Pan Update Scam: పాన్ అప్డేట్ పేరుతో మెసేజ్.. చూశారంటే మీ డబ్బులు మాయం!

Pan Update Scam: పాన్ అప్డేట్ పేరుతో కొత్త మెసేజి ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. నెట్టింట బాగా సర్క్యులేట్ అవుతోంది. ఈ మెసేజ్ ని క్లిక్ చేస్తే అందులో కొన్ని వివరాలు అడుగుతుంది.

Pan Update Scam: పాన్ అప్డేట్ పేరుతో కొత్త మెసేజి ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. నెట్టింట బాగా సర్క్యులేట్ అవుతోంది. ఈ మెసేజ్ ని క్లిక్ చేస్తే అందులో కొన్ని వివరాలు అడుగుతుంది.

ఇండియా పోస్ట్ పాన్ అప్డేట్ పేరుతో ఒక కొత్త మెసేజి ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఎక్కడ చూసినా బాగా సర్క్యులేట్ అవుతోంది. ఇంతకీ ఈ మెసేజ్ ఏంటంటే.. దీన్ని క్లిక్ చేస్తే అందులో కొన్ని వివరాలు అడుగుతుంది. ఆ మెసేజిలో అడిగిన వివరాలు వెంటనే ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలని ఉంటుంది. ఒకవేళ అడిగిన వివరాలు కనుక సబ్మిట్ చేయకపోతే, మీ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అవుతుందని ఇందులో ఉంటుంది. దాంతో చాలా మంది కూడా ఆ మెసేజిలో అడిగిన వివరాలని సబ్మిట్ చేస్తారు. అయితే భయపడి పొరపాటున మీ వివరాలు ఇచ్చారంటే అంతే సంగతులు.. మీ బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ అయిపోతాయి. ఎందుకంటే ఇది పక్కా స్కామ్. ఈ మెసేజ్ పూర్తిగా మోసపూరితమైనదని PIB ఫాక్ట్ చెక్ తెలిపింది.

ఈ పాన్ అప్డేట్ స్కాం పూర్తి వివరాల్లోకి వెళితే.. మీ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ లో మీ పాన్ కార్డుని అప్డేట్ చేయకపోతే 24 గంటల్లో మీ అకౌంట్ బ్లాక్ అవుతుందని ఆ మెసేజీలో ఉంటుంది. ఈ మెసేజిని చదివి చాలా మంది మొబైల్ యూజర్లు మోసపోతున్నారని PIB ఫ్యాక్ట్ చెక్ కి తెలిసింది. అలాగే ఇంకా చాలా మంది ఈ మెసేజ్ ను అందుకుంటున్నట్లు కూడా PIB ఫ్యాక్ట్ చెక్ గుర్తించింది. ఇలాంటి మెసేజ్ లను నిజమని నమ్మి ఏమాత్రం మోసపోకండని తన X అకౌంట్ నుంచి క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి మెసేజులు లేదా కాల్స్ వంటివి అసలు రావని తెలిపింది. వాటిని ఇండియా పోస్ట్ ఇప్పటి దాకా పంపించలేదని తెలిపింది. కాబట్టి ఇలాంటి వాటికి భయపడ వద్దని కూడా తెలిపింది.
https://x.com/PIBFactCheck/status/1825494609881170290

ఎప్పుడైనా కానీ ఇలాంటి ఫ్రాడ్ పోస్ట్ లు లేదా మెసేజ్ లు మీ మొబైల్ కు వచ్చినప్పుడు అస్సలు స్పందించకూడదు. వీటికి వెంటనే స్పందించకుండా ముందుగా అవి నిజమో కాదో తెలుసుకోవాలి. వాటిని క్షుణ్ణంగా పరిశీలించడం చెయ్యాలి. కొందరు ఏమవ్వదులే అనుకోని ఇలాంటి మెసేజ్ లలో వచ్చే లింక్స్ పైన క్లిక్ చేస్తూ ఉంటారు. అలా కూడా అస్సలు చేయకూడదు. చేశారంటే స్కామర్లు మీ డబ్బుని దోచుకుంటారు. అలా చేయకుండా వాటి అధికారిక వెబ్ సైట్లని ఓపెన్ చేయాలి. ఉదాహరణకు పాన్ కార్డ్ కి సంబంధించిన మెసేజ్ వస్తే.. పాన్ కి సంబంధించి అఫీషియల్ వెబ్ సైట్ ఓపెన్ చెయ్యాలి. అందులో పూర్తి వివరాలని తెలుసుకోవాలి. ఒకవేళ నిజం అయితే అందులో పేర్కొనబడి ఉంటుంది. అబద్దం అయితే ఏ సమాచారం ఉండదు. ఈ మధ్య కాలంలో ఇలాంటి మోసాలు బాగా పెరిగిపోతున్నాయి. ఒకవేళ మీరు మోసపోతే కచ్చితంగా పోలీసులకు ఫిర్యాదు చేయండి.

Show comments