.. కూలర్ ధరలోనే ఏసీ వచ్చేస్తుంటే. తెచ్చుకుని.. ఈ సమ్మర్ లో కూల్ వాతావరణాన్ని ఆస్వాదించండి. ఎండల వేడి నుండి తప్పించుకోండి.

Show comments