Is Ola Stopped Those Vehicle Manufacturing: ఓలా కంపెనీ ఈ ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ఆపేస్తుందా? కారణం?

ఓలా కంపెనీ ఈ ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ఆపేస్తుందా? కారణం?

Some Reports Says Ola Electric Company Holds Ev Car Making: ఓలా స్కూటర్స్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లో 48 శాతం వాటా కలిగి ఉంది. అయితే ఈ కంపెనీ ఆ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Some Reports Says Ola Electric Company Holds Ev Car Making: ఓలా స్కూటర్స్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లో 48 శాతం వాటా కలిగి ఉంది. అయితే ఈ కంపెనీ ఆ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఏ రంగంలో అయినా మార్కెట్లో పోటీని తట్టుకుని నిలబడడం చాలా కష్టం. చాలా కంపెనీలు పోటీని తట్టుకోలేక కార్యకలాపాలను నిలిపివేశాయి. ఫియట్, షవర్లే, డాట్సన్, ఫోర్డ్ వంటి పలు ఆటోమొబైల్ కంపెనీలు అయితే వాహనాల తయారీలను పూర్తిగా నిలిపివేశాయి. కొన్ని కంపెనీలు అయితే పలు మోడల్స్ ని నిలిపివేశాయి. టాటా మోటార్స్ నానో కారుని నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఫోర్ వీలర్ కంపెనీలే కాదు.. టూవీలర్ వాహనాలను తయారీ కంపెనీలు కూడా కొన్ని బైక్స్ ని, స్కూటర్స్ ని నిలిపివేశాయి. మార్కెట్లో క్లిక్ అవ్వకపోవడం వల్ల తయారీని నిలిపివేశాయి. ప్రస్తుతం ఓలా కంపెనీ కూడా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.  

ప్రపంచవ్యాప్తంగా ఒక భారతీయ కంపెనీకి చెందిన ఓలా స్కూటర్లు ఎంత ఆదరణ దక్కించుకున్నాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మన దేశంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే ఇంత క్రేజ్ ఉన్నప్పుడు ఏ కంపెనీ అయినా తమ కంపెనీ కార్యకలాపాలను మరింత విస్తరించాలని అనుకుంటారు. అయితే ఇందుకు విరుద్ధంగా ఓలా కంపెనీ ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహనాలతో మార్కెట్లో స్ట్రాంగ్ గా నిలబడిన ఓలా కంపెనీ.. ఫోర్ వీలర్ ఎలక్ట్రిక్ కార్ల తయారీలో కూడా పాగా వేయాలని వార్తలు వస్తున్నాయి. ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో నంబర్ వన్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.  అయితే ఓలా కార్లను లాంఛ్ చేయకముందే తయారీ ప్రక్రియను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ వ్యాపారంపై పూర్తి ఫోకస్ పెట్టాలన్న ఉద్దేశంతో.. కార్ల తయారీ ప్రక్రియను వాయిదా వేసినట్లు రాయిటర్స్ కంపెనీ తెలిపింది.

2024 ఏడాది చివరి నాటికి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారుని విడుదల చేయాలని ఓలా కంపెనీ భావించింది. అయితే గత ఏడాది సెప్టెంబర్ లోనే ఈ ప్లాన్ ను ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ ఉపసంహరించుకున్నారని రాయిటర్స్ తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో ఓలా మార్కెట్ వాటా 48 శాతంగా ఉంది. కానీ కంపెనీ నిర్వహణ విషయానికొస్తే కంపెనీ నష్టాల్లో ఉందని చెబుతున్నారు. 2022 ఆర్థిక ఏడాదిలో ఓలా కంపెనీ నికర నష్టం 784.1 కోట్లు ఉండగా.. 2023 ఆర్థిక ఏడాదిలో నికర నష్టం 1472 కోట్లుగా ఉంది. ఈ క్రమంలో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ప్రస్తుతానికి టూవీలర్ ఈవీలపైనే దృష్టి పెట్టినట్లు సమాచారం. ఎలక్ట్రిక్ స్కూటర్లు, బ్యాటరీ సెల్స్, ఎలక్ట్రిక్ బైక్ పై ఫోకస్ చేయనుందని.. అందుకే రెండేళ్ల పాటు ఎలక్ట్రిక్ కార్ల ప్రాజెక్ట్ ని హోల్డ్ చేసినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఇదే నిజమైతే ఓలా ఎలక్ట్రిక్ కారు కోసం ఎదురుచూస్తున్న వారికి నిరాశ తప్పదు.             

Show comments