Anant Ambani: వివాహ వేళ రాధికకు అనంత్‌ స్పెషల్‌ ప్రామిస్‌.. ఏం చెప్పాడంటే..!

Anant Ambani-Radhika Merchant Wedding, Special Promise: వివాహం సందర్భంగా అనంత్‌ అంబానీ.. భార్య రాధికా మర్చంట్‌కు ప్రత్యేక ప్రామిస్‌ చేశాడు. దేని గురించి అంటే..

Anant Ambani-Radhika Merchant Wedding, Special Promise: వివాహం సందర్భంగా అనంత్‌ అంబానీ.. భార్య రాధికా మర్చంట్‌కు ప్రత్యేక ప్రామిస్‌ చేశాడు. దేని గురించి అంటే..

ఆసియా కుబేరుడు ముఖేష్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ముంబైలోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో భూమ్యాకాశాలను ఏకం చేస్తూ.. ఎంతో ఘనంగా జరిగిన ఈ వేడుకకు భారతీయ తారా లోకం తరలి వచ్చింది. సౌత్‌, నార్త్‌ తేడా లేకుండా.. ప్రముఖ సినీ సెలబ్రిటీలంతా ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. చిత్ర పరిశ్రమకు చెందిన వారు మాత్రమే కాక.. క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన వారు కూడా ఈ పెళ్లికి ముఖ్య అతిథిలుగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక పెళ్లి వేళ అంబానీ కుటుంబం ధరించిన వస్త్రాలు, ఆభరణాలు, పెళ్లి మండపం డిజైన్‌ వంటి వివరాలన్ని నెట్టింట ఆసక్తికరంగా మారాయి. ఇక అత్యంత ఖరీదైన డిజైనర్‌ పెళ్లి దుస్తులు, ఆభరణాలు ధరించిన రాధికా మర్చంట్‌ యువరాణిలా మెరిసిపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఎంతో వైభవంగా ముంబైలోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో.. ముత్యాల పందిరిలో వేదమంత్రాల సాక్షిగా అనంత్-రాధికల పరిణయం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లిలో నూతన వధూవరులు ఒకరికొకరు ప్రత్యేక వాగ్దానం చేశారు. పెళ్లి జరిగిన తర్వాత అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్‌లు మండపం వద్ద నిలబడి ప్రత్యేకంగా వ్రాసిన ప్రతిజ్ఞలను మార్పిడి చేసుకున్నారు. రాధిక వారు అడుగుపెట్టబోయే ఇల్లు సురక్షితమైన స్థలంగా ఉంటుందని, ప్రేమ సఖ్యతతో నిండి ఉంటుందని వాగ్దానం చేయగా.. అనంత్.. తన భార్యతో కలిసి.. ఆయన  కలల ఇంటిని నిర్మిస్తానని హామీ ఇచ్చాడు.

‘‘మన ఇల్లు ఒక స్థలం మాత్రమే కాదు.. అది మన ప్రేమ, ఐక్యతలకు నిలయంగా ఉంటుంది. మనం కలిసే ఉంటాము’’ అంటూ రాధిక భావోద్వేగంగా ప్రకటించగా.. అందుకు అనంత్‌ అంబానీ బదులిస్తూ.. ‘‘రాధికా.. ఆ శ్రీకృష్ణుడి ఆశీర్వాదం మన మీద ఎల్లప్పుడు ఉంటుంది. మనం నివసించబోయే ఇల్లు కేవలం స్థలం మాత్రమే కాదు.. మనం ఎక్కడ ఉన్నా అది ప్రేమ, ఆప్యాయతల కలయిగా ఉంటుంది. నీతో కలిసి కలల ఇంటిని నిర్మిస్తాను’’ అంటూ రాధికకు మాటిచ్చాడు అనంత్‌ అంబానీ. కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోయే ముందు.. ఈ దంపతులు ఒకరికొకరు ప్రత్యేక ప్రమాణాలు చేసుకుని.. కొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు. ఇక కుమారుడి పెళ్లి సందర్భంగా ముఖేష్‌ అంబానీ తీవ్ర భావోద్వాగానికి గురయ్యాడు.

Show comments