వారందరికీ శుభవార్త.. 5 రోజుల్లో ఖాతాల్లో డబ్బులు జమ

PM Kisan: ఎన్నికల నేపథ్యంలో చాలా నగదు బదిలీ పథకాలు ఆగిపోయాయి. ఈ క్రమంలో ఓ పథకానికి సంబంధించి కీలక అప్డేట్‌ వచ్చింది. మరో ఐదు రోజుల్లో బ్యాంక్‌ ఖాతాలో నగదు జయ చేయనున్నారు. ఆ వివరాలు..

PM Kisan: ఎన్నికల నేపథ్యంలో చాలా నగదు బదిలీ పథకాలు ఆగిపోయాయి. ఈ క్రమంలో ఓ పథకానికి సంబంధించి కీలక అప్డేట్‌ వచ్చింది. మరో ఐదు రోజుల్లో బ్యాంక్‌ ఖాతాలో నగదు జయ చేయనున్నారు. ఆ వివరాలు..

గత కొన్నాళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగదు బదిలీ పథకాలను అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆయా పథకాల కింద నగదును నేరుగా అర్హులైన లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తున్నారు. ఎక్కడా అవినీతికి తావులేకుండా.. నగదు బదిలీ పథకాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఆసక్తికర వార్త వైరల్‌ అవుతుంది. మరో ఐదు రోజుల్లో వారందరి ఖాతాలో డబ్బులు జమ కానున్నట్లు తెలుస్తుంది. ఇంతకు ఇది ఏ పథకానికి సంబంధించిన డబ్బులు.. ఎవరు జమ చేస్తున్నారు.. ఎవరి ఖాతాలో ఈ నగదు పడుతుంది వంటి వివరాలు మీ కోసం..

ప్రసుత్తం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్‌ కోడ్‌ అమల్లోకి వచ్చింది. అందుకే పలు పథకాల నిర్వహణకు అంతరాయం ఏర్పడింది. జూన్‌ 4న కౌంటింగ్‌ ముగియనుంది. ఆ తర్వాత నుంచి ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండదు. అంటే ఆగిపోయిన పథకాలకు సంబంధించిన నిధులు.. జూన్‌ 4 తర్వాత విడుదల కానున్నాయి. అంటే పెండింగ్‌ పథకాల నిధులు జూన్‌ 5న విడుదల కానున్నాయి. ఈ క్రమంలో అన్నదాతలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కిసాన్‌ సమ్మాన్‌ 17వ విడత నిధుల విడుదలకు సంబంధించి కీలక అప్డేట్‌ తెలిసింది.

మరో ఐదు రోజుల్లో అనగా జూన్‌ 5న కిసాన్‌ సమ్మాన్‌ 17వ విడత నిధులు విడుదల కానున్నట్లు సమాచారం. జూన్‌ 4న కౌంటింగ్‌ పూర్తయ్యి.. ఫలితాలు విడుదల అవుతాయి. దాంతో ఎన్నికల కోడ్‌ కూడా ముగిసిపోతుంది. అందుకే ఆ తర్వాత అనగా జూన్‌ 5న రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయని సమాచారం. అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు. రైతులకు పంట సాయం కింద, వారిని ప్రోత్సహించడంలో భాగంగా ప్రతి సంవత్సరం రూ. 6 వేలు అర్హులైన రైతులకు అందిస్తుంది కేంద్రం. 3 విడతల్లో.. ప్రతి 4 నెలలకు ఓసారి నేరుగా రైతుల అకౌంట్లలోనే వేస్తుంటుంది. ఇప్పటివరకు 16 విడతల్లో ఒక్కో రైతుకు రూ. 32 వేల చొప్పున అందాయని చెప్పొచ్చు. 16 వ విడత డబ్బులు 2024, ఫిబ్రవరి 28న విడుదల చేశారు. ఇక త్వరలోనే 17వ విడత డబ్బులు రిలీజ్‌ చేస్తారు.

పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. ఈ స్కీం కింద నమోదు చేసుకున్న రైతులు కచ్చితంగా ఇ-కేవైసీ చేయించుకోవాలి. కేవైసీ చేయించుకోని కారణంగా రైతులు.. ఈ పథకం ప్రయోజనాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇ-కేవైసీ చేయించుకునేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. పీఎం కిసాన్ అధికారిక పోర్టల్‌లో ఓటీపీ బేస్డ్ ఇ-కేవైసీ ఉండగా.. దగ్గర్లోని కామన్ సర్వీస్ సెంటర్లలో బయోమెట్రిక్ ఇకేవైసీ చేయించుకోవచ్చు. పీఎం కిసాన్ యాప్‌లో కూడా ఫేస్ అథెంటికేషన్‌తో కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.

Show comments