PPFలో పెట్టుబడి పెడుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోపోతే భారీగా నష్టపోతారు!

PPF: PPF లో కొత్తగా మార్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం. అవి తెలుసుకోకపోతే ఖచ్చితంగా నష్టపోయే అవకాశం ఉంది.

PPF: PPF లో కొత్తగా మార్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం. అవి తెలుసుకోకపోతే ఖచ్చితంగా నష్టపోయే అవకాశం ఉంది.

ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న మంచి మంచి పథకాలలో ఖచ్చితంగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం (PPF) ఉంటుంది. ఇందులో డబ్బులు పెట్టుబడి పెడితే మంచి లాభాలను పొందవచ్చు. మీరు ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారా? అయితే తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కొత్త రూల్స్ తీసుకొచ్చింది. అవి తెలుసుకోకుంటే కచ్చితంగా నష్టపోతారు. కొత్తగా ఈ స్కీమ్ లో చేరేవారికి ప్రాబ్లం లేదు కానీ.. ఆల్రెడీ ఇందులో డబ్బులు కడుతున్న వారు కచ్చితంగా మార్పులు చేసుకోవాలి. లేదంటే భారీగా నష్టపోయే అవకాశం ఉంది. ఈ కొత్త రూల్స్ అక్టోబర్ 1, 2024 నుంచే అమలులోకి వచ్చేశాయి. ఇంతకీ ఆ రూల్స్ ఏంటి? మనం ఎటువంటి మార్పులు చేసుకోవాలి ? ఇందుకు సంబంధించి పూర్తి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మీ ఇంట్లో మీ పిల్లలు ఉన్నారు. వారికి ఇంకా 18 ఏళ్లు నిండలేదు. వారి పేరు మీదా PPF అకౌంట్ లో డబ్బులు కడుతున్నారు. కానీ ఆ అకౌంట్ లకి పాత వడ్డీలు అప్లై అవ్వవు. ఇంతక ముందు 7.1% వడ్డీ పడేది. కానీ కొత్త రూల్స్ ప్రకారం వడ్డీ భారీగా తగ్గింది. మైనర్ పేరు మీద కట్టే అకౌంట్ లకు కేవలం పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ (POSA) వడ్డీ మాత్రమే చెల్లిస్తారు. POSA వడ్డీ కేవలం 4 % మాత్రమే. సొ ఆ వడ్డీ రేటు మాత్రమే ప్రస్తుతం మైనర్ PPF అకౌంట్ లకు వర్తిస్తుంది. వాళ్ళకు 18 ఏళ్లు దాటిన తరువాత 7.1 % వడ్డీ జమ అవుతుంది. కాబట్టి కొత్తగా PPF అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్న వారు 18 ఏళ్లు నిండాకే అప్లై చేసుకోవడం మంచిది. లేదంటే పెద్దగా లాభాలు పొందలేరు.

ఇక ఇంకో విషయం ఏమిటంటే చాలా మందికి కూడా ఎక్కువ PPF అకౌంట్స్ ఉంటాయి. అలాంటి వారికి మాత్రం ఈ న్యూస్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ అనే చెప్పాలి. ఇంతకముందు ప్రైమరీ అకౌంట్ కి 7.1% వడ్డీ రేటు ఉండగా సెకండరీ అకౌంట్ లకు 4% వడ్డీ ఉండేది. అయితే తాజా రూల్స్ ప్రకారం.. ఒకళ్ళకి ఒక్క అకౌంట్ మాత్రమే ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ ఎక్కువ అకౌంట్లు ఉంటే కచ్చితంగా ఆ అకౌంట్లని ప్రైమరీ అకౌంట్ కి యాడ్ చేసుకోవాలి. లేదంటే భారీగా నష్టపోయే ఛాన్స్ ఉంది. అలాంటి అకౌంట్ లకు ఒక్క రూపాయి వడ్డీ కూడా కేంద్ర ప్రభుత్వం చెల్లించదు. ఈ అకౌంట్ లకు వడ్డీ రేటుని టోటల్ గా 0% చేసింది కేంద్రం. ఇప్పటికీ ఈ అకౌంట్లు మీరు వాడుతుంటే వెంటనే ప్రైమరీ అకౌంట్ కి మార్చేయండి. లేదా ఆ డబ్బును విత్ డ్రా చేసుకొని వేరే ఇన్వెస్ట్ మెంట్ మార్గాలలో పెట్టుబడి పెట్టండి.

ఇక NRI వాళ్ళకు కూడా భారీ షాక్ తగిలింది. కొంతమంది ఇండియాలో PPF అకౌంట్ ఓపెన్ చేసి అందులో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ విదేశాలకు వెళ్లిపోతుంటారు. అక్కడ నుంచే తమ PPF అకౌంట్ లను మైన్టైన్ చేస్తుంటారు. సంవత్సరానికి 1.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే గతంలో NRI లకు కూడా తమ ఇన్వెస్ట్ మెంట్ పై 7.1% వడ్డీ వచ్చేది. కానీ తాజా రూల్స్ ప్రకారం వారికి ఎలాంటి వడ్డీ రాదు. NRI ఖాతాలకు కూడా వడ్డీని 0% చేసేసింది కేంద్రం. అక్టోబర్ 1 నుంచి వారికి ఎలాంటి వడ్డీ జమ కాదు. కాబట్టి ఇక నుంచి NRI లకు PPF అకౌంట్ వలన ఎలాంటి ఉపయోగం లేదు. ఒకవేళ ఎవరైనా NRI లు ఇంకా ఈ అకౌంట్ లను వాడుతుంటే వాటిని క్లోజ్ చేసుకోవడం మంచిది. ఆ డబ్బులను డ్రా చేసుకొని వేరే మార్గాలలో ఇన్వెస్ట్ చేసుకోవడం మేలు. ఇదీ సంగతి. కాబట్టి ఈ రూల్స్ తెలుసుకొని మీరు PPF అకౌంట్ కి అప్లై చేసుకోండి. ఇక ఈ సమాచారం గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments