iDreamPost
android-app
ios-app

సక్సెస్ అంటే ఇదే.. మూడు నెలల్లోనే రూ. 9800 కోట్ల సంపాదన.. 27ఏళ్లకే బిలియనీర్!

Youngest Billionaire Pearl Kapur: ఓ యువకుడు చిన్నతనంలోనే ఓ స్టార్టప్ కంపెనీని స్థాపించాడు. కేవలం 90 రోజుల్లోనే 9 వేల కోట్లకు చేరి యువ బిలియనీర్ గా సరికొత్త రికార్డు సృష్టించారు.

Youngest Billionaire Pearl Kapur: ఓ యువకుడు చిన్నతనంలోనే ఓ స్టార్టప్ కంపెనీని స్థాపించాడు. కేవలం 90 రోజుల్లోనే 9 వేల కోట్లకు చేరి యువ బిలియనీర్ గా సరికొత్త రికార్డు సృష్టించారు.

సక్సెస్ అంటే ఇదే.. మూడు నెలల్లోనే రూ. 9800 కోట్ల సంపాదన.. 27ఏళ్లకే బిలియనీర్!

సక్సెస్ ఊరికే రాదు. దాని వెనక నిరంతర కృషి.. పట్టుదల ఉంటేనే అది సాధ్యం అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తులందరు చేసేపనిపట్ల అంకితాభావం చూపి పైకొచ్చిన వారే. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుందన్న వ్యాఖ్యలను నేటి తరం యువత నిజం చేస్తున్నది. చిన్నతనంలోనే పలు రంగాల్లో రాణిస్తూ తమకు తామే సాటిగా నిలుస్తున్నారు. ఇదే విధంగా ఓ యువకుడు అతి చిన్న వయసులోనే ఎవరూ ఊహించనంత ఎత్తుకు ఎదిగారు. ఏకంగా 27ఏళ్లకే బిలియనీర్ అయ్యారు. దీంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. అతను స్థాపించిన స్టార్టప్ కంపెనీ కేవలం 90 రోజుల్లోనే రూ. 9800 కోట్లకు చేరుకుంది. ఆ యువ బిలియనీర్ మరెవరో కాదు భారత్ కు చెందిన పెరల్ కపూర్.

పెరల్ కపూర్ 27 ఏళ్ల వయసులోనే బిలియనీర్ గా మారి రికార్డు సృష్టించారు. ఆసియాలో కుబేరులుగా పేరుగాంచిన ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీల దారిలో పయనిస్తూ కోటీశ్వరుడయ్యారు. ఈ యువ బిలియనీర్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరు ఇది కదా సక్సెస్ అంటే అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. గుజరాత్‌కు చెందిన పెరల్ కపూర్ జైబర్ 365 అనే స్టార్టప్ కంపెనీని 2023లో ప్రారంభించారు. ఇది వెబ్ , ఏఐ-ఆధారిత స్టార్టప్ కంపెనీ. కంపెనీ ఆవిర్భవించిన మూడు నెలల్లోనే రూ. 9,840 కోట్ల స్థాయికి చేరి ఇండియా యునికార్న్ ర్యాంకింగ్‌లో 109వ స్థానాన్ని ఆక్రమించింది. బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన కంపెనీని యునికార్న్ గా పిలుస్తారు.

ఈ కంపెనీలో పెరల్ కపూర్‌ వాటా 90 శాతం ఉంది. అంటే కపూర్ వద్ద తొమ్మిది వేల కోట్లకు పైగా ఉన్నట్లే అని స్పష్టమవుతోంది. ఈ స్టార్టప్ కంపెనీ పెట్టుబడుల్లో భాగంగా 100 మిలియన్‌ డాలర్లను రాబట్టింది. ఇందులో స్రామ్ & మ్రామ్ గ్రూప్ 8.3 శాతం పెట్టుబడి పెట్టింది. లండన్‌లో ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఈ కంపెనీ భారతదేశం, ఆసియాలో అత్యంత వేగవంతమైన యునికార్న్‌గా ప్రశంసలందుకుంటోంది. స్టార్టప్ కంపెనీ విజయానికి పాటుపడిన కపూర్ క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్ నుంచి ఎంఎస్సీ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ లో గ్రాడ్యుయేట్ అయ్యారు.

వెబ్3 టెక్నాలజీ రంగంలో గొప్ప ఆవిష్కర్తగా గుర్తింపు పొందారు. ఆయన జైబర్ 365కి ముందు, కపూర్ ఏఎంపీఎం స్టోర్‌లో ఆర్థిక సలహాదారుగా, యాంటీయర్ సొల్యూషన్స్ బిజినెస్‌ సలహాదారుగానూ పనిచేశారు. కృషితో నాస్తి దుర్భిక్షమ్ అనే సత్యాన్ని నిజం చేస్తూ యువ బిలియనీర్ గా ఎదిగిన పెరల్ కపూర్ నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి 27ఏళ్లకే బిలియనీర్ గా ఎదిగిన పెరల్ కపూర్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Pearl Kapur (@pearlkapur5)