iDreamPost
android-app
ios-app

ఫోన్‌ స్విచ్ఛాఫ్ అయినా.. పిన్ లేకున్నా.. క్షణాల్లో పేమెంట్స్.. ఎలా అంటే?

  • Published May 25, 2024 | 10:31 AM Updated Updated May 25, 2024 | 10:31 AM

ఆన్ లైన్ పేమెంట్స్ మరింత సులభంగా మారనున్నాయి. ఇకపై ఫోన్ స్విచ్ఛాఫ్ అయినా పిన్ లేకున్నాకూడా పేమెంట్స్ చేయొచ్చు. నియోఫినిటీ కంపెనీ నియోజాప్ అనే పేమెంట్స్ సదుపాయాన్ని తీసుకొచ్చింది.

ఆన్ లైన్ పేమెంట్స్ మరింత సులభంగా మారనున్నాయి. ఇకపై ఫోన్ స్విచ్ఛాఫ్ అయినా పిన్ లేకున్నాకూడా పేమెంట్స్ చేయొచ్చు. నియోఫినిటీ కంపెనీ నియోజాప్ అనే పేమెంట్స్ సదుపాయాన్ని తీసుకొచ్చింది.

ఫోన్‌ స్విచ్ఛాఫ్ అయినా.. పిన్ లేకున్నా.. క్షణాల్లో పేమెంట్స్.. ఎలా అంటే?

ప్రస్తుత కాలంలో అంతా డిజిటల్ పేమెంట్స్ చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. కిరాణా కొట్టు దగ్గర్నుంచి మొదలుకుని షాపింగ్ మాల్స్, హోటల్స్ ఇతరత్రా షాపుల్లో ఆన్ లైన్ చెల్లింపులు చేసేందుకు ఇంట్రస్టు చూపిస్తున్నారు. డిజిటల్ పేమెంట్స్ యాప్స్ అయినటువంటి గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్స్ ద్వారా లక్షల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. కోట్లాది మంది యూజర్లతో డిజిటల్ పేమెంట్ యాప్స్ సేవలను అందిస్తున్నాయి. అయితే ఆన్ లైన్ పేమెంట్ చేయాలంటే ఫోన్ లో చార్జింగ్ ఉండాలి. డేటా ఉండాలి. బ్యాంకులో ఎమౌంట్ కూడా ఉండాలి. అందుబాటులో ఉన్న టెక్నాలజీతో డిజిటల్ చెల్లింపులు మరింత సులభంగా మారుతున్నాయి. ఇప్పుడు ఫోన్ స్విచ్ఛాఫ్ అయినా, పిన్ లేకున్నా కూడా క్షణాల్లో పేమెంట్స్ చేయొచ్చు. ఎలా అంటే?

ఆన్ లైన్ పేమెంట్స్ చేయాలంటే ఇంటర్నెట్ ఉండాల్సిందే. అయితే యూపీఐ లైట్ ద్వారా ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్ చేసే సౌకర్యం ఏర్పడింది. అయితే ఇప్పుడు ఫోన్ స్విచ్ఛాఫ్ అయినా కూడా పేమెంట్ చేయొచ్చు. పిన్ తో కూడా అవసరం లేదు. ఈ విధంగా పేమెంట్స్ జరిపేందుకు వీలుగా నియోఫినిటీ కంపెనీ నియోజాప్ అనే పేమెంట్స్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల్లో ఉన్న ట్యాప్ అండ్ పే ఫీచర్ తరహాలోనే ఇదీ పని చేస్తుంది. నియోజాప్ అనేది ఎన్ఎఫ్‌సీ ట్యాగ్. పిన్ అవసరం లేకుండా పేమెంట్స్ చేసేందుకు వీలు కల్పిస్తుంది. ఇది చూడడానికి పెద్ద సైజ్ సిమ్ కార్డులా కనిపిస్తుంది. దీన్ని ఫోన్ వెనుక భాగంలో అతికించుకోవాలి.

ఎక్కడైనా పేమెంట్స్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ స్టిక్కర్ ట్యాప్ చేస్తే ఈజీగా పేమెంట్ అయిపోతుంది. మెట్రో, బస్, పెట్రోల్ బిల్ చెల్లింపుల వంటివి చాలా సులభంగా పూర్తి చేయవచ్చు. యూపీఐ లైట్ మాదిరిగానే రూ. 2 వేల వరకు పేమెంట్స్ చేయవచ్చు. దీనిని యాప్ ద్వారా సైతం కంట్రోల్ చేసే సదుపాయం ఉంది. సాధారణ యూపీఐ పేమెంట్స్, డెబిట్, క్రెడిట్ కార్డు పేమెంట్ల కంటే చాలా ఈజీగా ఎటువంటి అంతరాయం లేకుండా ట్రాన్సాక్షన్లు పూర్తి చేయవచ్చని కంపెనీ చెబుతోంది. కంపెనీ అధికారిక వెబ్ సైట్ ప్రకారం ప్రీ ఆర్డర్ బుకింగ్స్ మొదలయినట్లు తెలుస్తోంది. రూ.33 చెల్లించి రిజర్వ్ చేసుకోవచ్చు. మొదట బుక్ చేసుకున్న 1500 మందికి రూ.499కే లభ్యం కానుంది. ఆ తర్వాత కొనుగోలు చేయాలంటే రూ. 999 కి తీసుకోవాల్సి ఉంటుంది.