iDreamPost
android-app
ios-app

UPI పేమెంట్స్ లో మార్పులు.. పిన్ లేకుండానే చెల్లింపులు!

UPI: యూపీఐ పేమెంట్స్ విషయంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కీలక మార్పులు చేయబోతోంది. పిన్ లేకుండానే ఆన్ లైన్ పేమెంట్స్ చేయొచ్చు. ఎలా అంటే?

UPI: యూపీఐ పేమెంట్స్ విషయంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కీలక మార్పులు చేయబోతోంది. పిన్ లేకుండానే ఆన్ లైన్ పేమెంట్స్ చేయొచ్చు. ఎలా అంటే?

UPI పేమెంట్స్ లో మార్పులు.. పిన్ లేకుండానే చెల్లింపులు!

డిజిటల్ పేమెంట్ విధానం అందుబాటులోకి వచ్చాక చెల్లింపుల విధానమే మారిపోయింది. పేమెంట్ ప్రక్రియ సులువుగా తయారయ్యింది. నగదు లావాదేవీలు తగ్గిపోయాయి. అంతా ఆన్ లైన పేమెంట్ చేసేందుకు ఇంట్రెస్టు చూపిస్తున్నారు. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం ద్వారా నిత్యం వేలాది ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. యూపీఐ పేమెంట్స్ వినియోగం పెరగడంతో.. మోసాలకు కూడా పెరుగుతున్నాయి. సైబర్ క్రిమినల్స్ మోసపూరిత కాల్స్, మెసేజెస్ ల ద్వారా పిన్ నెంబర్ తెలుసుకుని ఖాతా ఖాళీ చేస్తున్నారు. ఈ మోసాలకు చెరమగీతం పాడేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ పేమెంట్ విధానంలో కీలక మార్పులు తీసుకురానుంది.

యూపీఐ పేమెంట్ చేయాలంటే పిన్ ఉండాల్సిందే. మీరు డిజిటల్ చెల్లింపు చేయాల్సిన ప్రతి సారి పిన్ ఎంటర్ చేసి ధృవీకరించాల్సి ఉంటుంది. అయితే కొన్ని సార్లు పిన్ నెంబర్ తెలుసుకుని మోసాలు చేసే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో ఇలాంటి ఫ్రాడ్ జరుగుతున్నది. యూపీఐ యూజర్లు తమకు తెలియకుండానే డబ్బును కోల్పోతున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ పేమెంట్స్ విషయంలో కీలక మార్పులు చేయబోతోంది. ఇకపై పిన్ లేకుండానే చెల్లింపులు చేయొచ్చు. ఎలా అంటే?

ఈ నేపథ్యంలో ఈ మోసాలను అరికట్టేందుకు పిన్ కు బదులుగా బయోమెట్రిక్ ధృవీకరణను తీసుకురానుంది. ఈ కొత్త విధానంలో యూపీఐ చెల్లింపులను వేలి ముద్ర లేదా ఫేస్ అథెంటికేషన్ ద్వారా ధృవీకరించాల్సి ఉంటుంది. ఈ విధానంలో యూపీఐ పేమెంట్స్ మరింత సురక్షితంగా ఉండనున్నది. యూపీఐ యూజర్లు ఏవిధమైన మోసాలకు గురికాకుండా ఉండొచ్చు. స్మార్ట్ ఫోన్లలో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్లను ఉపయోగించి యూపీఐ చెల్లింపులను మరింత సురక్షితంగా, సులభంగా చేసే విధానంపై ఎన్ పీసీఐ చర్యలు వేగవంతం చేసింది.