Ola: అక్కడ Ola రైడ్స్ సేవలు బంద్! మొత్తం సర్దుకుని క్లోజ్ చేస్తున్నారు!

ఇండియాలో టెక్నాలిజీ రోజు రోజుకు పెరుగుతూ ఉన్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ విషయంలో కూడా ఇండియా డెవలప్ అవుతూనే ఉంది. అయితే ప్రముఖ బ్రాండ్ ఓలా చాలా దేశాలలో తమ సర్వీస్ లను నిలిపివేయనుందట. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇండియాలో టెక్నాలిజీ రోజు రోజుకు పెరుగుతూ ఉన్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ విషయంలో కూడా ఇండియా డెవలప్ అవుతూనే ఉంది. అయితే ప్రముఖ బ్రాండ్ ఓలా చాలా దేశాలలో తమ సర్వీస్ లను నిలిపివేయనుందట. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

భారతదేశం టెక్నాలజీ పరంగా రోజు రోజుకి అభివృద్ధి చెందుతూనే ఉంది. పెద్ద పెద్ద పట్టణాలలో, మహా నగరాలలో ట్రాన్స్పోర్ట్ విషయంలో.. బాగా అభివృద్ధి చెందింది. ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్లాలంటే ఇప్పుడు అందరికి గుర్తొచ్చే సర్వీసెస్, ఓలా, ఉబర్, రాపిడో ఇలాంటి ఎన్నో సర్వీసులు .. అందరికి అందుబాటులోకి వచ్చేశాయి. చాలా మంది ప్రజలు ప్రైవేట్ వాహనాలను, ప్రజా రవాణాను విడిచిపెట్టి .. వీటిని ఎక్కువగా ఎంచుకుంటున్నారు. అయితే వీటిలో ప్రముఖ రైడ్ సర్వీస్ ప్రొవైడర్ ఓలా సంస్థ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఓలా సంస్థ మొత్తం మూడు దేశాలలో తమ కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఆ నిర్ణయానికి గల ప్రధాన కారణం.. ఆ సంస్థ అభివృద్ధిని ఇండియాలో విస్తరింపచేయడమేనని.. ఇండియాలో తమ వ్యాపారంపై దృష్టి పెట్టేందుకే ఓల సంస్థ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు సమాచారం. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తీసుకునే ప్రయత్నం చేద్దాం.

కొద్దీ రోజులలోనే ప్రముఖ బ్రాండ్ గా నిలిచిన రైడ్ సర్వీస్ ప్రొవైడర్ ఓలా సంస్థ.. ఆస్ట్రేలియా, యూకే, న్యూజిల్యాండ్ లో వారి కార్యకలాపాలను మూసివేయనున్నట్లు ప్రకటించింది. అందుకు గల ప్రధాన కారణం కేవలం ఇండియా లో ఉన్న తమ వ్యాపారాలపై దృష్టి పెట్టడమే అని పేర్కొంది. ఓలా క్యాబ్స్ బిజినెస్ ను ANI టెక్నాలజీస్ సంస్థ రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సంస్థ.. ఓవర్శిస్ లో తమ కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు ఈ విధంగా ప్రకటించింది. పైగా ఈ నిర్ణయం ఉన్నట్లుండి తీసుకున్నదైతే కాదట. 2018 నుంచి కూడా దశల వారీగా ఓలా సంస్థ ఓవర్శిస్ లో తమ కార్యకలాపాలను నిలిపివేయడం ప్రారంభించింది. ఇండియాలో సాఫ్ట్ బ్యాంక్ సపోర్ట్ ఉన్న కొన్ని కంపెనీలు .. ఓలా సర్వీసెస్ ను విస్తరించేందుకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నట్లు సమాచారం. పైగా ఇండియాలో కూడా రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న టెక్నాలిజీని, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు వస్తాయన్న ఆలోచనతోనే ఓలా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ సంధర్భంలో.. ఓలా అధినేత మాట్లాడుతూ.. మేము మా సంస్థను ఇండియాలో విస్తరించడానికి చాలా ఉత్సాహంగా ఉన్నామంటూ.. 1 బిలియన్ భారతీయులకు సేవ చేయడమే మా మిషన్ లక్ష్యం అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఓలా సంస్థ ఆర్థిక లావాదేవీల విషయానికొస్తే.. 2023 లో.. రూ.772.25 కోట్ల వరకు నష్టం తగ్గినట్లు నివేదించింది. దీనిని బట్టి చూస్తే ప్రస్తుతం ఈ సంస్థ ఇండియాలో లాభాల బాటలోనే కొనసాగుతోంది. ఇక ఇప్పుడు మిగిలిన దేశాల్లో ఉన్న కార్యకలాపాలను పూర్తిగా మూసివేసి.. కేవలం ఇండియాపైనే ఫోకస్ చేయనున్నారు కాబట్టి.. రానున్న రోజుల్లో వీరి వ్యాపార సంస్థ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments