రైతులకు శుభవార్త.. జూన్‌ 18న వారి ఖాతాల్లో రూ.6 వేలు జమ

PM Kisan Yojana Scheme: రైతులకు భారీ శుభవార్త. వారి ఖాతాల్లో జూన్‌ 18న అనగా మంగళవారం నాడు డబ్బులు జమ కానున్నాయి. కొందరి ఖాతాలో 6 వేల రూపాయలు జమ కానున్నాయి. ఆ వివరాలు..

PM Kisan Yojana Scheme: రైతులకు భారీ శుభవార్త. వారి ఖాతాల్లో జూన్‌ 18న అనగా మంగళవారం నాడు డబ్బులు జమ కానున్నాయి. కొందరి ఖాతాలో 6 వేల రూపాయలు జమ కానున్నాయి. ఆ వివరాలు..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమం కోసం అనేక రకాల పథకాలు తీసుకువస్తున్నాయి. పెట్టుబడి సాయం, మద్దతు ధర కల్పించడం, వ్యవసాయ పనిముట్ల మీద రాయితీ కల్పించడం, ఇతర అవసరాల కోసం రుణాలు కల్పించడం వంటి చర్యలు చేపడుతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎకరానికి ఇంత అని పెట్టుబడి సాయం అందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్‌ యోజన కింద ఎకరానికి 6 వేల రూపాయల సాయం అందిస్తోన్న సంగతి తెలిసిందే. నాలుగు నెలలకు ఒకసారి.. ఏడాదికి 3 సార్ల చొప్పున 2 వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తారు. ఇప్పటికి 16 విడతలుగా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేశారు. ఇక 17వ విడత డబ్బులు రేపు అనగా జూన్‌ 18న మంగళవారం నాడు జమ కానున్నాయి. అయితే కొందరు రైతుల ఖాతాలో 6 వేల రూపాయలు జమ కానున్నాయి. ఆ వివరాలు.

మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ జూన్ 18న వారణాసిలో పర్యటించనున్నారు. ఇదే సందర్భంగా రూ.20 వేల కోట్లతో పీఎం-కిసాన్‌ పథకం 17వ విడత డబ్బులను విడుదల చేయనున్నారు. దీని ద్వారా దేశంలోని 9.26 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించగానే.. 17వ విడత పీఎం కిసాన్‌ నిధుల విడుదలపై తొలి సంతంకం చేశారు. జూన్‌ 18న బటన్‌ నొక్కి రైతుల ఖాతాలో 17వ విడత పీఎం కిసాన్‌ డబ్బులు జమ చేయనున్నారు. 2019లో పీఎం కిసాన్ యోజన అమల్లోకి వచ్చిందని, 3 దశల్లో రైతుల ఖాతాలో రూ.6వేలు జమ చేశామని, ఇప్పటి వరకు 11 కోట్ల మంది రైతులకు రూ.3.40 లక్షల కోట్లు పంపిణీ చేశామన్నారు.

ఇదిలా ఉండగా.. జూన్ 18వ తేదీన కొంత మంది రైతుల ఖాతాల్లో రూ.6 వేలు జమ కానున్నాయి. ఎందుకంటే గతంలో కేవైసీ పూర్తి చేసుకోని రైతులు, ఇతర టెక్నికల్ సమస్యల కారణంగా గత రెండు దఫాలుగా డబ్బులు తీసుకోని రైతుల ఖాతాల్లో ఈ సారి ఏకంగా రూ.6 వేలు జమ కానున్నాయి. అయితే ఇప్పటికే కేవైసీ అప్ డేట్ చేసుకొని ప్రతీ నాలుగు నెలలకు పీఎం కిసాన్ డబ్బులు తీసుకుంటున్న వారి ఖాతాలో మాత్రమే కేవలం రూ.2 వేలు జమ కానుండగా.. కేవైసీ అప్ డేట్ చేయని వారి ఖాతాలో ఎలాంటి డబ్బులు జమ కావు. కనుక వారు త్వరగా కేవైసీ చేసుకోవాల్సిందిగా అధికారులు చెబుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం వ్యవసాయం, పాడిపరిశ్రమను బలోపేతం చేసేందుకు కృషి సఖీ పథకాన్ని అమలు చేసింది. దీని కింద 30 వేల మంది సెల్ఫ్ హెల్ప్ సొసైటీ సభ్యులకు శిక్షణ ఇచ్చామని, వారికి ప్రధాని నరేంద్ర మోదీ సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు.

Show comments