1 Minute Saree Wear: చీర కట్టుకోవడం రాదా? దీన్ని మీరు టీషర్ట్ వేసుకున్నంత ఈజీగా వేసుకోవచ్చు!

చీర కట్టుకోవడం రాదా? దీన్ని మీరు టీషర్ట్ వేసుకున్నంత ఈజీగా వేసుకోవచ్చు!

1 Minute Saree Wear: అబ్బాయిలు బయటకు వెళ్లాలంటే హ్యాంగర్ కున్న షర్ట్ వేసుకుని వస్తే సరిపోతుంది. మరి అమ్మాయిలు బయటకు వెళ్లాలంటే చీర కట్టు ఆలస్యం అవుతుంది. ఐతే మీరు ఒక్క నిమిషంలో చీర కట్టుకోవచ్చు. దీని గురించి ప్రత్యేకంగా స్కిల్స్ అవసరం లేదు. 

1 Minute Saree Wear: అబ్బాయిలు బయటకు వెళ్లాలంటే హ్యాంగర్ కున్న షర్ట్ వేసుకుని వస్తే సరిపోతుంది. మరి అమ్మాయిలు బయటకు వెళ్లాలంటే చీర కట్టు ఆలస్యం అవుతుంది. ఐతే మీరు ఒక్క నిమిషంలో చీర కట్టుకోవచ్చు. దీని గురించి ప్రత్యేకంగా స్కిల్స్ అవసరం లేదు. 

అమ్మాయిలకు చీరే అందం. ఆ చీర కట్టులో అచ్చం మహాలక్ష్మిలా ఉంటారు. అయితే నేటి తరం అమ్మాయిలకు చీర కట్టుకోవడం రాదు. చీర కట్టు గురించి తెలియదు. ఆ కుచ్చిళ్ళు మడత పెట్టడం రాదు. ఒకవేళ యూట్యూబ్ లో వీడియోస్ చూసి నేర్చుకున్నా చీర కట్టుకోవడానికి చాలా సమయం పడుతుంది. దీని వల్ల ఏ ఫంక్షన్ కో వెళ్లే పని పెట్టుకుంటే ఇక వెళ్ళినట్టే. దీంతో చాలా మంది అమ్మాయిలు చీర కట్టుకోవాలని ఉన్నా గానీ రాజీ పడిపోతున్నారు. చీర కట్టే ప్రయత్నం చేసినా ఇబ్బంది పడతారు. జారిపోవడం, నడిచేటప్పుడు ఇబ్బంది కలుగుతాయి. అందుకే చాలా మంది అమ్మాయిలు చీరలు కట్టుకోవడమే మానేశారు. ఓ సినిమాలో మహేష్ బాబు.. అమ్మాయిలు జడలు వేసుకోవడం మానేశారే అన్నట్టు.. అమ్మాయిలు చీరలు కట్టుకోవడం మానేశారే అనే పరిస్థితి వచ్చింది.

మరోవైపు భర్తలకు కూడా తమ భార్యలు చీర కట్టుకుంటే చూడాలని అనుకుంటారు. కానీ ఏం లాభం?.. చీర కట్టుకోవడం రాదే అని నిరుత్సాహపడుతున్నారు. అయితే మీకు గుడ్ న్యూస్. చీర కట్టడం రాకపోయినా గానీ అబ్బాయిలు ప్యాంటు, షర్ట్ వేసుకున్నంత ఈజీగా ఒకే ఒక్క నిమిషంలో ఈ చీరను కట్టుకోవచ్చు. ఈ చీర కట్టుకోవడానికి ప్రత్యేకించి శ్రద్ధ పెట్టాల్సిన పని లేదు. చాలా ఈజీగా కట్టుకోవచ్చు. మ్యాగీ తయారు చేయడానికి పట్టే సమయం కూడా ఈ చీర కట్టుకోవడానికి పట్టదు. ఇక నుంచి అమ్మాయిలు చీరకట్టు విషయంలో ధీమాగా ఉండచ్చు. ఏంటి చీర కట్టుకోవడం రాదా అని వెక్కిరించే పెద్దలకు ధీటుగా సమాధానం చెప్పవచ్చు.

జస్ట్ ఇది ప్యాంటుకి ఉన్నట్టు హుక్స్ ఉంటాయి. ఈ హుక్స్ సాయంతో మీరు చీరను కట్టుకోవచ్చు. ఇది మీకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఆ చీర పేరు రెడీ టూ వేర్ శారీ. అంటే ఇన్ స్టాంట్ దోసలా.. పెద్దగా శ్రమ పడకుండా అలా తీసి ఇలా వేసేసుకోవచ్చునన్నమాట. నేటి జనరేషన్ అమ్మాయిల కోసం ఈ చీరలను తీసుకొచ్చారు. ఈ చీరల గురించి  కొంతమందికి తెలిసే ఉండవచ్చు. కానీ తెలియని వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. రెడీ టూ వేర్ చీరలు కదా అని ఇవి అల్లా టప్పాగా ఏం ఉండవు. రకరకాల డిజైన్స్ లో, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో, అనేక మోడల్స్ లో ఇవి అందుబాటులో ఉన్నాయి. సరసమైన ధరలకే ఇవి దొరుకుతుండడం విశేషం.

సిరిల్ బ్రాండ్ కి చెందిన రెడీ టూ వేర్ శారీలు మీకు 730 రూపాయల నుంచి 800, 900, 1200 ఆపై రేంజ్ లో ఉన్నాయి. మీరు సడన్ గా ఏ పార్టీకైనా వెళ్లాలని అనుకుంటే కనుక నిమిషంలో ఈ చీర కట్టుకోవచ్చు. మీ భర్త రెడీ అయ్యేలోపు రెడీ అయిపోవచ్చు. మిమ్మల్ని చీరలో చూడాలన్న మీ భర్త కలను కూడా నిజం చేసుకోవచ్చు. ఇల్లాలిని చీరలో చూడాలి అనుకునే మగవారు ఈ రెడీ టూ వేర్ చీరలను బహుమతిగా ఇవ్వచ్చు. ఇప్పుడు అమ్మాయిలు కూడా అబ్బాయిల్లానే.. ‘మేము కూడా బయటకు వెళ్లాలంటే రెడీగా ఉన్న రెడీ టూ వేర్ శారీ వేసుకుని వస్తే సరిపోతుంది’ అని అనవచ్చు.

Show comments