Mini Electric Car Under 1 Lakh: కారుకే మాత్రం తీసిపోని స్కూటీ.. కాలు కింద పెట్టే పని లేదు.. ధర 88 వేలే!

కారుకే మాత్రం తీసిపోని స్కూటీ.. కాలు కింద పెట్టే పని లేదు.. ధర 88 వేలే!

PEV Phantom Electric Four Wheeler, Three Wheeler, Two Wheeler Vehicles Price In Hyderabad: కారు కొనలేదని బాధపడుతున్నారా? అయితే లక్ష రూపాయల లోపే ఈ బడ్జెట్ కారుని సొంతం చేసుకోండి. కారు పైన రూఫ్ ఒకటే ఉండదన్న పేరుకే గానీ ఇది కారుకేం తీసిపోదు. విశాలమైన సీటు, మూడు చక్రాలు లేదా నాలుగు చక్రాలను కలిగి ఉంటుంది. కూర్చోవడానికి సౌకర్యంగా ఉంటుంది. సామాన్యులకి ఇది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది.

PEV Phantom Electric Four Wheeler, Three Wheeler, Two Wheeler Vehicles Price In Hyderabad: కారు కొనలేదని బాధపడుతున్నారా? అయితే లక్ష రూపాయల లోపే ఈ బడ్జెట్ కారుని సొంతం చేసుకోండి. కారు పైన రూఫ్ ఒకటే ఉండదన్న పేరుకే గానీ ఇది కారుకేం తీసిపోదు. విశాలమైన సీటు, మూడు చక్రాలు లేదా నాలుగు చక్రాలను కలిగి ఉంటుంది. కూర్చోవడానికి సౌకర్యంగా ఉంటుంది. సామాన్యులకి ఇది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది.

బైక్ లేదా స్కూటీ టూవీలర్ ఏదైనా గానీ ట్రాఫిక్ లో నడపాలంటే మహా కష్టం. అస్తమానూ కాలు కింద పెట్టాల్సి ఉంటుంది. కొంతమందికి ఇది విసుగు కలిగిస్తుంది. ఇక వర్షాలు పడితే అంతే సంగతులు. ఆ బురదలో కాలు పెడితే షూస్, ప్యాంటు నాశనమైపోతాయి. బండి నడపాలన్న మూడు, ఉత్సాహం సర్వనాశనమైపోతాయి. వర్షంతో, ట్రాఫిక్ తో.. మధ్యతరగతి వాళ్ళు నిత్యం పోరాటం చేస్తుంటారు. అలాంటి వారి కోసమే అన్నట్టు ఇప్పుడు మంచి మంచి ఆవిష్కరణలు వస్తున్నాయి. కారు కొనలేకపోతున్నామని బాధపడేవారి కోసమే ఈ కారు లాంటి ఎలక్ట్రిక్ స్కూటర్. కాలు కింద పెట్టే పని లేదు. ఎంత దూరమైనా దర్జాగా, సౌకర్యంగా వెళ్ళచ్చు. పీఈవీ ఎలక్ట్రిక్ కంపెనీ 2 వీలర్ స్కూటీలతో పాటు త్రీ వీలర్, ఫోర్ వీలర్ ఎలక్ట్రిక్ కార్లను కూడా తయారు చేస్తుంది. 

త్రీ వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ సీటు, డబుల్ సీటుతో వస్తుంది. వెనకాల ఒక వ్యక్తి కూర్చోవచ్చు. పిల్లలు ఉంటే పెద్దవాళ్ళతో పాటు ఒక పాప, బాబు కూర్చోవచ్చు. సీటు పెద్దగా ఉండడం వల్ల సౌకర్యంగా ఉంటుంది. సీటుని ముందుకి, వెనక్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. వెనక ఒక స్టోరేజ్ బాక్స్ కూడా ఇచ్చారు. హెల్మెట్, ఛార్జర్ వంటివి పెట్టుకోవచ్చు. ఇందులో ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే.. ఇది ఎత్తైన ప్రదేశాల్లో రివర్స్ మోడ్ లో కూడా ఈజీగా ప్రయాణిస్తుంది. త్రీ వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్ 1000 వాట్ మోటార్ పవర్ తో వస్తుంది. సింగిల్ ఛార్జ్ తో 50 నుంచి 60 కి.మీ. ప్రయాణం చేయవచ్చు. 32 ఏహెచ్, 60 వోల్ట్స్ బ్యాటరీతో వస్తుంది. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 7 నుంచి 8 గంటలు పడుతుంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసి గంటకు 30 కి.మీ.గా ఉంది. ఇది వయసులో పెద్ద వారికి బాగా సూట్ అవుతుంది. సింగిల్ సీటుది కావాలంటే సింగిల్ సీటు కొనుక్కోవచ్చు, డబుల్ సీటుది కావాలంటే డబుల్ సీటుది కొనుక్కోవచ్చు.

ఇక ఫోర్ వీలర్ ఎలక్ట్రిక్ కారు విషయానికొస్తే సింగిల్ సీటుతో వస్తుంది. నాలుగు చక్రాలతో వస్తుంది. సీటు కింద డిక్కీ ఇచ్చారు. వెనక ఒక చిన్న బాస్కెట్ ఇచ్చారు. వయసులో పెద్ద వారికి ఇది యూజ్ అవుతుంది. ముఖ్యంగా లేడీస్ కి బాగా ఉపయోగపడుతుంది. షాపింగ్ కి, ఆఫీసులకు వెళ్ళవచ్చు. డ్రైవింగ్ కూడా ఈజీగా ఉంటుంది. కాలు కింద పెట్టే పని ఉండదు కాబట్టి కొత్తగా నేర్చుకునేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే మూడు చక్రాల ఎలక్ట్రిక్ స్కూటర్ ని కొనుగోలు చేసిన వ్యక్తి చెప్తున్న దాని ప్రకారం అతను 88 వేలకు కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఈ కంపెనీ వాళ్ళు దేశవ్యాప్తంగా ఈ వాహనాలను డెలివర్ చేస్తున్నారని.. రవాణా ఛార్జీలు లేకుండా వాళ్ళే సొంత ఖర్చులతో డెలివర్ చేస్తున్నారని ఈ వెహికల్ ని కొన్న వ్యక్తి వెల్లడించారు. ఈ కంపెనీ ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ సిటీలో ఉంది. మరి మీకు ఈ వాహనం కొనాలనుకుంటే కనుక పీఈవీ ఎలక్ట్రిక్ కంపెనీ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.  


Show comments